![భిన్నమైన పాత్రలో... - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/81401045732_625x300.jpg.webp?itok=J0KrjdPQ)
భిన్నమైన పాత్రలో...
నారా రోహిత్ త్వరలోనే ‘రౌడీ ఫెలో’లా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కృష్ణచైతన్య దర్శకత్వంలో టి.ప్రకాశ్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ-‘‘రోహిత్ కెరీర్‌లో ఇది విభిన్నమైన చిత్రం. ఇప్పటివరకూ తాను చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన పాత్రను ఇందులో చేస్తున్నారు. యాక్షన్‌తో కూడిన ఈ ఫ్యామిలీ డ్రామాను దర్శకుడు చక్కగా తెరకెక్కిస్తున్నాడు. జూన్‌లో పాటలను, జూలైలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. విశాఖా సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో గొల్లపూడి మారుతీరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, ఆహుతి ప్రసాద్, పోసాని కృష్ణమురళి, తాళ్లూరి రామేశ్వరి, రావురమేశ్, సుప్రీత్ తదితరులు ఇతర పాత్రధారులు. సన్నీ స్వరాలందించిన ఈ చిత్రాన్ని మూవీమీల్స్, సినిమా 5 సంయుక్తంగా నిర్మిస్తున్నారు.