సిక్స్ ప్యాక్ కోసం కసరత్తులు చేస్తున్నా!
నారా రోహిత్ హీరోగా కృష్ణచైతన్య దర్శకత్వంలో ప్రకాశ్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘రౌడీ ఫెలో’. ఇటీవలే ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం నారా రోహిత్ విలేకరులతో ముచ్చటించారు. ‘‘కృష్ణచైతన్య నాకు ముందు కథ చెప్పలేదు. కేరక్టరైజేషన్ చెప్పాడు. అక్కడే కనెక్ట్ అయిపోయా. పోలీస్ పాత్ర ఫిట్‌నెస్ గురించి శ్రద్ధ చూపించలేదు. ఇగోయిస్ట్‌గా కనిపించడానికి శ్రద్ధ కనబరిచాను. ముఖ్యంగా ఈ సినిమాకు వచ్చిన నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ నా బరువు. కాస్త బొద్దుగా కనిపించడం మైనస్ అయ్యింది. అయితే... క్రమేణా సినిమాకు పాజిటీవ్ టాక్ రావడం మొదలైంది’’ అని చెప్పారు రోహిత్. ఇక నుంచి కమర్షియల్ దారిలోనే వెళ్లాలనుకుంటున్నాననీ, ఇందులో భాగంగా వెయిట్ తగ్గి సిక్స్‌ప్యాక్ కోసం కసరత్తులు చేస్తున్నాననీ రోహిత్ చెప్పారు.