Prakash Reddy
-
సభలో ఫార్ములా ఈ రేస్ రచ్చ
-
అల్లు అర్జున్ అరెస్ట్ పై పవన్ ఎందుకు స్పందించలేదు?
-
KSR Live Show: చంద్రబాబును నమ్మి రైతులు మోసపోయారు.. ప్రభుత్వంపై ప్రకాశ్ రెడ్డి కామెంట్స్
-
లా అండ్ ఆర్డర్ లో బాబు ఫెయిల్.. అమిత్ షాతో చెప్పే దమ్ముందా పవన్
-
కౌశిక్ రెడ్డి, గాంధీ ఎపిసోడ్.. పాత్రధారి, సూత్రధారి రేవంత్ రెడ్డినే
-
మీ స్వార్థానికి జర్నలిస్టులను బలి చేస్తారా?
అనంతపురం ఎడ్యుకేషన్: చంద్రబాబు, లోకేశ్, ఈనాడు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ–5 సాంబ స్వార్థాలకు జర్నలిస్టులను బలి చేస్తున్నారని రాప్తాడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని, విలేకరులపై దాడులకు తెగబడుతోందంటూ ఈనాడులో వచ్చిన కథనాన్ని ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఖండించారు. అనంతపురంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనాడు, ఏబీఎన్, టీవీ–5 మీడియాను వైఎస్సార్సీపీ బ్యాన్‌చేసి ప్రెస్మీట్లు, మీటింగ్‌లకు రావద్దని స్పష్టంచేసినప్పటికీ ఏకంగా 10 లక్షల మంది వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు వచ్చిన రాప్తాడు ‘సిద్ధం’ సభకు ఏబీఎన్ లోగో పట్టుకుని శ్రీకృష్ణ అనే ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ ఎందుకొచ్చారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఆయనను ఎవరు పంపించారు? దాడి జరుగుతుంటే మరో ఏబీఎన్ ఉద్యోగి అక్కడి నుంచి జారుకోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. అలాగే, ఓవైపు దాడి జరుగుతుంటే రక్షించే ప్రయత్నం చేయకుండా వీడియోలు తీయడం వెనుక ఉద్దేశమేమిటో కూడా పోలీసులు వెలికితీయాలన్నారు. నిజానికి.. ప్రభుత్వంపై ఎంత దుర్మార్గంగా, వాస్తవాలను వక్రీకరించి కథనాలు రాస్తున్నా రాష్ట్రంలో ఎక్కడా దాడులు జరగలేదని.. ఈ సభకు ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ లోగో పట్టుకుని వెళ్లడం చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. దాడులకు వారే బాధ్యత వహించాలి.. ఇక రాప్తాడులో ఏబీఎన్ ఫొటోగ్రాఫర్‌పై, కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడి జరిగినా అందుకు పూర్తిబాధ్యత వహించాల్సింది చంద్రబాబు, లోకేశ్, ఏబీఎన్ రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు, టీవీ–5 సాంబ మాత్రమేనని తోపుదుర్తి స్పష్టంచేశారు. గతంలో పవన్‌కళ్యాణ్, మోదీని కూడా చాలా దుర్మార్గంగా మాట్లాడారని ప్రకాష్‌రెడ్డి గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రజాస్వామ్యవాదులని, చాలా సహనం, ఓర్పు కల్గిన వాళ్లని ఆయనన్నారు. తప్పుడు కథనాలు రాస్తూ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని భావిస్తే అది వారి అమాయకత్వమే అవుతుందన్నారు. -
కరెంటు కావాలా, కాంగ్రెస్ కావాలా తేల్చుకోమన్న కేటీఆర్
-
ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఏ ఏ బిల్లులు ప్రవేశపెడతారు?
-
‘తమ్ముళ్లే’ ఆ గంజాయి బాబులు!
సాక్షి, పుట్టపర్తి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక.. ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఎదుర్కొనే దమ్ములేక టీడీపీ నేతలు విష సంస్కృతికి తెరలేపారు. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బలో గంజాయి సేవించి హల్చల్ చేసిన యువకులు టీడీపీ కార్యకర్తలు అయినప్పటికీ వారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనుచరులని తప్పుడు ప్రచారం చేస్తూ బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్‌కు సన్నిహితంగా ఉండే కార్తీక్.. ఈ నెల 23న తన స్నేహితులతో కలిసి గంజాయి సేవించి వాహనాలతో రోడ్లపై హడావుడి చేశారు. అడ్డొచ్చిన వాహనాలను ఢీకొట్టారు. ఎదురు మాట్లాడిన వ్యక్తిని చితకబాదారు. పోలీసులు పట్టుకుంటే ‘వైఎస్సార్సీపీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి’ స్టిక్కర్ చూపించారు. తాము చేసిన అరాచకాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపైకి నెట్టేందుకే ఈ స్టిక్కర్’ చూపించినట్లు తెలుస్తోంది. బురద జల్లేందుకే.. నిజానికి.. 2019 ఎన్నికల్లో రాప్తాడు నుంచి టీడీపీ తరఫున పోటీచేసి ఘోరంగా ఓడిపోయిన పరిటాల శ్రీరామ్.. రాజకీయంగా ఎదుర్కొనే సత్తాలేక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై బురదజల్లేందుకు ఆకతాయిలను రోడ్లపై వదిలినట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. గంజాయి మత్తులో వీరంగం చేయడంతో పాటు అధికార పార్టీ నేతలను లాగాలని చూడటం తెలుగు తమ్ముళ్లకు సరికాదని వైఎస్సార్సీపీ శ్రేణులు సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చాయి. ఇక ముదిగుబ్బ పోలీసుల అదుపులో ఉన్న కార్తీక్ గురించి వైఎస్సార్సీపీ నేతలు ఆరా తీయగా పరిటాల శ్రీరామ్‌కు అత్యంత సన్నిహితుడిగా తేలింది. అదేవిధంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో దిగిన అతని ఫొటోలూ సేకరించారు. -
రోడ్లపై వాహనాలు పార్క్ చేస్తే కఠిన చర్యలు
హిమాయత్‌నగర్: రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలు పార్క్ చేసి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తథ్యమని ట్రాఫిక్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి హెచ్చరించారు. నారాయణగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బషీర్‌బాగ్, స్కైలాన్ థియేటర్ ఏరియా, హిమాయత్‌నగర్ విజయ డయాగ్నోస్టిక్ లైన్ ప్రాంతాల్ని అడిషినల్ డీసీపీ రంగారావు, సెంట్రల్‌జోన్ ఏసీపీ మురళీకృష్ణ, నారాయణగూడ ఇన్స్పెక్టర్ వెంకన్న, అబిడ్స్ ఇన్స్పెక్టర్ సుధాకర్ తదితరులతో కలసి సోమవారం ప్రకాష్‌రెడ్డి పరిశీలించారు. రోడ్డుపై పార్క్ చేసిన వాహనాలకు సంబంధించిన వివరాలు సేకరించారు. అక్కడే ఉన్న కొందరు వ్యాపారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీమీ అపార్ట్మెంట్లు, షాప్స్‌కు సంబంధించిన పార్కింగ్ ప్లేసులో మాత్రమే పార్క్ చేయాలని ఆదేశించారు. -
పరిటాల బాగోతాన్ని బట్టబయలు చేస్తానని వార్నింగ్.?
-
దిశ : పోలీసులపై కేసు పెట్టారా లేదా?
సాక్షి, హైదరాబాద్ : ‘దిశ’హత్యాచార నిందితులను ఎన్కౌంటర్ చేసిన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారో లేదో వెల్లడించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పౌర హక్కుల సంఘం (పీయూసీఎల్)–మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శాకాలను పోలీసులు అమలు చేసినదీ, లేనిదీ ఈ నెల 12న జరిగే విచారణ సమయంలో తెలియజేయాలని ఆదేశించింది. ఆ మార్గదర్శాకాల ప్రకారం ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉందని తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల అమలుకు సంబంధించిన ఆధార పత్రాలను అందజేయాలని ప్రతివాదులైన హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ ఇతరులను ఆదేశించింది. ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన రెండు ప్రజాహిత వ్యాజ్యాలపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. పోలీసులు ఎన్కౌంటర్ పేరుతో నిందితులను కాల్చి చంపారని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంతోపాటు నిందితుల మృతదేహాలకు తిరిగి పోస్టుమార్టం నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ వివిధ మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు దాఖలు చేసిన ఫిర్యాదును హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించింది. ఇదే తరహాలో న్యాయవాది, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ సభ్యుడు కె. రాఘవేంద్ర ప్రసాద్ దాఖలు చేసిన పిల్‌ను కలిపి ధర్మాసనం విచారించింది. ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్యాచారం కేసులో శ్యాంబాబు అనే యువకుడి పాత్ర ఉందంటూ పోలీసులు అతన్ని మట్టబెట్టాలని ప్రయత్నించారని, పౌరహక్కుల సంఘాలు సకాలంలో కేసులు వేయడంతో చివరకు ఆ కేసుతో శ్యాంబాబుకు ప్రమేయం లేదని హైకోర్టు తేల్చిందని ఈ సందర్భంగా పిటిషనర్లు గుర్తుచేశారు. ‘దిశ’కేసులో నిందితులు రిమాండ్‌లో ఉండగా పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారణ పేరుతో ఘటనా స్థలానికి తీసుకువెళ్లి హత్య చేశారని ఆరోపించారు. పోస్టుమార్టం నివేదికను పరిశీలిస్తే నిందితులను సమీపం నుంచి హతమార్చారని స్పష్టం అవుతోందన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయక్కర్లేదు: ఏజీ అనంతరం ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదిస్తూ సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఎన్కౌంటర్ చేసిన పోలీసులపై దాఖలైన కేసులో ఉమ్మడి ఏపీ హైకోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం వెలువరించిన తీర్పు అమలును నిలిపివేస్తూ సుప్రీంకోర్టు 2014లో స్టే జారీ చేసిందని గుర్తుచేశారు. పోలీసులపై 302 సెక్షన్ కింది కేసు నమోదు చేయాలని పిటిషనర్లు కోరడం చెల్లదని, ఆత్మరక్షణ కోసమే పోలీసులు ఎన్కౌంటర్ చేశారన్నారు. దీనిపై ధర్మాసనం ఘాటుగా స్పందిస్తూ పీయూసీఎల్–మహారాష్ట్ర మధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఆ కేసు తీర్పులోని పేజీ 5లో ఇది స్పష్టంగా ఉందని గుర్తుచేసింది. రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు చట్టం అవుతుందని గుర్తుచేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేసి ఉంటే వాటికి సంబంధించిన పత్రాలను సమర్పించాలని కోరింది. తిరిగి అడ్వొకేట్ జనరల్ వాదిస్తూ ఇదే తరహాలో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను సుప్రీంకోర్టు సోమవారం విచారించి బుధవారానికి వాయిదా వేసిందని, అక్కడి కేసు విచారణ జరిగిన తర్వాత గురువారం ఈ పిల్స్‌ను విచారించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఏజీ అభ్యర్థన మేరకు ఇక్కడి కేసుల విచారణను 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఈలోగా ఎన్కౌంటర్లో హతమైన నలుగురి మృతదేహాలను ఈ నెల 13 వరకూ భద్రపర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో మృతదేహాల్ని భద్రపర్చేందుకు తగిన సౌకర్యాలు లేనట్లయితే వాటిని ఏసీ ఉన్న వాహనంలో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. మృతదేహాలు చెడిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని భద్రపర్చాలని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కేసులో కోర్టుకు సహాయకారిగా ఉండేందుకు సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డిని అమికస్ క్యూరీగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. -
వివరాలు మాత్రమే తీసుకున్నారు: డీసీపీ
సాక్షి, శంషాబాద్: దిశ ఘటన, నిందితుల ఎన్కౌంటర్ స్థలాన్ని ఏడుగురు సభ్యులతో కూడిన జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం పరిశీలించిందని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. అంతకుముందు మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రిలో మార్చురీలో ఉన్న నలుగురు నిందితుల మృతదేహాలను పరిశీలించిందని పేర్కొన్నారు. అనంతరం నలుగురు నిందింతులు మృతి చెందిన ప్రాంతాన్ని పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఎన్హెచ్ఆర్సీ బృందానికి సీనియర్ ఎస్పీ నేతృత్వం వహిస్తున్నారని ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ బృందంలో ఫోరెన్సిక్ నిపుణుడు కూడా ఉన్నారని తెలిపారు. ఘటనకు సంబంధించి వారు తమ దగ్గర వివరాలు మాత్రమే తీసుకున్నారని వెల్లడించారు. వారు మీడియాతో మాట్లాడే వీలు లేనందున వాళ్ల తరఫున తనను మాట్లాడమన్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణాధికారిగా రాచకొండ అదనపు డీసీపీ సురేందర్‌రెడ్డి నియమితులయ్యారు. చటాన్‌పల్లి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌పై ఆయన దర్యాప్తు జరుపనున్నారు. కాగా షాద్‌నగర్ సమీపంలో గత నెల 27న వెటర్నరీ వైద్యురాలిపై మహ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులు అత్యాచారం చేసి, అనంతరం ఆమెపై పెట్రోలు పోసి తగులబెట్టిన విషయం విదితమే. ఈ క్రమంలో నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు శుక్రవారం.. క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా వారు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. -
వైసీపీ నేతల తలలు నరుకుతాం!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: గతంలో ఫ్యాక్షన్ గొడవలతో అట్టుడికిన అనంతపురం జిల్లాలో గడిచిన ఐదు నెలల కాలంలో ప్రశాంతవాతావరణం నెలకొంది. ఈ వాతావరణాన్ని చెడగొట్టే ఉద్దేశ్యంతోనే జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ప్రోద్భలంతో ఆ పార్టీకి చెందిన సాకే పవన్... ప్రకాష్ రెడ్డితో పాటు ఇతర వైసీపీ నేతల తలలు నరుకుతామని వ్యాఖ్యలు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. ఒకవైపు వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి నేతృత్వంలో పరిపాలన సాగుతుండగా... కులాల ప్రస్తావనతో పాటు తలలు నరుకుతామంటూ మదనపల్లెలో స్వయంగా పవన్‌కళ్యాణ్ సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేయడం వెనక కుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో వివిధ ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. మరోవైపు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి... ఎస్పీకి కలిసి జనసేన నేతల వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. మరోవైపు ఎస్వీ యూనివర్శిటీతో... పవన్ విజ్ఞతకే వదిలేస్తున్నా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీకి చెందిన వ్యక్తి చేసిన వ్యాఖ్యలను పవన్ విజ్ఞతకే వదిలేస్తున్నానని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘సాకే పవన్ మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయుడు. ఎన్నికల్లో నన్ను ఓడించాలనే కుట్రతోనే అతన్ని జనసేన తరపున బరిలోకి దింపారు. అలాంటి వ్యక్తి కేవలం నన్ను మాత్రమే కాకుండా ఇతర వైసీపీ నేతల తలలు కూడా నరుకుతామనే విధంగా వ్యాఖ్యానించారు. అక్కడే ఉన్న పవన్ కనీసం వారించలేదు. మొన్నటి ఎన్నికల్లో సరిగా డిపాజిట్లు కూడా దక్కించుకోలేని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అడ్రస్సులేని రాజకీయ నేత.’’ అన్నారు. తన రాజకీయ ఉనికిని కాపాడుకొనేందుకు గుర్తింపు లేని కొంతమంది నాయకులు, కార్యకర్తలను వెంట వేసుకొని తిరుగుతున్నాడన్నారు. టీడీపీతో కుమ్మకై గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ తన ఉనికిని కాపాడుకొనేందుకు అడ్రస్సులేని తన పార్టీ కార్యకర్తలు అనవసరమైన మాటలు మాట్లాడించాడన్నారు. అయితే రాప్తాడు నియోజక వర్గంలో ప్రస్తుతం ఫ్యాక్షన్ రాజకీయాల దూరంగా శాంతికుసుమాలు పూయిస్తున్న తరుణంలో తిరిగి ఇక్కడ ఫ్యాక్షన్ ను ప్రేరేపించే వాఖ్యలు చేయటం తగదన్నారు. ఇటువంటి వ్యాఖ్యలను ఖండించటంతో పాటు వాటిని మాట్లాడిన జనసేన పార్టీ నేతతో పాటు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. సాకే పవన్ కుమార్ వెనుక ఎవరూ..? మా అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డితో పాటు జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు తలలు నరుకుతామని అనుచిత వ్యాఖ్యలు చేసిన సాకే పవన్‌కుమార్ వెనుక ప్రతిపక్ష టీడీపీ నేతల హస్తం ఉన్నట్టు వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలానికి చెందిన సాకే పవన్ కుమార్ ప్రస్తుతం అనంతపురంలోని చిన్న మెకానిక్ షాపు పెట్టుకొని జీవిస్తున్నాడు. అయితే ఇతను గతంలో పరిటాల కుటుంబానికి దగ్గరగా ఉండేవాడని, గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారి ప్రోద్బలంతోనే ఇతను జనసేన తరఫున పోటీ చేశాడని తెలుస్తోంది. అయితే ఎన్నికల్లో తన పార్టీ తరఫున ప్రచారం చేసుకోకుండా టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌తో డబ్బులు తీసుకొని వారికి మద్దతుగా పనిచేసినట్లు ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు కూడా టీడీపీ నాయకుల ప్రోత్సాహంతోనే అతను ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డిపై అనుచిత మాట్లాడాడని నియోజక వర్గంలోని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. జనసేన పార్టీ దిష్టిబొమ్మ దహనం వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అనంతపురంలోని ఎస్కే యూనివర్శిటీ ముఖద్వారం వద్ద గురువారం సాయంత్రం జనసేన పార్టీ దిష్టి బొమ్మను దహనం చేశారు. నాయకులు జయచంద్రారెడ్డి, అంకే శ్రీనివాస్, హేమంత్‌కుమార్, హనుమంతరెడ్డి తదితరులు మాట్లాడుతూ రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు తగవన్నారు. పవన్‌కుమార్‌పై చర్యలు తీసుకోండి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డిపైన, రెడ్డి సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాప్తాడు జనసేన పార్టీ నాయకుడు సాకే పవన్‌కుమార్ చర్యలు తీసుకోవాలని చెన్నేకొత్తపల్లి మండల వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల కన్వీనర్ మైలారపు గోవిందరెడ్డితో కలసి చెన్నేకొత్తపల్లి పోలీస్‌స్టేషన్ ఎస్ఐ రమేష్‌బాబుకు ఫిర్యాదు చేశారు. -
హన్మకొండ: నేను లోకల్.. 45 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా..
సాక్షి, హన్మకొండ: నేను పక్కా లోకల్...45 ఏళ్ల నుంచి హన్మకొండలోనే ఉంటున్నా...నగరం నడిబొడ్డున భవానినగర్‌లో నా ఇళ్లు... కుటుంబంతో సహా ఈ ఇంటిలో ఉంటున్నా...బాల్యంలో చదువుకున్నది కూడా ఇక్కడే...తాను స్థానికేతరుడిని ఎలా అవుతానని ప్రజా కూటమి అభ్యర్థి రైవూరి ప్రకాష్‌రెడ్డి విమర్శకులకు సవాల్ విసిరారు. శుక్రవారం హన్మకొండలోని వడ్డెపల్లి, ముదిరాజ్ వాడ, ఎస్సీ వాడ, బాలయ్య హోటల్, ఎన్జీవోస్ కాలనీ, ఇందిరానగర్‌లో పాదయాత్ర నిర్వహించి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి తనకు ఓట వేసి గెలిపించాలని అభ్యర్థించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి, నుదిటిపై తిలకం దిద్దారు. ఈ ప్రచారంలో రేవూరి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తిని నేనేనని... తెలంగాణ ద్రోహిని ఎలా అవుతానని ప్రశ్నిం చారు. చిదంబరంతో జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షను గట్టిగా వినిపించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన విషయాన్ని కేసీఆర్‌ను అడిగి తెసుకోవాలని టీఆర్ఎస్ అభ్యర్థి వినయ్‌భాస్కర్‌కు సూచించారు. కారుకు ఓటేస్తే ప్రజల బతుకులు బుగ్గిపాలు అవుతాయన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడతూ మచ్చలేని వ్యక్తి రేవూరి ప్రకాష్‌రెడ్డి అని, కబ్జాలకై లాలూచీ పడే వ్యక్తి కాదని, నిస్వార్థ సేవకుడని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి మహ్మద్ రియాజ్, ప్రజా కూటమి నాయకులు బంక సంపత్ యాదవ్, నాయిని లక్ష్మారెడ్డి, బంక సరళ, నాగరాజు, తాళ్లపల్లి జయపాల్, పల్లె రాజిరెడ్డి, రవీందర్, దొంగరి సతీష్ పాల్గొన్నారు. -
వైఎస్ జగన్‌పై దాడి: ఏఏఐ ప్రకటన
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడికి సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది. రెస్టారెంట్లో వెయిటర్‌గా పనిచేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్‌పై దాడికి పాల్పడట్టు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ డైరక్టర్ జి ప్రకాశ్ రెడ్డి ఆ ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరమే వైఎస్ జగన్ హైదరాబాద్ బయలుదేరినట్టు వెల్లడించారు. ‘వైఎస్ జగన్ మధ్యాహ్నం 1.05 గంటలకు ఇండిగో విమానంలో హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. అందుకోసం వైఎస్ జగన్ వీఐపీ లాంజ్‌లో వేచి చూస్తుండగా.. 12.40 గంటల ప్రాంతంలో ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో పనిచేస్తున్న వెయిటర్ కత్తితో ఆయనపై దాడి చేశాడు. ఈ దాడిలో వైఎస్ జగన్ ఎడమ భుజానికి గాయం కావడంతో పాటు, రక్తస్రావం జరిగింది. దీంతో ఆయనకు వెంటనే ఎయిర్పోర్ట్ డ్యూటీ డాక్టర్ పర్యవేక్షణలో ప్రాథమిక చికిత్స అందించటం జరిగింది. ఆ తర్వాత ఆయన తను వెళ్లాల్సిన ఫ్లైట్‌లో హైదరాబాద్ వెళ్లారు. ఆయనపై దాడి చేసిన నిందితుడిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పోలీసు శాఖ ఈ విషయంపై విచారణ చేపట్టింది. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌లో పరిస్థితి సాధారణ నెలకొంద’ని ప్రకటనలో పేర్కొన్నారు. -
‘కొండ’ అంత సమస్య!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘కారు’ స్పీడ్‌కు బ్రేక్ వేసేందుకు జట్టు కట్టిన మహాకూటమికి ‘కొండ’ అంత సమస్య వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీట్ల సర్దుబాటు అత్యంత జటిలంగా మారింది. పొత్తుల్లో భాగంగా టీడీపీకి అడుగుతున్న నర్సంపేట, పరకాల సీట్ల సర్దుబాటు వ్యవహారం అంత ఈజీగా తెగేటట్లు లేదు. ఈ రెండు సీట్లు అటు కాంగ్రెస్, ఇటు టీడీపీకి అత్యంత కీలకంగా మారాయి. ఇరు పార్టీలకు ఇక్కడ కొంత సంస్థాగతమైన బలం ఉండడం, కీలక నేతలే ఇక్కడ పోటీకి ఉవ్విళ్లూరుతుండడంతో పంపకాల సమస్య సంక్షిష్టంగా మారింది. ఉమ్మడి వరంగల్‌లో టీడీపీకి ఒక్క సీటే... రాష్ట్రంలో కాంగ్రెస్‌తో జతకట్టిన తెలుగుదేశం, సీపీఐ, టీజేఎస్ పార్టీలు సీట్ల సర్దుబాటుపై ఒక ప్రాథమిక అవగాహనకు వచ్చాయి. గెలిచే అవకాశం ఉన్న సీట్లను మాత్రమే అడిగి తీసుకోవాలని కూటమి పార్టీలన్నీ ఒక మౌఖిక అంగీకారానికి వచ్చాయి. ఈనేపథ్యంలో మిత్రపక్ష పార్టీలు తాము పోటీ చేయాలనుకుంటున్న సీట్ల వివరాలను కాంగ్రెస్ పార్టీకి అందజేశాయి. తెలుగుదేశం 19, టీజేఎస్ 25, సీపీఐ 12 సీట్లను కేటాయించాలని కోరినట్లు విశ్వసనీయంగా తెలి సింది. ఇందులో టీడీపీకి 15 సీట్లు, టీజేఎస్, సీపీఐ పార్టీలకు మూడేసి సీట్ల చొప్పన ఇచ్చేం దుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంగీకరించినట్లు తెలుస్తోంది. రాష్ట్రం యూనిట్‌గా సీట్ల పంపకాలు ఉంటుండడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 సీట్లలో కేవలం ఒక్క సీటు మాత్రమే మిత్రపక్షాలకు వదిలేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ ఒక్క సీటు ఎవరికి అనేది సుస్పష్టమే కానీ.. ఎక్కడ ఇవ్వాలో తెలియక ఉత్కంఠత నెలకొని ఉంది. ఇక్కడే పీటముడి... పరకాల, భూపాలపల్లి, నర్సంపేట, నియోజకవర్గాలు తమకు కేటాయించాలని తెలుగుదేశం పార్టీ అడుగుతోంది. జిల్లాలో ఒక సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే ఒక్క సీటు ఇస్తే అది కచ్చితంగా నర్సంపేట ఇవ్వాలని టీడీపీ పట్టుబడుతోంది. ఆ ఒక్క సీటు కూడా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, చంద్రబాబునాయుడికి సన్నిహితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి టీడీపీ ఇచ్చే యోచనలో ఉంది. గతంలో ఆయన ఇక్కడ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈ నియోజకర్గంలో కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఉండడంతో అది సాధం కాదని ఆ పార్టీ నేతలు కరాఖండీగా చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దొంతి మాధవరెడ్డి వాస్తవానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంటుగా నిలబడి సత్తా చాటారు. అనంతరం తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. టీఆర్ఎస్ పార్టీ ప్రలోభాలకు, ఇబ్బందులకు తట్టుకుని నిలబడ్డారు. ఆయనకు టికెట్ ఇవ్వకుండా ఉండలేమని కాంగ్రెస్ పార్టీ తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. పరకాల కోసం కొండా దంపతుల ఆసక్తి.. ప్రకాష్‌రెడ్డి మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. దీంతో స్వయంగా చంద్రబాబే కల్పించుకుని రేవూరిని గెలిపించే విధంగా సీటు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగాపరకాల నియోజకవర్గాన్ని రేవూరి ప్రకాష్‌రెడ్డికి ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు తెలిసింది. ప్రకాష్‌రెడ్డి కొంత అసంతృప్తి వ్యక్తం చేసినా.. చివరకు పరకాల నుంచైనా తాను పోటీకి సిద్ధమే అని చెప్పినట్టు తెలిసింది. ఈ వ్యవహారం ఇలా ఉండగా.. ఇటీవలే టీఆర్ఎస్ నుంచి సొంత గూటికి చేరిన కొండా సురేఖ, మురళి దంపతులు మొదటి నుంచీ పరకాల, వరంగల్ తూర్పు, భూపాలపల్లి నియోజకవర్గాలపై దృష్టిపెట్టారు. ఇందులో కనీసం రెండు సీట్లు అడుగుతున్నారు. ఒక వేళ ఒక సీటు ఇస్తే పరకాల నుంచి పోటీ చేయాలనే ఆలోచనను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందు వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది. అప్పుడు రేవూరి ప్రకాష్‌రెడ్డిని ఎక్కడ నుంచి పోటీ చేయించాలనే అనే సందిగ్ధత నెలకొని ఉంది. -
ఉపాధి హామీ కూలీలను కూడా బెదిరించారు
-
టీఆర్ఎస్ శ్రేణుల్లో కలకలం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటు వ్యవహారం టీఆర్ఎస్లోనే అసంతృప్తిని రాజేస్తోందా? వీడియో ఫుటేజీల నేపథ్యంలో ఏజీ ప్రకాశ్‌రెడ్డి రాజీనామా అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికీ చెడ్డపేరు తెస్తుందని అధికార పార్టీ నేతలే భావిస్తున్నారా? వీటికి టీఆర్ఎస్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఈ వరుస పరిణామాలు ప్రభుత్వానికి ఇబ్బందికరమేనని మంత్రులే తమ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే గవర్నర్ ప్రసంగం సందర్భంగా తెలంగాణ ఉద్యమ సమయంలో తలెత్తిన ఘటనలు మరిచిపోకముందే ఎమ్మెల్యేలపై వేటు వేయడాన్ని వివిధ పార్టీలే కాకుండా ఉద్యమంలో పాలుపంచుకున్న ప్రొఫెసర్లు, సామాజిక, ప్రజా సంఘాల నేతలు తప్పుబడుతున్నారు. వీడియో ఫుటేజీలను ప్రతిపక్ష పార్టీల నేతలకు చూపించకుండా, సరైన ప్రొసీజర్ పాటించకుండానే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడాన్ని ఒకరిద్దరు మంత్రులు తమ సన్నిహితుల వద్ద తప్పుబడుతున్నారు. ‘‘తెలంగాణ ఉద్యమం సందర్భంగా మనం వ్యవహరిం చిన తీరు ప్రపంచానికి అంతా తెలుసు. ఇదే గవర్నర్, ఇలాంటి ప్రసంగం సందర్భంగానే జరిగిన ఘటనలకు సభలో నేను ప్రత్యక్ష సాక్షిని. అప్పుడు అధికారంలో ఉన్నవారూ ఇలాంటి నిర్ణయమే తీసుకుంటే మేం సభలో ఉండేవాళ్లమా? ఇలాంటి నిర్ణయాన్ని ఊహించ లేదు’’అని మంత్రివర్గంలోని ముఖ్యుడొకరు తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. వేటు వేయడం ద్వారా ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందన్న విమర్శలకు తావిచ్చినట్టుగా ఉంటుందని, ఈ నిర్ణయాన్ని పున:సమీక్షించాలని ఒకరిద్దరు మంత్రులు సున్నితంగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారని ఆయన వెల్లడించారు. అయితే ఆ నిర్ణయంపై ఒత్తిడి పెంచే అవకాశం ఇవ్వకుండానే ఖాళీలను ప్రకటిస్తూ శాసనసభ కార్యాలయం నుంచి ఎన్నికల సంఘానికి అదేరోజు లేఖను పంపించారని వెల్లడించారు. కోమటిరెడ్డి, సంపత్‌లపై సానుభూతిని పెంచామేమో.. అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌పై వివిధ వర్గాల్లో సానుభూతిని తామే పెంచామని టీఆర్ఎస్కు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. ఏకంగా అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో వారిపట్ల కాంగ్రెస్‌లోనే కాకుండా తెలంగాణవాదులు, ప్రజల్లో సానుభూతి పెరగడానికి కారణమైందని విశ్లేషించారు. ‘‘అణచివేతకు గురైనవారిపై ఏ సమాజానికైనా సానుభూతి ఉంటుంది. తెలంగాణలో ఇది కొంచెం ఎక్కువ. ఉద్యమం సందర్భంగా రాష్ట్ర ఆకాంక్షలతో పాటు వివిధ సందర్భాల్లో అప్పటి ప్రభుత్వం అనుసరించిన నిర్బంధం కూడా టీఆర్ఎస్పై సానుభూతి పెరగడానికి ప్రధాన కారణమే. అప్పుడు టీఆర్ఎస్పై నిర్బంధానికి వ్యతిరేకంగా పనిచేసిన వర్గాలు.. ఇప్పుడు టీఆర్ఎస్ తీసుకున్న అంతకంటే తీవ్రమైన నిర్ణయంతో ఏకీభవిస్తాయా? రాజకీయ వ్యూహం ఏమున్నా సభ్యత్వంపై వేటు వేయడం పార్టీలోనూ చాలామందికి నచ్చడం లేదు. దీంతో ఎవరు అధికారంలో ఉన్నా, ఎప్పుడైనా ప్రతిపక్ష సభ్యులను శాసనసభ్యత్వానికి అనర్హులుగా చేయొచ్చన్న సందేశాన్ని ఇచ్చినవాళ్లం అవుతున్నం. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అనర్హులను చేస్తే ఇక ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంది’’అని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. మరో ఎమ్మెల్యే కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. దాంతోనే ఎక్కువ నష్టం.. ఎమ్మెల్యేల అనర్హతపై న్యాయస్థానంలో ఎలాంటి నిర్ణయం వస్తుందో, శాసనసభ ఎలా ప్రతిస్పందిస్తుందో అన్న అంశాల కంటే ఏజీ రాజీనామా వ్యవహారమే ఎక్కువ నష్టం చేస్తుందని పార్టీ నేతలు అంటున్నారు. ఇది ఎమ్మెల్యేలపై వేటు విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పేనన్న సంకేతాలిస్తుందని అభిప్రాయపడుతున్నారు. అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు అనుచితంగా వ్యవహరిస్తే వీడియో ఫుటేజీని ఎందుకు బయటపెట్టడం లేదన్న ప్రశ్నకు ఏం సమాధానం ఇస్తామని ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామికంగా, ప్రజలతో ఎన్నికైన ఎమ్మెల్యేలను ఇంత సునాయాసంగా తొలగించవచ్చన్న అభిప్రాయం కూడా మంచిది కాదని వారంటున్నారు. ఇదంతా ఏకపక్షంగా, నిరంకుశంగా వ్యవహరిస్తున్నామన్న విమర్శలకు అవకాశం కల్పించినట్టుగా ఉందంటూ అధికార పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. -
‘గన్మెన్లను తొలగించడం దారుణం’
సాక్షి, హైదరాబాద్ : నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి గన్మెన్లను తొలగించడం దారుణమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన కోమటిరెడ్డిని టీఆర్ఎస్ ప్రభుత్వం అవమానిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే కోమటిరెడ్డి ముఖ్య అనుచరుడు బోడెపల్లి శ్రీనివాస్‌ను హత్య చేశారని, ఇప్పుడు ఆయనకు ఏమైన అయితే ప్రభుత్వానిదే బాధ్యత వహించాలన్నారు. కోమటిరెడ్డికి ప్రాణ హాని ఉందని గతంలోనే ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. ఇలాంటి కక్ష్యపూరిత నిర్ణయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుందని శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వపు నీతిమాలిన చర్య అసెంబ్లీలో జరిగిన సంఘటనలో కేవలం కోమటిరెడ్డి విసిరిన విజువల్స్ మాత్రమే చూపిస్తున్నారని, స్వామిగౌడ్‌కి తాకిన విజువల్స్‌ని చూపించడంలేదని శ్రావణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వపు దిక్కుమాలిన చర్యగా ఆయన అభివర్ణించారు. కేసీఆర్ నీతిమాలిన చర్యతోనే అడ్వకేట్ జనరల్ ప్రకాశ్ రెడ్డి రాజీనామా చేశారన్నారు. న్యాయంగా వీడియో ఫుటేజ్‌లను ఇస్తామని చెప్పిన ప్రకాశ్ రెడ్డిని ప్రభుత్వం అవమానించిదన్నారు. కేసీఆర్ రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం న్యాయంగానే సస్పెండ్ చేస్తే సాల్వే వంటి అత్యంత ఖరీదైన అడ్వకేట్ ఎందుకని ప్రశ్నించారు. బీసీలు అయినా మధుసూదనాచారి, స్వామిగౌడ్‌లను పావులుగా మార్చుకొని ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. -
ఏజీ రాజీనామాకు కారణమేంటీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి రాజీనామా చేయడం ప్రభుత్వ దుందుడుకుతనం, అహంకారానికి నిదర్శమని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రకాష్‌రెడ్డి రాజీనామాకు ప్రభుత్వ వేధింపులు కారణమా? లేక అడ్వకేట్ జనరల్ నిర్ణయాలకు ప్రభుత్వం అడ్డుపడుందా అనేది చెప్పాలని డిమాండ్ చేశారు. మరో వైపు కాంగ్రెస్ పెట్టె అవిశ్వాస తీర్మానంపై మద్దతు తెలుపుతామన్న టీఆర్ఎస్.. కొద్దిరోజులుగా టీడీపీ, వైఎస్సార్ సీపీ పార్టీలు పెడుతున్న అవిశ్వాస తీర్మానాలపై ఎందుకు మద్దతు తెలుపలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ గందరగోళ నిర్ణయానికి తెరలేపుతోందని విమర్శించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు దొందు దొందే అని ఆయన విమర్శించారు. -
తెలంగాణ అడ్వకేట్ జనరల్ రాజీనామా
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ద్వారా గవర్నర్‌కు పంపినట్లు తెలిసింది. అయితే ప్రకాశ్‌రెడ్డి రాజీనామా లేఖపై గవర్నర్ నిర్ణయం వెలువడాల్సి ఉంది. అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ల బహిష్కరణకు సంబంధించిన కేసు మంగళవారం విచారణకు రానున్న నేపథ్యంలో ప్రకాశ్‌రెడ్డి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. కోమటిరెడ్డి బహిష్కరణ వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో చోటుచేసుకున్న పరిణామాలే ప్రకాశ్‌రెడ్డి రాజీనామాకు దారి తీసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ నెల 12న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించిన ఒరిజినల్ వీడియో ఫుటేజీలను సమర్పిస్తామంటూ హైకోర్టుకు ఏజీ హోదాలో ప్రకాశ్‌రెడ్డి హామీ ఇవ్వడంపై సీఎం కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వంతో సంప్రదించకుండా అలా ఎలా హామీ ఇస్తారని నిలదీయడంతో ఏజీ నొచ్చుకున్నట్లు సమాచారం. అంతేగాక ఈ కేసులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వేను రప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు ప్రభుత్వం ప్రకాశ్‌రెడ్డికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ కేసు నుంచి తప్పుకోవాలని ఏజీకి స్పష్టం చేయడంతో ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంపై గత రెండ్రోజులుగా తర్జనభర్జన పడ్డ ఏజీ.. తన సన్నిహితుల వద్ద రాజీనామాపై చర్చించారు. అనంతరం రాజీనామా చేయాలని నిర్ణయించుకుని, సోమవారం ఉదయం 11 గంటల సమయంలో లేఖను సీఎస్ ద్వారా గవర్నర్‌కు పంపారు. ఇదీ జరిగింది ఈ నెల 12న అసెంబ్లీలో ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలు నిరసన తెలియచేశాయి. ఈ సమయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి తన చేతిలో ఇయర్ ఫోన్‌ను విసిరేశారు. అది వెళ్లి వేదికపై ఉన్న మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు తగిలిందని, దీంతో ఆయన కంటికి గాయమైందంటూ వివాదం రేగింది. దీన్ని ఆధారం చేసుకొని నల్లగొండ ఎమ్మెల్యే వెంకట్‌రెడ్డితో పాటు అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను కూడా సభ నుంచి బహిష్కరించారు. నల్లగొండ, అలంపూర్ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం వర్తమానం పంపారు. ఈ నేపథ్యంలో ఆ ఇరువురు ఎమ్మెల్యేలు న్యాయ పోరాటానికి దిగారు. తమ బహిష్కరణను సవాల్ చేయడంతో పాటు తమ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించే విషయంలో ముందుకెళ్లకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని, అలాగే గవర్నర్ ప్రసంగం సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించిన మొత్తం ఒరిజినల్ వీడియో ఫుటేజీలను కోర్టు ముందుంచేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. మండలి చైర్మన్ ఉల్లాసంగానే గడిపారు కోమటిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు ఈ నెల 19న విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఇయర్ ఫోన్ విసిరిన తర్వాత కూడా మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఉల్లాసంగా గడిపారని, వేదికపై ఉన్న స్పీకర్‌తో నవ్వుతూ మాట్లాడారని కోర్టుకు తెలిపారు. గవర్నర్ తన ప్రసంగాన్ని పూర్తి చేసి వెళ్లే సమయంలో ఆయనతోపాటు బయట వరకు వెళ్లి వీడ్కోలు పలికి వచ్చారని, ఆ తర్వాతే ఇయర్ ఫోన్ వల్ల కంటికి గాయమైందంటూ ఆరోపణలు మొదలుపెట్టారని తెలిపారు. తర్వాత ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఇయర్ ఫోన్ విసిరి మండలి చైర్మన్‌ను గాయపరిచినందుకు కోమటిరెడ్డి, సంపత్‌లను బహిష్కరించ లేదని, గవర్నర్ ప్రసంగం సందర్భంగా సభ ప్రతిష్ట దెబ్బ తినేలా వ్యవహరించినందుకే బహిష్కరించామని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి, నల్లగొండ, అలంపూర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించే విషయంలో ఆరు వారాల పాటు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు. ఇదే సమయంలో ఒరిజినల్ వీడియో ఫుటేజీలను సీల్డ్ కవర్లో సమర్పించాలని ఆదేశాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మీ ఆదేశాలు వద్దు.. నా హామీ చాలు ఈ సమయంలో ఏజీ ప్రకాశ్‌రెడ్డి స్పందిస్తూ.. వీడియో ఫుటేజీల సమర్పణ విషయంలో ఆదేశాలు అవసరం లేదని, ఫుటేజీని తప్పక సమర్పిస్తామని, ఇది తన హామీ అని చెప్పారు. ప్రకాశ్‌రెడ్డి ఇచ్చిన ఈ హామీని నమోదు చేసిన న్యాయమూర్తి ఫుటేజీల సమర్పణ నిమిత్తం విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఆ తర్వాత హాజరైన అదనపు ఏజీ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. ఫుటేజీలు తీసుకోవాలంటే సభ తీర్మానం అవసరమని, అందువల్ల ఫుటేజీల సమర్పణకు మరింత గడువు కావాలని కోర్టును కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ విచారణను ఈ నెల 27కి వాయిదా వేశారు. ఆ రోజున వీడియో ఫుటేజీలు సమర్పించి తీరాలని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం వద్ద రెండ్రోజుల క్రితం ఓ సమావేశం జరిగినట్లు తెలిసింది. ఈ సందర్భంగా వీడియో ఫుటేజీల సమర్పణ విషయంలో ఇచ్చిన హామీపై సీఎం ప్రస్తావించారు. ప్రభుత్వంతో చర్చించకుండా ఇలా హామీ ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ఏజీని ప్రశ్నించినట్లు సమాచారం. ఫుటేజీలు సమర్పిస్తే వచ్చే ఇబ్బందులను సైతం సీఎం ఈ సందర్భంగా లేవనెత్తారు. అయితే ముఖ్యమంత్రి అభిప్రాయంతో ఏజీ ఏకీభవించలేదని తెలిసింది. సాల్వే నియామకంపై చెప్పని సర్కార్ తాను మాములు న్యాయవాదిగా ఆ హామీ ఇవ్వలేదని, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌గా హామీ ఇచ్చినందున దానికి ఓ విలువ ఉంటుందని ప్రకాశ్‌రెడ్డి అన్నట్టు సమాచారం. తాను ఇచ్చిన హామీపై వెనక్కి వెళ్లడం సాధ్యం కాదని అన్నట్టు తెలిసింది. కానీ ఈ విషయంలో సీఎం అభిప్రాయం భిన్నంగా ఉండటంతో తన పదవికి రాజీనామా చేయాలని ప్రకాశ్‌రెడ్డి నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇదే సమయంలో కోమటిరెడ్డి, సంపత్‌ల వ్యవహారంలో హైకోర్టులో జరుగుతున్న విచారణకు ఢిల్లీ నుంచి సుప్రీం సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వేను రప్పించాలని ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రభుత్వం నుంచి ప్రకాశ్‌రెడ్డికి ఎలాంటి సమాచారం అందలేదు. సాల్వే ద్వారా వాదనలు వినిపించాలని నిర్ణయించుకున్న తర్వాత ఈ కేసు నుంచి తప్పుకోవాలని ప్రకాశ్‌రెడ్డికి ప్రభుత్వం స్పష్టం చేసింది. దీన్ని అవమానంగా భావించిన ప్రకాశ్‌రెడ్డి ఏజీ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. గతేడాది జూలై 17న ప్రకాశ్‌రెడ్డి అడ్వొకేట్ జనరల్‌గా నియమితులయ్యారు. నేడు కేసు విచారణ తమ బహిష్కరణపై కోమటిరెడ్డి, సంపత్‌కుమార్ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం మరోసారి విచారణ జరపనుంది. గవర్నర్ ప్రసంగం రోజున జరిగిన ఘటనలకు సంబంధించిన మొత్తం ఫుటేజీని తమ ముందుంచాలని హైకోర్టు గత వారం ఇచ్చిన గడువు మంగళవారంతో ముగియనుంది. దీంతో న్యాయస్థానం తదుపరి ఏం ఆదేశాలు ఇవ్వబోతోందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కోమటిరెడ్డి, సంపత్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ హాజరు కానున్నట్లు తెలిసింది. ప్రభుత్వం తరఫున హరీశ్ సాల్వే వాదనలు వినిపించనున్నారు. -
‘తెలంగాణ నంబర్ 1.. ఒట్టి హంబక్’
సాక్షి, హైదరాబాద్ : దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రమంటూ.. కేంద్ర మంత్రులు కూడా ఫిదా అయిపోయి కితాబులిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారమంతా ఒట్టి హంబక్ అని బీజేపీ విమర్శించింది. ఏఒక్క కేంద్ర మంత్రి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నేరుగా పొడగలేదని, అదంతా టీఆర్ఎస్ మైండ్‌గేమ్ అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. మరో అధికార ప్రతినిధి నరేశ్‌తో కలిసి శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ టీఆర్ఎస్తో బీజేపీ కుమ్మక్కైందన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. కేంద్ర మంత్రులు ఎక్కడ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నంబర్ వన్‌గా పేర్కొనలేదు. అలాంటి ప్రకటనలన్నీ టీఆర్ఎస్ భవన్ నుంచి వస్తున్నవే. అరుణ్ జైట్లీకి, కేసీఆర్‌ల మధ్య జరిగిన సంభాషణను ఏదో ప్రకటన మాదిరి టీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటోంది. ఒకవేళ కేంద్ర మంత్రులే గనుక టీఆర్ఎస్ పథకాలను భేష్ అని ఉంటే ఎలాంటి బహిరంగ చర్చకైనా మేం సిద్ధం’’ అని ప్రకాశ్‌రెడ్డి, నరేశ్‌లు అన్నారు. -
ప్రకాష్‌రెడ్డి అంటే భయామా?
రామగిరి: రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ప్రకాష్‌రెడ్డిని రామగిరి మండలంలో అడుగు పెట్టకుండా ఆదివారం అడుగడుగునా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పేరూరు డ్యాంను నీటితో నింపడంతో పాటు పేరూరు ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేసే విషయంపై రైతులతో చర్చించేందుకు నసనకోట పంచాయతీలోని ముత్యాలంపల్లిలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశానికి ప్రకాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే సమావేశం నిర్వహణకు అనుమతి ఇవ్వడంతో పాటు ఆ ప్రాంతంలో ఎలాంటి అలజడులూ తలెత్తకుండా ఉండేందుకు పది మంది పోలీసులతో బందోబస్తు కల్పించాలంటూ పది రోజుల క్రితం జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్, ధర్మవరం డీఎస్పీ, రామగిరి సీఐకు ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డితో కలిసి ప్రకాష్‌రెడ్డి వినతిపత్రం ఇచ్చారు. గ్రామీణుల్లో ఆందోళన సమావేశం నిర్వహణపై సమాచారం అందుకున్న మంత్రి పరిటాల సునీత అప్రమత్తమయ్యారు. ప్రకాష్‌రెడ్డిని ఎలాగైనా అడ్డుకోవాలని పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకెళ్లారు. ఫలితంగా సమావేశం నిర్వహణకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కేవలం పది మంది పోలీసుల భద్రతతో సమావేశం ముగిసే అవకాశమున్నా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన ఉన్నతాధికారులు.. రామగిరి మండల వ్యాప్తంగా వంద మందికి పైగా పైగా స్పెషల్ పార్టీ పోలీసులను రంగంలో దింపారు. పేరూరు, వెంకటాపురం, ఎంసీ పల్లి, కుంటిమద్ది, గరిమేకలపల్లి, చెన్నేకొత్తపల్లి మండలంలోని ఎన్ఎస్గేట్, కనగానపల్లి మండలంలోని మద్దెలచెరువు గ్రామాల చుట్టూ పోలీసులను మోహరింపజేశారు. దీంతో ఏం జరుగుతోందో తెలియక ఆయా గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. అడుగడుగునా అరెస్ట్‌లు ముత్యాలంపల్లిలో నిర్వహించనున్న సమావేశానికి దాదాపు 200 మంది కార్యకర్తలతో బయలుదేరిన వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మీనుగ నాగరాజుకు అడుగుడునా నిర్భందాలే ఎదురయ్యాయి. ఎటుచూసినా పోలీసులు అతన్ని నిలువరించేందుకు ప్రయత్నించారు. చివరకు నాగరాజు, తదితరులను రామగిరి సీఐ యుగంధర్ అదుపులోకి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే చిగురుచెట్టు వద్ద ఉన్న వంద మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మంత్రి పరిటాల సునీత ప్రమేయంతోనే ఉద్రిక్తత నెలకొందని, ప్రకాష్‌రెడ్డి అంటే అంత భయమెందుకు అంటూ గ్రామీణులు చర్చించుకుంటున్నారు. -
వెయ్యి కోట్ల దోపిడీకి బాలకృష్ణ పన్నాగం
సాక్షి, హైదరాబాద్: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సీఎం కుర్చీలో కూర్చుని నిర్వహించిన సమీక్ష సందర్భంగా అనంతపురం జిల్లాలోని రెండు ఎత్తిపోతల పథకాల కోసం సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో హడావుడిగా జీవోలను విడుదల చేయించారని, అందులో రూ.వెయ్యి కోట్లకుపైగా దోపిడీకి వ్యూహం పన్నారని రాప్తాడు వైఎస్సార్ కాంగ్రెస్ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. బాలకృష్ణ ప్రమేయం, దేవినేని అంగీకారంతోనే నంబర్ 59, 60 జీవోలు విడుదలయ్యాయని అన్నారు. గురువారం ప్రకాశ్‌రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.