నల్లగొండ: మావోయిస్టు వ్యతిరేక ఉద్యమ నాయకులు పాశం శ్రీను, సుధాకర్ శుక్రవారం నల్లగొండ ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. వీరిపై ఇటీవల పోలీసులు పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేశారు. రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న వీరిద్దరూ తమను పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో లొంగిపోయినట్లు తెలుస్తోంది. వీరిద్దరిపై సుమారు 100 కేసులున్నట్లు సమాచారం. మావోయిస్టు కొనాపూరి సాంబశివుడు, రాములు హత్యకేసుల్లో వీరిద్దరు ప్రధాన ముద్దాయిలుగా ఉన్నారు. కాగా సుధాకర్ టీఆర్‌ఎస్ పార్టీ నుంచి భువనగిరి జడ్పీటీసీ సభ్యుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. పాశం శ్రీను, సుధాకర్‌లు మావోయిస్టు వ్యతిరేక ఉద్యమ నేత నయీంకు ముఖ్య అనుచరులుగా ఉన్నారు.