Nalgonda SP
-
ఎమ్మెల్యేల కొనుగోలు.. ‘సిట్’లో రెమా రాజేశ్వరి.. సీవీ ఆనంద్ తర్వాత ఆమెనే!
సాక్షి, నల్లగొండ: జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరికి రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పజెప్పింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ కోసం నియమించిన ప్రత్యేక విచారణ బృందం (సిట్)లో ఆమెకు చోటు కల్పించింది. రాజకీయ ప్రమేయమున్న ఈ కీలక కేసులో జిల్లా ఎస్పీని నియమించేందుకు గాను అనేక అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో పలు కీలక కేసులను విచారించిన అనుభవంతో పాటు ఆయా కేసుల్లో పక్కా సాక్ష్యాలు సేకరించే నైపుణ్యం ఉన్న అధికారిగా గుర్తింపు తెచ్చుకున్న రెమా రాజేశ్వరికి ఈ కీలక బాధ్యతలు అప్పజెప్పింది. ప్రభుత్వం నియమించిన ఏడుగురు పోలీసు అధికారుల్లో సిట్‌కు నేతృత్వం వహించనున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తర్వాత సీనియర్ అధికారిణి మన ఎస్పీనే. ట్రాక్ రికార్డు అదుర్స్.. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కేసు రాజకీయంగా చాలా కీలకమైంది. ఈ కేసు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ యుద్ధానికి దారితీసింది. అలాంటి కీలకమైన కేసులో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్‌లో మన ఎస్పీకి చోటు దక్కేందుకు గతంలో ఆమెకున్న ట్రాక్ రికార్డే కారణమనే చర్చ పోలీసు వర్గాల్లో జరుగుతోంది. 2014లో పెదవూర మండలం ఏనెమీదితండాలో 12 మంది గిరిజన బాలికలపై జరిగిన లైంగిక దాడి కేసు విచారణలో ఎస్పీ రెమా రాజేశ్వరి కీలకంగా వ్యవహరించారు. ఈ ఘటన జరిగిన సమయంలో జిల్లా అదనపు ఎస్పీగా ఉన్న ఆమె పకడ్బందీగా కేసును ముందుకు నడిపించి సాక్ష్యాధారాలతో సహా నిరూపించి నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష పడేలా కృషిచేశారు. ఆమె మహబూబ్‌నగర్ జిల్లాలో పనిచేస్తున్నప్పుడు ఎరుకల శ్రీను అనే సీరియల్ కిల్లర్ కేసును కూడా ఛేదించారు. 17 మందిని పొట్టనబెట్టుకున్న నరహంతకుడిని కటకటాల పాలుజేసి సంచలన కేసు దర్యాప్తునకు నేతృత్వం వహించారు. అదే జిల్లాలో 12 మందిని హత్య చేసిన మరో సీరియల్ కిల్లర్ యూసుఫ్ ఆటకట్టించింది కూడా రెమా రాజేశ్వరీనే. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డీసీపీగా పనిచేసినప్పుడు కూడా కీలక కేసుల దర్యాప్తులో తనదైన గుర్తింపును తెచ్చుకున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కీలకమైన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ బాధ్యతలు అప్పజెప్పింది. -
గంజాయి సమస్య కొత్తది కాదు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఆంధ్రా–ఒడిషా సరిహద్దులో (ఏవోబీ) గంజాయి సమస్య కొత్తది కాదని, పదిహేనేళ్లుగా కొనసాగుతోందని నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్కడ గంజాయి సాగుచేస్తున్న విషయం అక్కడి సీనియర్ పోలీసు అధికారులకు, ప్రతి ఒక్కరికీ తెలిసిందేనన్నారు. కరోనా తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిపోయిందన్నారు. ఈ క్రమంలోనే ఏవోబీ నుంచి గంజాయి రవాణా తెలంగాణతోపాటు దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించిందన్నారు. దీనిని గుర్తించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్ మొదటి వారంలో తెలంగాణ పోలీసులకు గంజాయి నిర్మూలనపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారని, గంజాయి రవాణా, నెట్‌వర్క్‌పై నిఘా పెట్టాలని ఆదేశించారని వెల్లడించారు. గడిచిన నెలన్నరలో నల్లగొండ జిల్లాలో గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టి ముమ్మరంగా తనిఖీలు చేశామన్నారు. ఏవోబీ నుంచి నల్లగొండ మీదుగా హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు, దేశంలోని ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతోందని తాము పట్టుకున్న వారి కాల్ డాటా ఆధారంగా గుర్తించామన్నారు. తనిఖీల్లో వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, 35 కేసులు నమోదు చేశామని తెలిపారు. ప్రతి తనిఖీలోనూ గంజాయి మూలాలు ఏవోబీవైపే చూపించాయని, గంజాయి విక్రయదారుల పేర్లు, ఊరి పేర్లతో సహా గుర్తించామని వివరించారు. వాటి ఆధారంగానే దసరా రోజు నల్లగొండ జిల్లాకు చెందిన 17 పోలీస్ బృందాలతో ఏపీలో దాడులు నిర్వహించామన్నారు. దీనికి ఏపీ పోలీసులు పూర్తిగా సహకరించారన్నారు. మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దు ఎంపీ హోదాలో ఉన్న విజయసాయిరెడ్డికి గంజాయి అంశంలో సరైన సమాచారం లేకపోవడం వల్లనో, తప్పుడు సమాచారంతోనో తనపై ఆరోపణలు చేస్తున్నట్లుగా అనిపిస్తోందని ఎస్పీ రంగనాథ్ ఆ ప్రకటనలో వివరించారు. ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు గంజాయి విషయమై చేస్తున్న రాజకీయంలో పోలీసులను, ప్రత్యేకించి తనను లాగడం సరికాదన్నారు. ‘మా భుజాల మీద నుంచి మీ రాజకీయ అస్త్రాలను సంధించడం దురదృష్టకరం’అని పేర్కొన్నారు. గంజాయి ఇష్యూను అక్కడి నాయకులు ఎవరికి అనుగుణంగా వారు అన్వయించుకుంటూ రాజకీయ ప్రయోజనాలకు తమను వాడుకోవడం సరికాదన్నారు. -
ప్రణయ్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదు
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ టౌన్ మెయిన్ రోడ్డులో ప్రణయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఎటువంటి అనుమతినివ్వలేదని ఆ జిల్లా పోలీసులు హైకోర్టుకు నివేదించారు. అంతేకాక సంబంధిత అధికారుల నుంచి అనుమతి లేకుండా ప్రణయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వీల్లేదని ప్రణయ్ తండ్రికి స్పష్టం చేశామని తెలిపారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ప్రణయ్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను మూసివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. -
అతివేగమే ప్రమాదానికి కారణం
-
నయీం అనుచరుల లొంగుబాటు
నల్లగొండ: మావోయిస్టు వ్యతిరేక ఉద్యమ నాయకులు పాశం శ్రీను, సుధాకర్ శుక్రవారం నల్లగొండ ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. వీరిపై ఇటీవల పోలీసులు పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేశారు. రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న వీరిద్దరూ తమను పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో లొంగిపోయినట్లు తెలుస్తోంది. వీరిద్దరిపై సుమారు 100 కేసులున్నట్లు సమాచారం. మావోయిస్టు కొనాపూరి సాంబశివుడు, రాములు హత్యకేసుల్లో వీరిద్దరు ప్రధాన ముద్దాయిలుగా ఉన్నారు. కాగా సుధాకర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి భువనగిరి జడ్పీటీసీ సభ్యుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. పాశం శ్రీను, సుధాకర్‌లు మావోయిస్టు వ్యతిరేక ఉద్యమ నేత నయీంకు ముఖ్య అనుచరులుగా ఉన్నారు. -
కానిస్టేబుల్ పరీక్షకు సర్వత్రా సిద్ధం: నల్గొండ ఎస్పీ
నల్గొండ : జిల్లా వ్యాప్తంగా కానిస్టేబుల్ పరీక్షకు సర్వత్రా సిద్ధమని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ ఆదివారం నల్గొండలో వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 160 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 58510 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతారని తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అభ్యర్థులకు జిల్లా ఎస్పీ విక్రమ్ జిత్ దుగ్గల్ సూచించారు. -
రమేష్ కుటుంబానికి అండగా ఉంటాం: జిల్లా ఎస్పీ
నల్గొండ: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఎస్సై రమేష్ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని నల్గొండ జిల్లా ఎస్పీ దుగ్గల్ అన్నారు. శుక్రవారం దేవరకొండ మండలం శేరుపల్లిలో ప్రారంభమైన రమేష్ అంతిమ యాత్రలో ఎస్పీతోపాటు వివిధ పార్టీల నాయకులు, గిరిజన సంఘాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ దుగ్గల్ మాట్లాడుతూ... రమేష్ గిరిజన నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఎస్సై అయిన తీరును వివరించారు. అయితే రమేష్ మృతిపై కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కేసును సీఐడీ పూర్తి స్థాయిలో విచారణ జరుపుతుందని దుగ్గల్ చెప్పారు. -
'నిరుద్యోగులకు పోలీస్ శాఖ ద్వారా శిక్షణ'
భువనగిరి: నిరుద్యోగ యువకులకు పోలీస్ శాఖ ద్వారా ఉచితంగా శిక్షణ ఇస్తామని నల్లగొండ జిల్లా ఎస్పీ విక్రంజిత్ దుగ్గల్ తెలిపారు. బుధవారం భువనగిరికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లో గుడుంబా నివారణకు యువత ముందుకు రావాలని కోరారు. సారా తయారీకి అవసరమైన నల్లబెల్లం వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. హైవే పెట్రోలింగ్‌ను మరింత పటిష్టం చేస్తామని, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటామని ఎస్పీ దుగ్గల్ చెప్పారు. -
'స్వచ్ఛ భారత్'లో నల్లగొండ ఎస్పీ
నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా ఎస్పీ దుగ్గల్ శుక్రవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని మదీనా మసీదులో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు పలువురు పోలీసులు, నగర ప్రజలు పాల్గొన్నారు. -
ఎన్ఐఏ అధికారులతో నల్గొండ ఎస్పీ భేటీ
నల్గొండ: నల్గొండ జల్లా సూర్యాపేటలో ఎన్ఐఏ అధికారులతో జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ మంగళవారం భేటీ అయ్యారు. అనంతరం ఎన్ఐఏ అధికారులతోపాటు విక్రమ్‌జిత్ దుగ్గల్ కాల్పులు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. దుగ్గల్ జిల్లా ఎస్పీగా సోమవారం ప్రభాకరరావు నుంచి బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. నల్గొండ జిల్లా సూర్యాపేట బస్టాండ్‌లో బుధవారం సిమి ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. అలాగే శనివారం జానకీపురంలో సిమి ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించగా, ఎస్ఐ సిద్ధయ్య కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో సిమి ఉగ్రవాదులు శనివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. -
ప్రత్యక్ష సాక్షితో సాక్షి
-
నల్గొండ ఎస్పీ బదిలీ!
-
నల్లగొండ ఎస్పీపై బదిలీ వేటు
హైదరాబాద్: సూర్యాపేట కాల్పుల ఘటన నేపథ్యంలో నల్లగొండ ఎస్పీ ప్రభాకరరావుపై బదిలీ వేటు పడింది. ఆయనను సీఐడీ ఎస్పీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో విక్రమ్ జిత్ దుగ్గల్ ను నల్లగొండ ఎస్పీగా నియమించారు. కాగా దుండగుల కాల్పుల ఘటనలో గాయపడి కిమ్స్ లో చికిత్స పొందుతున్న సీఐ మొగిలయ్య, హోంగార్డు కిశోర్ లకు ఆపరేషన్ చేశారు. మొగిలయ్య శరీరం నుంచి వైద్యులు రెండు బుల్లెట్లు బయటకు తీశారు. వీరిని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ పరామర్శించారు. -
తెలంగాణలో పర్యటిస్తే.. సీఎంనూ అరెస్టు చేస్తారా?
* నల్లగొండ జిల్లా పర్యటనను అడ్డుకోవడంపై విజయమ్మ ఆగ్రహం సాక్షి, ఖమ్మం: ‘నేను సమైక్యవాదిని అంటున్నారు.. మరి సీఎం తనకు తానే సమైక్యవాదినని ప్రకటించుకుంటున్నారు.. ఆయన తెలంగాణ జిల్లాలో పర్యటిస్తే అరెస్టు చేస్తారా..?’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా సరిహద్దులో విజయమ్మను అదుపులోకి తీసుకొని నేలకొండపల్లి స్టేషన్‌కు తరలించిన అనంతరం ఆమె అక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘ఇదేమైనా పాకిస్తానా.. బంగ్లాదేశా..? మేమేమైనా రౌడీషీటర్లమా..? వీసా తీసుకొని తెలంగాణలో పర్యటించాలా..? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా..? ఇంకా ఎక్కడైనా ఉన్నామా.. ప్రభుత్వమే నాపర్యటను అడ్డుకుంటోంది’ అని విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు కష్టాల్లో ఉంటే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ ఒక్కరూ వారిని పలకరించకుండా ఇంట్లో కూర్చున్నారని విమర్శించారు. తాము వెళ్తుంటే కుట్ర రాజకీయాలు ఎందుకు చేస్తున్నారన్నారు. ‘ప్రజాస్వామ్యంలో ప్రజల కష్టాలు తెలుసుకొని వారికి మాట ఇవ్వడం నేతల కర్తవ్యం.. ఇది నేను చేయడం తప్పా.. మనం ప్రజాస్వామంలో ఉన్నామా.. ఇంకెక్కడైనా ఉన్నామా’ అని ప్రశ్నించారు. కొంతమంది నాయకులు, పార్టీలు కుట్రలు చేసి వ్యక్తిగత స్వేచ్ఛను హ రిస్తున్నారన్నారు. ‘వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌లు తెలంగాణ ప్రజల గోడు పట్టించుకున్నారు.. కానీ ఈ ప్రభుత్వానికి జనం గోడు పట్టదా’ అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణలో పర్యటనను ప్రజలు అడ్డుకోవడం లేదని, ప్రభుత్వం, ఇక్కడి నాయకులు అడ్డుకుంటున్నారన్నారు. వైఎస్ రెక్కల కష్టంతో వచ్చిన ప్రభుత్వం, ఆయన కష్టంతో మంత్రి పదవులు తెచ్చుకున్న మంత్రులు ఇప్పుడు ఏం చేస్తున్నారని నిలదీశారు. మళ్లీ నల్లగొండకు వస్తాం.. రైతులను కలుస్తాం.. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునే నాయకులను ఎవ్వరూ ఆపలేరని, మళ్లీ నల్లగొండకు వచ్చి బాధిత రైతులను కలుస్తామని విజయమ్మ చెప్పారు. నల్లగొండ ఎస్పీని ఫోన్లో నిలదీసిన విజయమ్మ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘తుపానుతో పంటలు నష్టపోయి బాధలో ఉన్న రైతులను పరామర్శించడానికి వస్తే రాజకీయం చేస్తారా..? ప్రజా జీవితంలో ఉన్న నాయకులు, ప్రజల కోసం పనిచేసే పార్టీలు, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కలవడానికి రాకుంటే ఎపుడు వస్తారు? మేమేమన్నా దాడులు చేయడానికి వస్తున్నామా? మమ్మల్ని ఎందుకు వెనక్కి వెళ్లిపొమ్మంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాధిత రైతులను పరామర్శించాకే వెళతాం. రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీదే’ అని నల్లగొండ ఎస్పీ ప్రభాకరరావును వైఎస్ విజయమ్మ ఫోన్లో నిలదీశారు. నల్లగొండ జిల్లాకు వెళ్లకముందు ఖమ్మం జిల్లా పర్యటనలో ఉండగా ఆమె ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. నల్లగొండ జిల్లాకు అనుమతించబోమని పోలీసులు అనడంపై మండిపడ్డారు. బాధల్లో ఉన్న ప్రజలను ప్రభుత్వం ఎలాగూ పట్టించుకోవడం లేదు. అధికారులు కూడా ఈ విషయం గమనించకుంటే ఎలా..? అంటూ ఎస్పీని ప్రశ్నించారు. ‘మాకు రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ.. మూడు ప్రాంతాలు సమానమే, అయినా రైతులతో రాజకీయం ఏమిటి? నేనైతే వస్తున్నా.. రక్షణ కల్పిస్తారో.. వెంట ఉండి రాళ్లు వేయిస్తారో.. మీ ఇష్టం..’ అని అన్నారు. కాగా, ఎస్పీతో మాట్లాడిన అర్ధగంట తర్వాత వైఎస్ విజయమ్మ పార్టీ నేతలతో మాట్లాడి, బాధిత రైతులను పరామర్శించేందుకు ముందు నిర్ణయించిన మార్గంలోనే వెళ్లడానికి నేలకొండపల్లి నుంచి బయలుదేరారు. పోలీసులు ఆమెను అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.