ఎన్ఐఏ అధికారులతో నల్గొండ ఎస్పీ భేటీ | Nalgonda sp meet with nia officials | Sakshi
Sakshi News home page

ఎన్ఐఏ అధికారులతో నల్గొండ ఎస్పీ భేటీ

Published Tue, Apr 7 2015 10:47 AM | Last Updated on Wed, Oct 17 2018 5:14 PM

Nalgonda sp meet with nia officials

నల్గొండ: నల్గొండ జల్లా సూర్యాపేటలో ఎన్ఐఏ అధికారులతో జిల్లా ఎస్పీ విక్రమ్జిత్ దుగ్గల్ మంగళవారం భేటీ అయ్యారు. అనంతరం ఎన్ఐఏ అధికారులతోపాటు విక్రమ్జిత్ దుగ్గల్ కాల్పులు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.  దుగ్గల్ జిల్లా ఎస్పీగా సోమవారం ప్రభాకరరావు నుంచి బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.


నల్గొండ జిల్లా సూర్యాపేట బస్టాండ్లో బుధవారం సిమి ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. అలాగే శనివారం జానకీపురంలో సిమి ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించగా, ఎస్ఐ సిద్ధయ్య కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో  సిమి ఉగ్రవాదులు శనివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement