Vikramjeet Duggal
-
ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వండి..
మంచిర్యాల జిల్లా పోలీస్ అధికారులతో కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ గోదావరిఖని : ప్రజలకు అందుబాటులో సేవలందించేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యతనివ్వాలని రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ కోరారు. గురువారం గోదావరిఖనిలోని సింగరేణి ఇల్లందు క్లబ్లో మంచిర్యాల జిల్లా పోలీస్ అధికారులతో సమావేశమై సమీక్ష చేశారు. కిందిస్థాయి పోలీసులు ప్రజలకు మరింత దగ్గరగా ఉంటూ వారికి సేవలందించాలని, అప్పుడే నేరాల నియంత్రణ ఉంటుందని, ప్రజలు భరోసాగా ఉండే వీలు కలుగుతుందన్నారు. కొత్త కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలను పరిరక్షించాలని సూచిస్తూ స్టేషన్ల వారిగా ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ జాన్‌వెస్లీ, బెల్లంపల్లి ఏసీపీ రమణారెడ్డి, మంచిర్యాల సిఐ డి.సుధాకర్, మందమర్రి సిఐ పి.సదయ్య, లక్షెట్టిపేట సిఐ డి.మోహన్, ఐ.ప్రవీన్‌కుమార్, ఖరీముల్లా, ఎల్.రఘు తదితరులు పాల్గొన్నారు. -
కానిస్టేబుల్ పరీక్షకు సర్వత్రా సిద్ధం: నల్గొండ ఎస్పీ
నల్గొండ : జిల్లా వ్యాప్తంగా కానిస్టేబుల్ పరీక్షకు సర్వత్రా సిద్ధమని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ ఆదివారం నల్గొండలో వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 160 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 58510 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతారని తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అభ్యర్థులకు జిల్లా ఎస్పీ విక్రమ్ జిత్ దుగ్గల్ సూచించారు. -
ఎన్ఐఏ అధికారులతో నల్గొండ ఎస్పీ భేటీ
నల్గొండ: నల్గొండ జల్లా సూర్యాపేటలో ఎన్ఐఏ అధికారులతో జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ మంగళవారం భేటీ అయ్యారు. అనంతరం ఎన్ఐఏ అధికారులతోపాటు విక్రమ్‌జిత్ దుగ్గల్ కాల్పులు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. దుగ్గల్ జిల్లా ఎస్పీగా సోమవారం ప్రభాకరరావు నుంచి బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. నల్గొండ జిల్లా సూర్యాపేట బస్టాండ్‌లో బుధవారం సిమి ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. అలాగే శనివారం జానకీపురంలో సిమి ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించగా, ఎస్ఐ సిద్ధయ్య కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో సిమి ఉగ్రవాదులు శనివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. -
మావోయిస్టుల హెచ్చరికలు బేఖాతర్
లివిడత ఎన్నికలు ప్రశాంతం ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ విశాఖపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలో రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎస్పీ విక్రమ్ జీత్ దుగ్గల్ తెలిపారు. మావోయిస్టుల బెదిరింపులకు లొంగకుండా గిరిజనులు ఓటు హ క్కు వినియోగించుకున్నారన్నారు. గిరిజనులను, గిరిజన నాయకులను ఎన్నికలలో పాల్గొనవద్దని, చంపేస్తామని మావోయిస్టులు శతవిధాలా చేసిన ప్రయత్నాల్ని గిరిజనులు తమ ఓటుతో సమాధానం చెప్పారన్నారు. దీనిని బట్టి చూస్తే గిరిజనానికి అభివృద్ధిపై ఆకాంక్ష అర్థమవుతుందన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మన్యంలో మొత్తం 328 పోలింగ్ స్టేషన్లు, 470 పోలింగ్ బూత్‌లలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎన్నికలు నిర్వహించామన్నారు. ముంచంగిపుట్టు మండలాని 26 కిలో మీటర్ల దూరంలో గల బూసిపుట్టులో (ఒరిస్సా సరిహద్దు) ఇద్దరు వ్యక్తులు ఎన్నికల సిబ్బందిని బెదిరించి రెండు బ్యాలెట్ బాక్సులను ఎత్తుకుపోయినట్లు ప్రాథమిక సమాచారం అందిందన్నారు. ఈ సంఘటన మినహా ఏజెన్సీ అంతటా ప్రశాంతంగా ఎన్నికలు జరుగగా 75 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. మావోరుుస్టుల హెచ్చరికలను లెక్క చేయకుండా ఓటింగ్‌లో పాల్గొన్న గిరిజనానికి, నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
ఎన్నికలకు పటిష్ట భద్రత
విశాఖపట్నం, న్యూస్‌లైన్: జిల్లాలో ఎన్నికలను ప్రశాంతం గా నిర్వహించేందుకు మునుపెన్నడు లేనివిధంగా అత్యంత పటిష్టంగా, ప్రణాళికాయుతంగా బందోబస్తు ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ తెలిపారు. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలలో భద్రతా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. స్నేహభావంతో పోలీసులు గిరిజనులు చేరువయ్యూరని, మారుమూల గూడేల్లో సద్భావన యూత్రలను పెద్ద ఎత్తున నిర్వహించి ఆదివాసీల సమస్యలను పరిష్కరించామన్నారు. ఎన్నికల అవగాహన శిబిరాలలో గిరిజనులు పాల్గొని పోలింగ్‌లో పాలుపంచుకోవాలన్నారు. మారుమూల ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నా క్షణాల్లో బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. భారీ ఎత్తున పోలీసు బలగాలను ఇప్పటికే ఏజెన్సీ అంతటా మొహరించామని తెలిపారు. మావోయిస్టులు ప్రజాస్వామ్యబద్దంగా జరుగుతున్న ఎన్నికలపై తప్పుడు ప్రకటనలకు స్వస్తి పలకాలని హితవు పలికారు. గిరిజన సంక్షేమానికి ఎన్నికలు ఎంతో దోహదపడతాయన్నారు. సమర్ధమైన గిరిజన నాయకులు ప్రజల ముందుకు వస్తారని, వారి ద్వారా మన్యం అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. అతి తక్కువ సభ్యులు కలిగిన మావోయిస్టులు ముఖ్యంగా నిరక్షరాస్యులు ప్రజలను తమ చేష్టల ద్వారా భయాందోళనలకు గురిచేస్తున్నారని అన్నారు. మావోయిస్టుల మాయమాటలు గిరిజనులు వినే స్థితిలో లేరని తెలిపారు. మావోయిస్టులను నమ్ముకుంటే తమ గ్రామాలు అభివృద్ధి చెందవనే విషయూన్ని మన్యం ప్రజలు ఇప్పటికే గ్రహించారన్నారు. ఈ ఎన్నికల్లో గిరిజనం తీర్పు తమకు అనుకూలం కావనే సంకేతాలను మావోయిస్టులు జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. -
వారికి సిద్ధాంతాలు లేవు
విశాఖపట్నం:మావోయిస్టులకు సిద్ధాంతాలు లేవని, ప్రజల ఆదరాభిమానాలు కోల్పోయారని జిల్లా ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ ఒక ప్రకటనలో అన్నారు. ఇప్పటికే మావోయిస్టుల దుశ్చర్యలకు విసిగిపోయిన సాగులు గ్రామస్తులు వారిని తరిమి కొట్టారని పేర్కొన్నారు. గతంలో ఇలాం టి సంఘటనలు అనేకం జరిగాయన్నారు. అయినా వారిలో మార్పు రాలేదన్నారు. ఇప్పటికైనా మావోయిస్టులు పునరాలోచించుకోవాలని,రోడ్లు వేయకుండా అభివృద్ధిని ఏవిధంగా సాధిస్తారోప్రజలకు వివరించాలని ఎస్పీ కోరారు. మంగళవారం రాత్రి ఏపీఎఫ్‌డీసీకి చెం దిన కాఫీ పల్పర్ యూనిట్‌ను, దానికి సంబంధించిన గోడౌన్, యంత్రాలను ధ్వంసం చేయ డం దుర్మార్గమన్నారు. దీంతో అనేక మంది గిరిజనులు ఉపాధి కోల్పోయారన్నారు. ఏజెన్సీ అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా మూరుమూల ప్రాంతాలకు రోడ్లు కావాలన్నారు. అప్పుడేవిద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. పండించే, సేకరించే పంటలను మైదానానికి తీసుకువెళ్లి గిట్టుబాటు ధరకు అమ్ముకునే వీలు కలుగుతుందన్నారు. ఇంత చిన్న అంశం మావోయిస్టులకు అర్థం కాదా అని ఎస్పీ ప్రశ్నించారు. మావోయిస్టుల చర్యలను గిరిజన యువతీయువకులు, విద్యార్థులు, వివిధ వ్యాపార వర్గాలతోపాటు మేధావులు తీవ్రంగా ఖండిస్తున్నారని పేర్కొన్నారు.