మావోయిస్టుల హెచ్చరికలు బేఖాతర్
- లివిడత ఎన్నికలు ప్రశాంతం
- ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలో రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎస్పీ విక్రమ్ జీత్ దుగ్గల్ తెలిపారు. మావోయిస్టుల బెదిరింపులకు లొంగకుండా గిరిజనులు ఓటు హ క్కు వినియోగించుకున్నారన్నారు. గిరిజనులను, గిరిజన నాయకులను ఎన్నికలలో పాల్గొనవద్దని, చంపేస్తామని మావోయిస్టులు శతవిధాలా చేసిన ప్రయత్నాల్ని గిరిజనులు తమ ఓటుతో సమాధానం చెప్పారన్నారు. దీనిని బట్టి చూస్తే గిరిజనానికి అభివృద్ధిపై ఆకాంక్ష అర్థమవుతుందన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
మన్యంలో మొత్తం 328 పోలింగ్ స్టేషన్లు, 470 పోలింగ్ బూత్‌లలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎన్నికలు నిర్వహించామన్నారు. ముంచంగిపుట్టు మండలాని 26 కిలో మీటర్ల దూరంలో గల బూసిపుట్టులో (ఒరిస్సా సరిహద్దు) ఇద్దరు వ్యక్తులు ఎన్నికల సిబ్బందిని బెదిరించి రెండు బ్యాలెట్ బాక్సులను ఎత్తుకుపోయినట్లు ప్రాథమిక సమాచారం అందిందన్నారు. ఈ సంఘటన మినహా ఏజెన్సీ అంతటా ప్రశాంతంగా ఎన్నికలు జరుగగా 75 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. మావోరుుస్టుల హెచ్చరికలను లెక్క చేయకుండా ఓటింగ్‌లో పాల్గొన్న గిరిజనానికి, నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.