సూర్యాపేట కాల్పుల ఘటన నేపథ్యంలో నల్లగొండ ఎస్పీ ప్రభాకరరావుపై బదిలీ వేటు పడింది. ఆయనను సీఐడీ ఎస్పీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో విక్రమ్ జిత్ దుగ్గల్ ను నల్లగొండ ఎస్పీగా నియమించారు. కాగా దుండగుల కాల్పుల ఘటనలో గాయపడి కిమ్స్ లో చికిత్స పొందుతున్న సీఐ మొగిలయ్య, హోంగార్డు కిశోర్ లకు ఆపరేషన్ చేశారు. మొగిలయ్య శరీరం నుంచి వైద్యులు రెండు బుల్లెట్లు బయటకు తీశారు. వీరిని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ పరామర్శించారు.