
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి రాజీనామా చేయడం ప్రభుత్వ దుందుడుకుతనం, అహంకారానికి నిదర్శమని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రకాష్‌రెడ్డి రాజీనామాకు ప్రభుత్వ వేధింపులు కారణమా? లేక అడ్వకేట్ జనరల్ నిర్ణయాలకు ప్రభుత్వం అడ్డుపడుందా అనేది చెప్పాలని డిమాండ్ చేశారు.
మరో వైపు కాంగ్రెస్ పెట్టె అవిశ్వాస తీర్మానంపై మద్దతు తెలుపుతామన్న టీఆర్‌ఎస్.. కొద్దిరోజులుగా టీడీపీ, వైఎస్సార్ సీపీ పార్టీలు పెడుతున్న అవిశ్వాస తీర్మానాలపై ఎందుకు మద్దతు తెలుపలేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ పార్టీ గందరగోళ నిర్ణయానికి తెరలేపుతోందని విమర్శించారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు దొందు దొందే అని ఆయన విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment