అనంతపురం : అనంతపురం జిల్లావ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో పోలీసుల వ్యవహరిస్తున్న తీరుపై ఆపార్టీ జిల్లా సమన్వయకర్త ప్రకాష్ రెడ్డి ఖండించారు. స్థానిక సంస్థల ఎన్నికల తుది విడత పోలింగ్ సందర్భంగా నేర చరిత్ర లేకపోయినా కీలక నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
క్రిమినల్స్గా ముద్రపడ్డ పరిటాల వర్గీయుల్ని ఎందుకు నిర్బంధించలేదని ప్రకాష్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఆత్మకూరు, కనగానపల్లి, రామగిరి మండలాల్లో వందలాది మంది వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేయటంపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు.