
సాక్షి, హైదరాబాద్: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సీఎం కుర్చీలో కూర్చుని నిర్వహించిన సమీక్ష సందర్భంగా అనంతపురం జిల్లాలోని రెండు ఎత్తిపోతల పథకాల కోసం సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో హడావుడిగా జీవోలను విడుదల చేయించారని, అందులో రూ.వెయ్యి కోట్లకుపైగా దోపిడీకి వ్యూహం పన్నారని రాప్తాడు వైఎస్సార్ కాంగ్రెస్ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. బాలకృష్ణ ప్రమేయం, దేవినేని అంగీకారంతోనే నంబర్ 59, 60 జీవోలు విడుదలయ్యాయని అన్నారు. గురువారం ప్రకాశ్‌రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment