హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యతో హెచ్సీయూలో మూడోరోజు మంగళవారం కూడా విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. హెచ్సీయూకు వచ్చిన బీజేపీ రాష్ట్ర సెక్రటరీ ప్రకాశ్ రెడ్డిని ఈ సందర్భంగా విద్యార్థులు అడ్డుకున్నారు.
దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొందరు విద్యార్థులు ప్రకాశ్ రెడ్డి వాహనంపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. వైస్ ఛాన్సలర్ అప్పారావును సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. రోహిత్ ఆత్మహత్యకు బీజేపీనే కారణం, ప్రకాశ్ రెడ్డి గో బ్యాక్ అంటూ విద్యార్థులు ధ్వజమెత్తారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు పోలీసులు భారీగా మోహరించారు.