Dalit scholar
-
దళిత ప్రొఫెసర్ ఆనంద్ అరెస్టు అక్రమం
పుణే: దళిత ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబ్డే అరెస్ట్‌పై పుణే కోర్టు పోలీసులను తప్పుబట్టింది. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. గోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబ్డే శనివారం తెల్లవారు జామున కేరళ నుంచి విమానంలో ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే పుణే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2017లో ఎల్గార్ పరిషత్‌లో జరిగిన సమావేశానికి మావోయిస్టులు మద్దతు తెలిపారనీ, ఆ సమావేశంలో వివిధ నేతల రెచ్చగొట్టే ప్రసంగాల కారణంగానే కోరేగావ్–భీమా యుద్ధం స్మారకం వద్ద హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయనేది పోలీసుల ఆరోపణ. తెల్తుంబ్డే మావోయిస్టుల మధ్య సాగిన ఉత్తరప్రత్యుత్తరాల వివరాలు కూడా తమ వద్ద ఉన్నాయంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసు అక్రమమంటూ తెల్తుంబ్డే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు కొట్టివేసేందుకు నిరాకరించిన న్యాయస్థానం.. ఈ నెల 11వ తేదీ వరకు ఆయన్ను అరెస్టు చేయరాదంటూ పోలీసులను ఆదేశించింది. ఆలోగా న్యాయస్థానం నుంచి బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అయితే, పుణే పోలీసులు ఈలోగానే అరెస్టు చేయడం అక్రమమని అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జి కిశోర్ వదానే పేర్కొన్నారు. -
'రాహుల్ అక్కడికి ఎందుకు వెళ్లలేదు'
హైదరాబాద్: దళిత పీహెచ్డీ స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్యతో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రెండోసారి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి రావడం పై బీజేపీ మండిపడుతోంది. రోహిత్ ఆత్మహత్య సంఘటనను రాజకీయం చేయడానికి రాహుల్ మరోసారి హైదరాబాద్ వచ్చారని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి క్రిష్ణసాగర్ ధ్వజమెత్తారు. ఇది కాంగ్రెస్ పార్టీ రాజకీయ దివాళాకోరుతననికి నిదర్శనమన్నారు. చెన్నైలో ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకొని వారం రోజులు గడిచినా ఎందుకు అక్కడికి వెళ్లలేదని ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్ధికోసమే హెచ్‌సీయూకి వచ్చారని ఆరోపించారు. మరో వైపు శుక్రవారం అర్ధరాత్రి క్యాంపస్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ హెచ్‌సీయూ విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. రోహిత్ తల్లి రాధికను కలిసి పరామర్శించారు. వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో శనివారం దేశంలోని యూనివర్సిటీలన్నింటిలోనూ సామూహిక నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన కేంద్రమంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలను పదవుల నుంచి తొలగించాలని, హెచ్‌సీయూ వీసీని తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. -
ప్రకంపనలు సృష్టిస్తున్న రోహిత్ ఆత్మహత్య
-
హెచ్‌సీయూలో మళ్లీ ఉద్రిక్తత
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యతో హెచ్‌సీయూలో మూడోరోజు మంగళవారం కూడా విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. హెచ్సీయూకు వచ్చిన బీజేపీ రాష్ట్ర సెక్రటరీ ప్రకాశ్ రెడ్డిని ఈ సందర్భంగా విద్యార్థులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొందరు విద్యార్థులు ప్రకాశ్ రెడ్డి వాహనంపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. వైస్ ఛాన్సలర్ అప్పారావును సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. రోహిత్ ఆత్మహత్యకు బీజేపీనే కారణం, ప్రకాశ్ రెడ్డి గో బ్యాక్ అంటూ విద్యార్థులు ధ్వజమెత్తారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు పోలీసులు భారీగా మోహరించారు.