
సాక్షి, హైదరాబాద్ : దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రమంటూ.. కేంద్ర మంత్రులు కూడా ఫిదా అయిపోయి కితాబులిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారమంతా ఒట్టి హంబక్ అని బీజేపీ విమర్శించింది. ఏఒక్క కేంద్ర మంత్రి కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని నేరుగా పొడగలేదని, అదంతా టీఆర్ఎస్ మైండ్‌గేమ్ అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. మరో అధికార ప్రతినిధి నరేశ్‌తో కలిసి శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘ టీఆర్‌ఎస్‌తో బీజేపీ కుమ్మక్కైందన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. కేంద్ర మంత్రులు ఎక్కడ కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని నంబర్ వన్‌గా పేర్కొనలేదు. అలాంటి ప్రకటనలన్నీ టీఆర్ఎస్ భవన్ నుంచి వస్తున్నవే. అరుణ్ జైట్లీకి, కేసీఆర్‌ల మధ్య జరిగిన సంభాషణను ఏదో ప్రకటన మాదిరి టీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటోంది. ఒకవేళ కేంద్ర మంత్రులే గనుక టీఆర్‌ఎస్ పథకాలను భేష్ అని ఉంటే ఎలాంటి బహిరంగ చర్చకైనా మేం సిద్ధం’’ అని ప్రకాశ్‌రెడ్డి, నరేశ్‌లు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment