
మద్దతుగా నినదిస్తున్న ఎంటీ జాక్ సభ్యులు
సాక్షి, ముంబై: దక్షిణ ముంబై లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న సీపీఐ అభ్యర్థి ప్రకాశ్‌రెడ్డికి ఎంటీజేఏసీ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భం గా ఆయనకు మద్దతుగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వర్లీలో బీడీడీ చాల్స్ నుంచి వర్లీ నాకావరకు ప్రచార ర్యాలీ నిర్వహిం చారు. ఈ ర్యాలీలో సీపీఐ కార్యకర్తలతోపాటు ఎంటీ జాక్ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎంటీ జాక్ వైస్ చైర్మన్ కె.నర్సింహగౌడ్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో సీపీఐ కీలకపాత్ర పోషించిందన్నారు. అదేవిధంగా ఇక్కడ కార్మికుల హక్కుల కోసం సీపీఐ నిరంతరం పోరాడుతోందన్నారు. అందువల్ల ఈ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.
వీటితోపాటు ప్రస్తుతం మిల్లు కార్మికులకు గృహాల కోసం నిరంతర పోరాటం జరుపుతున్న సీపీఐ నాయకుడు ప్రకాష్‌రెడ్డిని గెలిపించాలని ఈ సందర్భం గా ఎంటీ జాక్ పిలుపునిచ్చింది. ఈ ర్యాలీలో ఎంటీ జాక్ నేతకులు శివరాజ్ బొల్లే, మూల్‌నివాసి మాల, భీంరత్న మాల, కె.స్వామిగౌడ్, సీపీఐ నాయకులు బుచ్చిరాజం, గుండ్ల లక్ష్మి, ఎ.సరోజ, సబ్బని విజయలక్ష్మి, రుక్మిణి సురం పాల్గొన్నారు.