అనంతపురం రూరల్, న్యూస్‌లైన్: తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా గృహిణులకు వంట గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయనున్నట్లు ట్రస్ట్ అధినేత, వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలి పారు. నగరంలోని తన స్వగృహంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో పౌరసరఫరాల శాఖ అ ధికారుల చేతివాటం, బాధ్యతారాహిత్యం వల్ల దీపం పథకం అర్హులకు చేర డం లేదన్నారు. ఇప్పటికీ ప్రతి మండలంలో మూడు నుండి నాలుగువేల మంది దీపం కనెక్షన్ కోసం ఎదురుచూస్తున్నారన్నారు.
రాప్తాడు నియోజకవర్గంలోని అనంతపురం రూరల్, కనగానపల్లి, రామగిరి మండలాలకు అధీకృత డీలర్లు లేకపోవడంతో దీపం పథకం అటకెక్కిందన్నారు. ఇప్పటికి రాప్తాడు నియోజకవర్గంలో చాలామంది మహిళలు కట్టెల పొయ్యిపై కష్టాలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల ఇబ్బందులు తొలగించేందుకు ట్రస్ట్ ద్వారా రాప్తాడు నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి గ్యాస్ కనెక్షన్‌ను అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. మొదటి విడతగా పది వేల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లను అందిస్తామన్నారు. దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్‌కు రూ.5 వేలకు పైగా ఖర్చు వస్తుందన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో దీనిని రూ.3,600కు అందజేస్తామన్నారు. దీనివల్ల లబ్ధిదారులకు రూ.1500 మిగులుబాటు అవుతుందన్నారు. దీంతో పాటు లబ్దిదారులకు బ్యాంకు ఖాతాను, ఆధార్‌తో లింక్ చేస్తే మరో రూ.800 కూడా లబ్ధిదారులకు మిగులుతుందన్నారు. దీంతో గ్యాస్ కనెక్షన్‌కు కేవలం రూ.2,800 మాత్రమే ఖర్చు అవుతుం దని వివరించారు.
సిలిండర్, రెగ్యులేటర్, తదితరాలు ఇస్తామన్నారు. గ్యాస్ కనెక్షన్ కావాల్సినవారు కుంటిమంది ఆనంద్ (ఫోన్ నంబర్ 8790812629), నరేంద్రరెడ్డి (99667 01971), ఉషారాణి (98858 83910), రామ్మోహన్ (9866920773), భాస్కరరెడ్డి (9704444512) లను సంప్రదించవచ్చున్నారు. సమావేశంలో టస్ట్ అధ్యక్షుడు కుంటిమద్ది ఆనంద్, ధనుంజయయాదవ్, పూలకుంట శివారెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర సభ్యులు నరసింహగౌడ్, మాజీ సర్పంచ్ కందుకూరు రాఘవరెడ్డి, బాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పేదల జీవితాలతో రాజకీయమా?
జిల్లాలో పౌరసరఫరాల శాఖ అధికారుల చేతివాటం, బాధ్యతారాిహ త్యం వల్ల దీపం పథకం వల్ల చాలా మంది అర్హులకు లబ్ధి చేకూరడం లే దు. 2013 -14 సంవత్సరానికి సంబంధించి రాప్తాడు నియోజకవర్గంలోని అనంతపురం రూరల్ మండలానికి ఒక్క దీపం కనెక్షన్ కూడా ఇవ్వడం లేదంటే ఇక్కడి ప్రజలపై ప్రభుత్వానికి ఉన్న ప్రేమేంటో ఇట్టే తెలుస్తోంది.
దీని వెనుక ఎవరున్నారో కూడా ప్రత్యేకించి చెప్పక్కరలేదు. ఇపుడు ఎన్నికలు ముంచుకు రావడంతో నగరంలోని ఒక ఏజెన్సీ ద్వారా.. మీకు దీపం కనెక్షన్ మంజూరైందంటూ లబ్ధిదారులకు ఉత్తరాలు వస్తున్నాయి. ఫలానా వారి ద్వారా మీకు ఈ కనెక్షన్ వచ్చిందని ఆ ఏజెన్సీ వారు చెబుతూ రాజకీయాలు చేస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గంలోని అనంతపురం రూరల్, కనగానపల్లి, రామగిరి మండలాలకు అధీకృత డీలర్లు లేకపోవడంతో ఈ హైడ్రామా నడుస్తోంది. పద్దతి మార్చుకోకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి.
- తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
గ్యాస్ కనెక్షన్లకు టీపీఆర్‌సీ ట్రస్ట్ సహకారం
Published Sun, Feb 2 2014 2:48 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement