‘తమ్ముళ్లే’ ఆ గంజాయి బాబులు! | TDP leaders have exposed the toxic culture | Sakshi
Sakshi News home page

‘తమ్ముళ్లే’ ఆ గంజాయి బాబులు!

Jun 25 2023 3:51 AM | Updated on Jun 25 2023 3:51 AM

TDP leaders have exposed the toxic culture - Sakshi

సాక్షి, పుట్టపర్తి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక.. ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఎదుర్కొనే దమ్ములేక టీడీపీ నేతలు విష సంస్కృతికి తెరలేపారు. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బలో గంజాయి సేవించి హల్‌చల్‌ చేసిన యువకులు టీడీపీ కార్యకర్తలు అయినప్పటికీ వారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అను­చరులని తప్పుడు ప్రచారం చేస్తూ బురదజల్లేందుకు ప్రయ­త్నిస్తున్నారు.

రాప్తాడు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌  పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్‌కు సన్నిహితంగా ఉండే కార్తీక్‌.. ఈ నెల 23న తన స్నేహితులతో కలిసి గంజాయి సేవించి వాహనాలతో రోడ్లపై హడావుడి చేశారు. అడ్డొచ్చిన  వాహనాలను ఢీకొట్టారు. ఎదురు మాట్లాడిన వ్యక్తిని  చితకబాదారు. పోలీసులు పట్టుకుంటే ‘వైఎస్సార్‌సీపీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి’ స్టిక్కర్‌ చూపించారు. తాము చేసిన అరాచకాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి  ప్రకాశ్‌రెడ్డిపైకి నెట్టేందుకే ఈ స్టిక్కర్‌’  చూపించినట్లు తెలుస్తోంది.

బురద జల్లేందుకే.. 
నిజానికి.. 2019 ఎన్నికల్లో రాప్తాడు నుంచి టీడీపీ తరఫున పోటీచేసి ఘోరంగా ఓడిపోయిన పరిటాల  శ్రీరామ్‌.. రాజకీయంగా ఎదుర్కొనే సత్తాలేక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై బురదజల్లేందుకు ఆకతాయిలను రోడ్లపై వదిలినట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది.

గంజాయి మత్తులో వీరంగం చేయడంతో పాటు అధికార పార్టీ నేతలను లాగాలని చూడటం తెలుగు తమ్ముళ్లకు సరికాదని వైఎస్సార్‌సీపీ శ్రేణులు సోషల్‌ మీడియాలో కౌంటర్‌ ఇచ్చాయి. ఇక ముదిగుబ్బ పోలీసుల అదుపులో ఉన్న కార్తీక్‌ గురించి వైఎస్సార్‌సీపీ నేతలు ఆరా తీయగా పరిటాల శ్రీరామ్‌కు అత్యంత సన్నిహితుడిగా తేలింది. అదేవిధంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో దిగిన అతని ఫొటోలూ సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement