
సాక్షి, సినిమా : యంగ్ హీరో నితిన్ 25వ చిత్రం టైటిల్‌ను ఎట్టకేలకు రివీల్ చేసేశారు. ‘ఛల్ మోహన్ రంగ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసేశారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ పీకే(పవన్ కళ్యాణ్) క్రియేటివ్ వర్క్స్ అధికారిక పోస్టర్‌ను విడుదల చేసింది.
రౌడీఫెలో ఫేమ్ కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో లై బ్యూటీ మేఘా ఆకాశ్ నితిన్‌కు జోడీగా నటిస్తోంది. ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనరగా ఈ చిత్రం తెరకెక్కినట్లు పోస్టర్ చూస్తే అర్థమైపోతోంది. ఈ చిత్రానికి థమన్ బాణీలు అందిస్తున్నాడు. ముందుగా ఈ చిత్రానికి ‘గుర్తుందా శీతాకాలం’ అనే టైటిల్ పరిశీలించినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి కథ అందించగా, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ - శ్రేష్ట్ మూవీస్ సంయుక్తంగాఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి . ఏప్రిల్‌లో ఛల్ మోహన్ రంగ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
— PK Creative Works (@PKCreativeWorks) 11 February 2018
Comments
Please login to add a commentAdd a comment