నితిన్ కొత్త సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్‌ | Intresting Title For Nithin And Krishna Chaitanya Films | Sakshi
Sakshi News home page

నితిన్ కొత్త సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్‌

Published Sat, Mar 30 2019 4:14 PM | Last Updated on Sat, Mar 30 2019 4:14 PM

Intresting Title For Nithin And Krishna Chaitanya Films - Sakshi

శ్రీనివాస కల్యాణం సినిమా తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న నితిన్‌.. శనివారం తన పుట్టిన రోజు సందర్భంగా ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ను ప్రకటించాడు. ఇప్పటికే వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మాతో పాటు చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమాను ప్రకటించిన నితిన్‌.. తాజాగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమాను ఎనౌన్స్‌ చేశాడు.

నితిన్‌ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్‌ మూవీస్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు పవర్‌ పేట అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. అంతేకాదు నితిన్‌ కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా 2020 సమ్మర్‌లో ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించానున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement