
హీరో నితిన్, రష్మికా మందన్నాలు మరోసారి జంటగా నటించనున్నారు. వెంకీ కుడుమల డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా గ్రాండ్‌గా ప్రారంభమైంది. దీనికి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తం షాట్‌ను క్లాప్ కొట్టి ఆరంభించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. నేడు పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంచ్ అయ్యింది.
దీనికి సంబంధించిన ఫోటోలు #VNRTrio అనే హ్యష్ ట్యాగ్‌తో ట్రెండ్ అవుతున్నాయి. గతంలో నితిన్-రష్మికలు జోడీగా భీష్మలో నటించి సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment