Why Rashmika Mandanna Quit Nithin Movie, Rumours Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Rashmika Quits Nithin Movie: నితిన్ సినిమా నుంచి ఔట్.. కారణమదేనా?

Published Thu, Jul 13 2023 8:52 PM | Last Updated on Fri, Jul 14 2023 11:06 AM

Rashmika Quit Nithin Movie Her Manger Reason - Sakshi

హీరోయిన్ రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్‌గా ఫుల్ బిజీగా ఉంది. 'పుష్ప 2'తోపాటు పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ఈమె.. నితిన్ సినిమా నుంచి తప్పుకుందనే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో నిజానిజాల సంగతి పక్కనబెడితే మరో కొత్త విషయం ఒకటి బయటకొచ్చింది. ఈమెపై ఓ వ్యక్తి కుట్ర చేస్తున్నాడని అంటున్నారు. 

కిరాక్ హిట్‌తో
కన్నడ బ్యూటీ రష్మిక.. డిగ్రీ చదువుతున్న టైంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 'కిరిక్ పార్టీ' అనే చిత్రంతో వచ్చీరావడంతో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకుంది. అలా 'ఛలో' మూవీతో తెలుగులోకి వచ్చేసింది. ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో రష్మిక దశ తిరిగిపోయింది. యంగ్ హీరోలతో వరసపెట్టి నటించింది. అల్లు అర్జున్‌తో చేసిన 'పుష్ప' అయితే ఈమెని పాన్ ఇండియా స్టార్‌ని చేసేసింది.

(ఇదీ చదవండి: పెళ్లి జీవితంపై సంగీత కామెంట్స్.. అప్పట్లో చాలా దారుణంగా!)

నితిన్ ప్రాజెక్ట్ నుంచి ఔట్
ప్రస్తుతం 'పుష్ప 2'తో రష్మిక బిజీగా ఉంది. దీనితోపాటు హిందీలో 'యనిమల్', ద్విభాషా చిత్రం 'రెయిన్ బో' లోనూ నటిస్తూ బిజీగా ఉంది. నితిన్-వెంకీ కుడుముల మూవీలో ఈమెనే హీరోయిన్ గా చేస్తోంది. కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల ఈమె తప్పుకొందనే న్యూస్ ఒకటి బయటకొచ్చింది. ఈమె బదులు శ్రీలీలని హీరోయిన్‌గా తీసుకున్నారని అన్నారు. ఇందులో క్లారిటీ రావాల్సి ఉంది.

అతడు వల్ల
అయితే కొన్నిరోజుల ముందు రష్మికని మేనేజర్ మోసం చేశాడని న్యూస్ వచ్చింది. ఇది జరిగిన కొన్నాళ్లకు ఫ్రొఫెషనల్‪‌గా వీళ్లిద్దరూ విడిపోయారు. అప్పుడు ఏం జరిగిందనేది పక్కనబెడితే.. ఇప్పుడు అతడే రష్మిక కెరీర్ ని దెబ్బ కొడుతున్నాడని అంటున్నారు. రష్మికకు తెలుగుపై పెద్దగా ఆసక్తి లేదని అందరీ దగ్గర చెబుతున్నాడట. ఈ కారణంగానే నితిన్ ప్రాజెక్ట్ నుంచి ఈమె తప్పుకొందని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై స్వయానా రష్మిక స్పందిస్తే గానీ అసలు విషయం బయటపడదు.

(ఇదీ చదవండి: 'ఆదిపురుష్' దెబ్బకు ఇరకాటంలో ఆ సినిమా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement