నితిన్- వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం భీష్మ. ఈ సినిమా నితిన్ కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగానూ దుమ్మురేపిందీ చిత్రం. ఈ సినిమా తర్వాత నితిన్‌కు మళ్లీ ఆ స్థాయిలో హిట్ పడలేదు. ఇదిలా ఉండగా వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పుడు మరో సినిమా రానున్నట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
రీసెంట్‌గా వెంకీ కుడుముల ఓ కథను చెప్పడం, నితిన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందట.
Comments
Please login to add a commentAdd a comment