
హీరో నితిన్, హీరోయిన్ రష్మికా మందన్నా మరోసారి జోడీగా నటించనున్నారా? అంటే అవునను అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక జంటగా నటించిన భీష్మ చిత్రం 2020 ఫిబ్రవరి 21 విడుదలై మంచి హిట్‌ను అందుకుంది. కాగా మరోసారి భీష్మ కాంబినేషన్ రిపీట్ కానుందని టాక్. ఛలో, భీష్మ చిత్రాలతో వరుస హిట్లు అందుకున్న వెంకీ కుడుముల మూడో చిత్రాన్ని చిరంజీవితో తీయనున్నారనే వార్తలొచ్చాయి. అయితే ఆ ప్రాజెక్టుపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
కాగా తన తర్వాతి చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌లో చేయనున్నారు వెంకీ కుడుముల. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరగుతున్నాయి. ఇందులో హీరో, హీరోయిన్లుగా నితిన్, రష్మిక నటిస్తున్నారని భోగట్టా. భీష్మలో వీరి జోడీకి మంచి మార్కేలే పడటంతో మరోసారి రిపీట్ చేసేందుకు వెంకీ ఆసక్తి చూపుతున్నారు.ఈ ఏడాది చివరల్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుందని టాక్.
Comments
Please login to add a commentAdd a comment