Sreeleela Replaces Rashmika Mandanna In Nithiin And Venky Kudumula Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Sreeleela Replaces Rashmika: క్రేజీ కాంబినేషన్‌ నుంచి రష్మిక ‍అవుట్.. ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల!

Published Thu, Jul 13 2023 8:04 AM | Last Updated on Thu, Jul 13 2023 12:28 PM

Sreeleela Replaced In Rashmika Mandanna In Venky Kudumula Film - Sakshi

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో దూసుకెళ్లున్న హీరోయిన్లు వారిద్దరే. ఆ ఇద్దరు స్టార్ హీరోలతో ఛాన్స్‌లు కొట్టేస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. అంతే కాకుండా వారిద్దరి మధ్యనే విపరీతమైన పోటీ నెలకొంది. డైరెక్టర్స్ కూడా హీరోయిన్ల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కొన్ని సినిమాలు ఎంపిక చేశాక హీరోయిన్స్ ఏదో ఒక కారణంతో తప్పుకోవడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ నుంచి స్టార్ హీరోయిన్ తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అంతే కాకుండా మరో హీరోయిన్‌ను సెలెక్ట్ చేయడం కూడా జరిగిపోయిందట. ఇంతకీ టాలీవుడ్‌ను ఊపేస్తున్న ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం.

(ఇది చదవండి: శ్రీలీల బదులు రష్మిక.. సూపర్ ఛాన్స్ కొట్టేసింది!)

ఒకరు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కాగా.. మరొకరు పెళ్లసందడి ఫేమ్ శ్రీలీల. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ప్రస్తుతం బాలీవుడ్‌లో యానిమల్, పుష్ప-2, రెయిన్‌ బో సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఈ ఏడాది భీష్మ కాంబినేషన్ నితిన్‌కు జోడీగా మరో చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే అఫీషియల్ కూడా ప్రకటించేశారు. కానీ ఈ చిత్రం నుంచి రష్మిక తప్పుకుందని వార్తొలొస్తున్నాయి. ఆమె స్థానంలో పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల ఛాన్స్ కొట్టేసిందని టాలీవుట్‌లో టాక్ వినిపిస్తోంది.  భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుముల తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం నుంచి రష్మిక వైదొలిగినట్లు తెలుస్తోంది. అయితే ఆమె చేతిలో వరుసగా భారీ సినిమాలు చేతిలో ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.  

కాగా.. ఇప్పటికే మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంలో పూజా హెగ్డే స్థానంలోనూ శ్రీలీల ఛాన్స్ కొట్టేసింది. రష్మిక తర్వాత శ్రీలీలనే టాప్‌ హీరోయిన్‌గా కనిపిస్తోంది. ఈ ఏడాదిలోనే ఆదికేశవ, స్కంద, భగవంత్ కేసరి, గుంటూరు కారం, వీడీ12, ఉస్తాద్ భగత్ సింగ్‌తో సహా దాదాపు ఏడు చిత్రాలలో నటిస్తోంది. కాగా.. గతంలో.. హీరో నితిన్‌, హీరోయిన్‌ రష్మికా మందన్నా భీష్మ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. మరోసారి క్రేజీ కాంబో రిపీట్ కాబోతోందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.

(ఇది చదవండి: నయన్ భర్తకు వార‍్నింగ్ ఇచ్చిన షారుక్ ఖాన్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement