
‘మేము గోదారోళ్ళం.. మాట ఒకటే సాగదీస్తాం.. తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం’ అంటున్నారు విశ్వక్ సేన్.. కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ హీరోగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న చిత్రంలోని డైలాగ్ ఇది. ఈ చిత్రానికి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టైటిల్‌ని ఖరారు చేసినట్లు ప్రకటించి, యూనిట్ రిలీజ్ చేసిన వీడియో గ్లింప్స్‌లో పైన పేర్కొన్న డైలాగ్స్ ఉన్నాయి. ‘‘క్రూరమైన ప్రపంచంలో సామాన్యుడి నుంచి సంపన్నుడిగా ఎదిగిన వ్యక్తిగా విశ్వక్ సేన్ గ్రే క్యారెక్టర్ చేస్తున్నారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. నేహా శెట్టి కథానాయికగా, అంజలి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, కెమెరా: అనిత్ మధాది.
Comments
Please login to add a commentAdd a comment