
నితిన్ హీరోగా కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు ‘పవర్‌పేట’ అనే టైటిల్ ఖరారైంది. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. గత ఏడాది నితిన్ – కృష్ణచైతన్య కాంబినేషన్‌లో ‘ఛల్ మోహన్ రంగ’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. నితిన్ హీరోగా నటించిన ఇష్క్ (2012), ‘గుండెజారి గల్లంతయ్యిందే’ (2013), ‘అ ఆ’ సినిమాలకు కృష్ణచైతన్య పాటలు రాశారు. మరోవైపు ప్రస్తుతం ఇటలీలో జరుగుతున్న ‘భీష్మ’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు నితిన్. అలాగే దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కిస్తున్న ‘చదరంగం’, వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ‘రంగ్ దే’ చిత్రాలతో నితిన్ వచ్చే ఏడాది వేసవి వరకు ఫుల్ బిజీ.
Comments
Please login to add a commentAdd a comment