భర్త వికృత చేష్టలపై భార్య ఫిర్యాదు | Wife complaints against Husband in cyber crime police station | Sakshi
Sakshi News home page

స్కైప్‌ ద్వారా న్యూడ్‌ ఫోటోలు

Published Thu, Jun 22 2017 6:21 PM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM

భర్త వికృత చేష్టలపై భార్య ఫిర్యాదు - Sakshi

భర్త వికృత చేష్టలపై భార్య ఫిర్యాదు

హైదరాబాద్‌: తాళి కట్టిన భర్తే విచక్షణ మరిచాడు. భార్యతో కలిసి సన్నిహితంగా ఉన్న దృశ్యాలను అతగాడు స్నేహితుడికి పంపిన ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే...  సైబరాబాద్ పరిధిలో నివాసముంటున్నఓ మహిళ తన భర్త వికృత చేష్టలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ పడకగదిలో సన్నివేశాలను తన భర్త ఆన్‌లైన్‌ ద్వారా చెన్నైలోని తన  స్నేహితుడు శ్రీమన్‌కు పంపిస్తున్నట్లు అని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.  పోలీసులు కేసు నమోదు చేసి భర్త కృష్ణ చైతన్యను అరెస్ట్ చేశారు. లాప్‌ట్యాప్‌తో పాటు అతడి ఫోన్‌ను సీజ్‌ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.

అంతేకాకుండా కృష్ణ చైతన్య, శ్రీమన్‌ పరస్పరం తమ భార్యల న్యూడ్‌ ఫోటోలను  స్కైప్‌ ద్వారా పంపుకునేవారిని వెల్లడించారు.  కాగా కృష్ణచైతన్య ప్రవర్తనపై అనుమానం వచ్చి అతడి ఫోన్‌లో వెతకగా, ఈ వీడియోలు బయటపడినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆమె తమకు ఫిర్యాదు చేసిందన్నారు. అలాగే శ్రీమన్‌ కోసం పోలీసులు చెన్నై బయల్దేరి వెళ్లారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement