బీటెక్ బాబు హంగామా! | VIP as 'Raghuvaran B Tech' in Telugu | Sakshi
Sakshi News home page

బీటెక్ బాబు హంగామా!

Published Thu, Dec 11 2014 12:36 AM | Last Updated on Sat, Sep 2 2017 5:57 PM

బీటెక్ బాబు హంగామా!

బీటెక్ బాబు హంగామా!

రఘువరన్ చాలా మంచి కుర్రాడు. బుద్ధిగా చదువుకుంటాడు. బీటెక్ కూడా పూర్తి చేస్తాడు. మంచి ఉద్యోగం దొరికితే హ్యాపీగా సెటిలైపోవచ్చు. కానీ, అనుకున్నామని అన్నీ జరుగుతాయా? ఉద్యోగం రాదు. మరి.. ఈ నిరుద్యోగ యువకుడు ఏం చేస్తాడు? అతని జీవితంలో జరిగిన సంఘటనలేంటి? అనే కథాంశంతో రూపొందిన తమిళ చిత్రం ‘వేలై ఇల్లా పట్టదారి’. ధనుష్, అమలాపాల్ జంటగా ఆర్. వేల్‌రాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం అనువాద హక్కులను శ్రీస్రవంతి మూవీస్ అధినేత రవికిశోర్ దక్కించుకున్నారు.
 
 కృష్ణచైతన్య సమర్పణలో ఈ చిత్రాన్ని ‘రఘువరన్ బీటెక్’ పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ సందర్భంగా రవికిశోర్ మాట్లాడుతూ -‘‘తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఉన్న కథ కావడంతో ఇక్కడ విడుదల చేస్తున్నాం. బలమైన కథ, కథనాలు ఉంటాయి. ‘కొలవెరి..’ ఫేం అనిరుధ్ స్వరపరచిన పాటలు ఓ హైలైట్. వచ్చే వారంలో పాటలను, అతి త్వరలో చిత్రాన్ని విడుదల చేయనున్నాం. మా స్రవంతి మూవీస్ నుంచి ఇప్పటివరకు వచ్చిన చిత్రాలు కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా ఉంటాయి. ఈ చిత్రం కూడా అలానే ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: కిశోర్ తిరుమల, పాటలు: రామజోగయ్య శాస్త్రి
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement