Raghuvaran B Tech
-
వివాదంలో రఘువరన్ బీటెక్ నటి.. !
కోలీవుడ్ ధనుశ్ నటించిన చిత్రం రఘువరన్ బీటెక్. ఈ చిత్రంలో అతనికి జోడీగా అమలా పాల్ నటించింది. ఇంజినీరింగ్ చదివిన నిరుద్యోగుల బాధలను చూపే నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో రఘువరన్‌కు తల్లిగా నటి శరణ్య పొన్వన్నన్ నటించారు. అమాయకపు తల్లి పాత్రలో మెప్పించారు. తాజాగా ఆమె ఓ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోని వారు నివాసముండే విరుంగబాక్కంలో పార్కింగ్ గొడవ ఏకంగా పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లింది. పార్కింగ్ విషయంలో పొరుగింటి వారితో వివాదం తలెత్తింది. దీంతో పక్కింటి వారు శరణ్య పొన్వన్నన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను నటి బెదిరించిందని పేర్కొంటూ శ్రీదేవి అనే మహిళ పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభినట్లు తెలుస్తోంది. అయితే శరణ్య రఘువరన్ బీటెక్‌తో పాటు 24, వేదం, గ్యాంగ్ లీడర్, మహాసముద్రం, ఖుషి లాంటి సినిమాల్లోనూ కనిపించారు. -
Amala Paul: మూడోసారి రొమాన్స్ చేసేందుకు రెడీ?
నటుడు ధనుష్ సరసన మూడోసారి నటించడానికి నటి అమలాపాల్ సిద్ధమవుతున్నారా? అంటే అలాంటి అవకాశమే ఉందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ధనుష్ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. తదుపరి ఆనంద్ రాయ్ దర్శకత్వంలో ఒక హిందీ చిత్రాన్ని, తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయనున్నారు. ఈ రెండు చిత్రాల్లో ఏకకాలంలో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తదుపరి ఆయన తన 50వ చిత్రానికి రెడీ అవుతున్నారు. ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. (ఇదీ చదవండి: Drugs Case: ఆషూ రెడ్డి వీడియో విడుదల) ఉత్తర చైన్నె నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఇందులో నటి దుషార విజయన్, నటుడు విష్ణువిశాల్ తదితరులు ముఖ్య పాత్రలకు ఎంపికై నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ధనుష్ సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది చర్చగా మారింది. ముందుగా త్రిష నటించనున్నట్లు ప్రచారం సాగింది. ఆ తర్వాత అపర్ణ బాలమురళి పేరు వెలుగులోకి వచ్చింది. తాజాగా సంచలన నటి అమలాపాల్ పేరు వినిపిస్తోంది. (ఇదీ చదవండి: ఆకాంక్ష పూరి నడుమును కెమెరాల ముందే పట్టుకున్న నటుడు) ఇటీవల కోలీవుడ్‌లో అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్‌పై దృష్టి సారించిన అమలాపాల్ ఇంతకుముందు ధనుష్‌కు జంటగా రఘువరన్ బీటెక్ పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఆ రెండు చిత్రాలు విజయాన్ని సాధించాయి. దీంతో మళ్లీ మూడోసారి ధనుష్ 50వ చిత్రంలో ఈ మలయాళీ భామ నటించడానికి సిద్ధమవుతున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
కొన్ని సినిమాలు టచ్ చేయకూడదు
‘‘ధనుష్ నటించిన ‘వేలై ఇల్లా పట్టదారి’ చూశాను. నాకు చాలా నచ్చింది. పెదనాన్నగారు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. కొంతమంది ఈ చిత్రాన్ని ఎందుకు రీమేక్ చేయలేదని అడిగారు. కొన్ని సినిమాలను టచ్ చేయకూడదు. అందుకే అనువదించాం. ధనుష్ అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో ఆయన పాత్రతో నేను చాలా కనెక్ట్ అయ్యాను. అనిరుధ్ మంచి పాటలిచ్చారు’’ అని హీరో రామ్ అన్నారు. ధనుష్, అమలాపాల్ జంటగా ఆర్. వేల్రాజ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘వేలై ఇల్లా పట్టదారి’ని ‘రఘువరన్ బీటెక్’ పేరుతో నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘కొలవెరి..’ ఫేమ్ అనిరుధ్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని రామ్ ఆవిష్కరించి హీరో శర్వానంద్‌కు ఇచ్చారు. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ -‘‘ధనుష్ చేసే ప్రతి సినిమా వినూత్నంగా ఉంటుంది. ఆయనకు అభిమానిని. యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే చిత్రం ఇది. తమిళంలో లాగా తెలుగులోనూ ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ధనుష్ మాట్లాడుతూ -‘‘నేను చాలా ఇష్టపడి చేసిన చిత్రాల్లో ఇదొకటి. ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న రవికిశోర్‌కి ధన్యవాదాలు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి, ఆయనకు లాభాలు రావాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. ఈ వేడుకలో రవికిశోర్, కృష్ణచైతన్య తదితరులు పాల్గొన్నారు. -
బీటెక్ బాబు హంగామా!
రఘువరన్ చాలా మంచి కుర్రాడు. బుద్ధిగా చదువుకుంటాడు. బీటెక్ కూడా పూర్తి చేస్తాడు. మంచి ఉద్యోగం దొరికితే హ్యాపీగా సెటిలైపోవచ్చు. కానీ, అనుకున్నామని అన్నీ జరుగుతాయా? ఉద్యోగం రాదు. మరి.. ఈ నిరుద్యోగ యువకుడు ఏం చేస్తాడు? అతని జీవితంలో జరిగిన సంఘటనలేంటి? అనే కథాంశంతో రూపొందిన తమిళ చిత్రం ‘వేలై ఇల్లా పట్టదారి’. ధనుష్, అమలాపాల్ జంటగా ఆర్. వేల్రాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం అనువాద హక్కులను శ్రీస్రవంతి మూవీస్ అధినేత రవికిశోర్ దక్కించుకున్నారు. కృష్ణచైతన్య సమర్పణలో ఈ చిత్రాన్ని ‘రఘువరన్ బీటెక్’ పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ సందర్భంగా రవికిశోర్ మాట్లాడుతూ -‘‘తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఉన్న కథ కావడంతో ఇక్కడ విడుదల చేస్తున్నాం. బలమైన కథ, కథనాలు ఉంటాయి. ‘కొలవెరి..’ ఫేం అనిరుధ్ స్వరపరచిన పాటలు ఓ హైలైట్. వచ్చే వారంలో పాటలను, అతి త్వరలో చిత్రాన్ని విడుదల చేయనున్నాం. మా స్రవంతి మూవీస్ నుంచి ఇప్పటివరకు వచ్చిన చిత్రాలు కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా ఉంటాయి. ఈ చిత్రం కూడా అలానే ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: కిశోర్ తిరుమల, పాటలు: రామజోగయ్య శాస్త్రి