
నటుడు ధనుష్ సరసన మూడోసారి నటించడానికి నటి అమలాపాల్ సిద్ధమవుతున్నారా? అంటే అలాంటి అవకాశమే ఉందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ధనుష్ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. తదుపరి ఆనంద్ రాయ్ దర్శకత్వంలో ఒక హిందీ చిత్రాన్ని, తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయనున్నారు. ఈ రెండు చిత్రాల్లో ఏకకాలంలో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తదుపరి ఆయన తన 50వ చిత్రానికి రెడీ అవుతున్నారు. ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది.
(ఇదీ చదవండి: Drugs Case: ఆషూ రెడ్డి వీడియో విడుదల)
ఉత్తర చైన్నె నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఇందులో నటి దుషార విజయన్, నటుడు విష్ణువిశాల్ తదితరులు ముఖ్య పాత్రలకు ఎంపికై నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ధనుష్ సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది చర్చగా మారింది. ముందుగా త్రిష నటించనున్నట్లు ప్రచారం సాగింది. ఆ తర్వాత అపర్ణ బాలమురళి పేరు వెలుగులోకి వచ్చింది. తాజాగా సంచలన నటి అమలాపాల్ పేరు వినిపిస్తోంది.
(ఇదీ చదవండి: ఆకాంక్ష పూరి నడుమును కెమెరాల ముందే పట్టుకున్న నటుడు)
ఇటీవల కోలీవుడ్లో అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్‌పై దృష్టి సారించిన అమలాపాల్ ఇంతకుముందు ధనుష్‌కు జంటగా రఘువరన్ బీటెక్ పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఆ రెండు చిత్రాలు విజయాన్ని సాధించాయి. దీంతో మళ్లీ మూడోసారి ధనుష్ 50వ చిత్రంలో ఈ మలయాళీ భామ నటించడానికి సిద్ధమవుతున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.