నితిన్ కొత్త సినిమా అప్ డేట్ | Nithin Latest Movie Update | Sakshi
Sakshi News home page

నితిన్ కొత్త సినిమా అప్ డేట్

Published Sat, Oct 14 2017 1:22 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Nithin - Sakshi

'లై' సినిమాతో నిరాశపరిచిన నితిన్ సైలెంట్ గా తన తదుపరి సినిమా పనులు పూర్తి చేసేస్తున్నారు. లై సెట్స్ మీద ఉండగానే పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాను ప్రారంభించిన ఈ యంగ్ హీరో, ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. రౌడీఫెలో ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరోసారి మేఘా ఆకాష్ నితిన్ కు జోడిగా నటిస్తున్నారు.

దాదాపు ఏడాది పాటు లై సినిమా కోసం సమయం కేటాయించిన నితిన్ ఆ తరువాత ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా మరో సినిమా పనుల్లో బిజీ అయ్యారు. తాజాగా ఈ సినిమా అమెరికాలో భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. నెలరోజుల పాటు కొనసాగిన ఈ షెడ్యూల్ లో హీరో, హీరోయిన్లతో పాటు ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement