ప్రేమ.. వినోదం
కృష్ణచైతన్య, రాజేష్ రాథోడ్, సూర్య శ్రీనివాస్, మోనికా సింగ్, షాలు చారసియా ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓ పిల్లా నీ వల్లా’. బిగ్ విగ్ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కిషోర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. కిషోర్ మాట్లాడుతూ– ‘‘లవ్, కామెడీ, యాక్షన్ కథాంశంగా తెరకెక్కిన చిత్రమిది. విభిన్నమైన ప్రేమకథ.
యువతరంతో పాటు అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే వినోదం, వాణిజ్య అంశాలు మా సినిమాలో ఉన్నాయి. నటీనటులు, టెక్నీషియనన్స్ సపోర్ట్‌తో సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేశాం. తెలుగు ప్రేక్షకులకు మా చిత్రం నచ్చుతుందనే నమ్మకం ఉంది. మధు పొన్నాస్ సంగీతం, షోయబ్ అహ్మద్ సినిమాటోగ్రఫీ సినిమాను మరో ఎత్తుకి తీసుకెళ్తాయి. అతి త్వరలోనే పాటలు, చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు.