Surya Srinivas
-
ఇద్దరు స్నేహితుల కథే ‘ఈవీఓఎల్’
సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు హీరోలుగా, జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘ఈవీఓఎల్’ (ఏ లవ్‌స్టోరీ ఇన్ రివర్స్). తేడా బ్యాచ్ సినిమా సమర్పణలో రామ్ యోగి వెలగపూడి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో రామ్ యోగి వెలగపూడి మాట్లాడుతూ– ‘‘ఇద్దరు స్నేహితుల మధ్య అవగాహన నేపథ్యంలో సాగే కథే ఈ మూవీ. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. హైదరాబాద్, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: తేడా బ్యాచ్ సినిమా టీమ్. -
రివర్స్ లవ్‌స్టోరీగా ‘ఈవీఓఎల్’
సూర్య శ్రీనివాస్, శివ బొడ్డురాజు, జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఈవీఓఎల్’. రామ్‌యోగి వెలగపూడి స్వీయదర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ‘ఎల్ఓవీఈ।ని(లవ్)రివర్స్‌లో చూస్తే ‘ఈవీఓఎల్’. ఈ మూవీ ఓ రివర్స్ లవ్‌స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఈ మధ్య కాలంలో జరుగుతున్న నిజ సంఘటనల జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం. రామ్ యోగి వెలగపూడి ఈ చిత్రానికి దర్శకుడిగా మరియు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు స్నేహితులు మధ్య జరిగే రహస్య ఒప్పందం ఆధారంగా తలకెక్కిన చిత్రం. ఈ కాలంలో జరుగుతున్న యదార్థ సంఘటన ఆధారంగా బోల్డ్ సీన్స్ తో రియలిస్టిక్ సినిమాని తెరకెక్కించడం జరిగింది’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
అమెజాన్ ప్రైమ్‌లో 'పరిగెత్తు పరిగెత్తు'
ఇటీవల కాలంలో చిన్న సినిమాలకు మంచి ఆదరణ కల్పిస్తున్నారు ప్రేక్షకులు. కంటెంట్ బాగుంటే తప్పకుండా సినిమా ను చూస్తామని మరొకసారి 'పరిగెత్తు పరిగెత్తు' సినిమా ద్వారా నిరూపించారు. ఈమధ్యనే థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఎంతగానో అలరించింది ఈ సినిమా. విమర్శకుల ప్రశంశలు అందుకున్న ఈ సినిమా లాంగ్ రన్ లో మంచి కలెక్షన్లు అందుకుని సూపర్ హిట్ సినిమా గా నిలవగా ఈ సినిమా తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో కూడా స్ట్రీమ్ అవుతూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటూ ఉన్నది. సూర్య శ్రీనివాస్, అమృత ఆచార్య హీరో హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమా కి రామకృష్ణ తోట దర్శకత్వం వహించగా ఎన్ ఎస్ సినీ ఫ్లిక్స్ పతాకంపై ఏ యామిని కృష్ణ నిర్మించారు. నిర్మాత యామిని కృష్ణ మాట్లాడుతూ.. థియేటర్లలో విడుదలై మంచి పేరు సంపాదించుకున్న 'పరిగెత్తు పరిగెత్తు' సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో కూడా విడుదలై ప్రేక్షకుల మన్ననలను పొందుతుంది. మా సినిమా కి ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తి తో ఇలాంటి మంచి మంచి సినిమాలు ఇంకా నిర్మిస్తాను. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అన్నారు. దర్శకుడు రామకృష్ణ తోట మాట్లాడుతూ.. మా సినిమా ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షక దేవుడికి ధన్యవాదాలు. మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మా సినిమా అందరికి ఇంత బాగా నచ్చడం సంతోషంగా ఉంది. నిర్మాత నమ్మకాన్ని నిలబెట్టినందుకు సంతోషంగా ఉంది. ధియేటర్ లలో సినిమాలు విడుదల చేయడానికి భయపడుతున్న సమయంలో మా సినిమా ను ధియేటర్ లలో విడుదల చేసి ధైర్యం చేశాము. ప్రేక్షకులు కూడా సినిమా ను చాలా బాగా ఆదరించారు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో కూడా మా సినిమా కి మంచి పేరొస్తుంది. నేను ఇంత మంచి సినిమా చేయడానికి సహాయపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు అన్నారు. -
పరిగెత్తు పరిగెత్తు’కి మంచి టాక్ రావడం సంతోషం: హీరో
'పరిగెత్తు పరిగెత్తు' సినిమాకు మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు తప్పకుండా ఆదరణ ఉంటుందని ఆడియెన్స్ మరోసారి నిరూపించారు. నా క్యారెక్టర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది’ అన్నారు హీరో సూర్య శ్రీనివాస్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం పరిగెత్తు పరిగెత్తు. రామకృష్ణ తోట దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమృత ఆచార్య హీరోయిన్గా నటించింది. ఎన్ ఎస్ సినీ ఫ్లిక్స్ పతాకంపై ఏ యామిని కృష్ణ నిర్మించిన ఈ చిత్రం.. శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ..మేము ఎలాంటి రిజల్ట్ ఎక్స్ పెక్ట్ చేశామో ప్రేక్షకులు అంత మంచి హిట్ 'పరిగెత్తు పరిగెత్తు' సినిమాకు అందించారు. థియేటర్ దగ్గర సినిమాకు మంచి రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉంది. జెన్యూన్ టాక్ తో మా సినిమా ప్రదర్శితం అవుతోంది. ప్రతి షో కూ మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతూ, మరింత ఆదరణ దక్కుతోంది. ఈ విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్. అన్నారు. -
‘పరిగెత్తు పరిగెత్తు’ బిగ్ బ్రేక్ ఇస్తుందని ఆశిస్తున్నా: సూర్య శ్రీనివాస్
'పరిగెత్తు పరిగెత్తు' చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. నటుడిగా నాకు పర్మార్మెన్స్ కు బాగా స్కోప్ దొరికింది. ఈ సినిమా హీరోగా నాకు బిగ్ బ్రేక్ ఇస్తుందని ఆశిస్తున్నాను’అన్నారు యంగ్ హీరో సూర్య శ్రీనివాస్. ఓటీటీ ,సిల్వర్ స్క్రీన్ మీద మంచి పాత్రలు చేసి తన ప్రతిభ చూపిన సూర్య శ్రీనివాస్, 'పరిగెత్తు పరిగెత్తు' సినిమాతో హీరోగా మారాడు. ఈ మూవీ జూలై 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా సూర్యశ్రీనివాస్ మాట్లాడుతూ.. 'పరిగెత్తు పరిగెత్తు' తప్పక విజయం సాధిస్తుందన్నారు. ప్రస్తుతం కమిట్ మెంట్, టాక్సీ 911, చిల్ బ్రో, జమానా సినిమాల్లో నటిస్తున్నానని, ఈ సినిమాలు కూడా వీలైనంత త్వరగా రిలీజ్ కాబోతున్నాయని తెలిపాడు. -
జూలై 30న థియేటర్లలో 'పరిగెత్తు పరిగెత్తు'
సూర్య శ్రీనివాస్, అమృత ఆచార్య జంటగా నటించిన సినిమా 'పరిగెత్తు పరిగెత్తు'. ఈ చిత్రాన్ని ఎన్ ఎస్ సినీ ఫ్లిక్స్ పతాకంపై ఏ యామిని కృష్ణ నిర్మించారు. రామకృష్ణ తోట దర్శకత్వంలో రూపొందిన ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ నెల 30న 'పరిగెత్తు పరిగెత్తు' సినిమా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా దర్శకుడు రామకృష్ణ తోట మాట్లాడుతూ.. ‘పరిగెత్తు పరిగెత్తు' మూవీని థియేటర్ రిలీజ్ కు తీసుకురావడం సంతోషంగా ఉంది. ఇటీవలే సెన్సార్ పూర్తి అయ్యింది. సెన్సార్ రిపోర్ట్ చాలా బాగుంది. వాళ్ల అభినందనలతో సినిమా మీద మాకు మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. సెన్సార్ నుంచి యూఏ సర్టిఫికెట్ వచ్చింది. ఈ ఉత్సాహంలో ఈ నెల 30 న థియేటర్లలో ''పరిగెత్తు పరిగెత్తు'' మూవీని విడుదల చేయబోతున్నాం. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో అద్భుతమైన కథ, కథనంతో ఈ చిత్రం రూపొందింది. ప్రేక్షకులకు నచ్చే అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉన్నాయి’అని అన్నారు. -
ప్రతి అమ్మాయి జీవితకథ
నలుగురు ఆడవాళ్ల జీవితంలోకి మగవాళ్లు ఎంటర్ అయిన తర్వాత వాళ్ల జీవితం ఏ విధంగా మారిపోయింది అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘కమిట్మెంట్’. తేజస్వి మడివాడ, అన్వేషి జైన్, రమ్య పసుపులేటి, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘హైదరాబాద్ నవాబ్స్’ ఫేమ్ లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వం వహించారు. రచన మీడియా వర్క్స్ సమర్పణలో బల్దేవ్ సింగ్, నీలిమా .టి నిర్మిస్తున్నారు. బుధవారం ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘ఆడపిల్లలు కనపడితే కమిట్మెంటులు, కాంప్రమైజ్‌లు తప్ప ఇంకేమీ ఆలోచించరా’’ అంటూ తేజస్వి చెప్పే డైలాగ్‌తో టీజర్ సాగుతుంది. ఈ సందర్భంగా తేజస్వి మాట్లాడుతూ– ‘‘ప్రతి యాక్టర్ కెరీర్లో ఓ క్లిష్ట దశ ఉంటుంది. నేను కూడా అలాంటి స్టేజ్‌లో ఉన్నప్పుడు ఈ అవకాశం నా దగ్గరకు వచ్చింది. మళ్లీ నాకు సినిమాలపై ఇంట్రస్ట్ రావటానికి కారణం డైరెక్టర్ లక్ష్మీకాంత్గారే. ఇది కేవలం స్క్రిప్ట్ మాత్రమే కాదు, ప్రతి అమ్మాయి జీవితకథ’’ అన్నారు. అన్వేషి జైన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో తెలుగు నటీనటులతో కలిసి పనిచేయటం మంచి ఎక్స్పీరియన్స్. అన్ని అంశాలు కలగలిపి ఈ సినిమా ఒక రోలర్ కోస్టర్ రైడ్‌లా ఉంటుంది’’ అన్నారు. లక్ష్మీకాంత్ మాట్లాడుతూ– ‘‘అన్ని ఇండస్ట్రీల్లో అమ్మాయిలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కిన్ షో చేసి అమ్ముకోవాలని ఈ సినిమా చేయలేదు. కథను బలంగా నమ్మి తీసిన చిత్రమిది’’ అన్నారు. ‘‘అనిల్‌గారితో కలిసి ఈ సినిమా నిర్మించాను. దర్శకుడు చక్కగా తెరకెక్కించటంతో పాటు ప్రతి ఒక్కరూ బాగా నటించారు’’ అన్నారు నిర్మాత బల్దేవ్ సింగ్. ఈ చిత్రానికి సంగీతం: నరేష్ కుమరన్. -
మ్యాన్.. మ్యాడ్.. మనీ
సూర్య శ్రీనివాస్, అమృతా ఆచార్య హీరోహీరోయిన్లుగా రామకృష్ణ తోట స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఎం 3’. ‘మ్యాన్ మ్యాడ్ మనీ’ అనేది ఉపశీర్షిక. దర్శక–నిర్మాత రామకృష్ణ తోట మాట్లాడుతూ– ‘‘కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మా ‘ఎం 3’ చిత్రం కూడా ఆ కోవలోకే వస్తుంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. స్క్రీన్‌ప్లే ఉత్కంఠగా ఉంటుంది. సూర్య, అమృత బాగా నటించారు. సునీల్ కశ్యప్ మంచి సంగీతం అందించారు. ప్రేక్షకులకు నచ్చే అన్ని కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో ఉంటాయి’’ అన్నారు. ఈ సినిమాకు శరత్ కొండూరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. -
భయపెట్టే టార్చిలైట్
సూర్య శ్రీనివాస్ హీరోగా, ఆశ్లేష, ప్రియాంక హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘టార్చిలైట్’. వరప్రసాద్ దర్శకత్వంలో చంద్రకళ సమర్పణలో మాస్టర్ ఆర్. మనోజ్ సాయి శ్రీరామ్, మాస్టర్ ఆర్. శ్రీరామ్ అజయ్, సాయిలక్ష్మి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. డీవీ, సురేశ్ కొండేటి కెమెరా స్విచ్చాన్ చేయగా, ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా క్లాప్ ఇచ్చారు. దర్శక–నిర్మాత సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. వరప్రసాద్ మాట్లాడుతూ– ‘‘హారర్ నేపథ్యంలో సాగే చిత్రమిది. మెయిన్ విలన్‌గా రవిబాబు కనిపిస్తారు’’ అన్నారు. ‘‘మంచి సినిమాలో మేమూ భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు హీరో, హీరోయిన్లు. సంగీత దర్శకుడు దేవేంద్ర పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: మంగునూరు ఆంజనేయులు, ముద్దం రామచంద్రుడు, వాణీ చౌదరి. -
ప్రేమ.. వినోదం
కృష్ణచైతన్య, రాజేష్ రాథోడ్, సూర్య శ్రీనివాస్, మోనికా సింగ్, షాలు చారసియా ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓ పిల్లా నీ వల్లా’. బిగ్ విగ్ మూవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కిషోర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. కిషోర్ మాట్లాడుతూ– ‘‘లవ్, కామెడీ, యాక్షన్ కథాంశంగా తెరకెక్కిన చిత్రమిది. విభిన్నమైన ప్రేమకథ. యువతరంతో పాటు అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే వినోదం, వాణిజ్య అంశాలు మా సినిమాలో ఉన్నాయి. నటీనటులు, టెక్నీషియనన్స్ సపోర్ట్‌తో సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేశాం. తెలుగు ప్రేక్షకులకు మా చిత్రం నచ్చుతుందనే నమ్మకం ఉంది. మధు పొన్నాస్ సంగీతం, షోయబ్ అహ్మద్ సినిమాటోగ్రఫీ సినిమాను మరో ఎత్తుకి తీసుకెళ్తాయి. అతి త్వరలోనే పాటలు, చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు.