
సూర్య శ్రీనివాస్ హీరోగా, ఆశ్లేష, ప్రియాంక హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘టార్చిలైట్’. వరప్రసాద్ దర్శకత్వంలో చంద్రకళ సమర్పణలో మాస్టర్ ఆర్. మనోజ్ సాయి శ్రీరామ్, మాస్టర్ ఆర్. శ్రీరామ్ అజయ్, సాయిలక్ష్మి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. డీవీ, సురేశ్ కొండేటి కెమెరా స్విచ్చాన్ చేయగా, ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా క్లాప్ ఇచ్చారు.
దర్శక–నిర్మాత సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. వరప్రసాద్ మాట్లాడుతూ– ‘‘హారర్ నేపథ్యంలో సాగే చిత్రమిది. మెయిన్ విలన్‌గా రవిబాబు కనిపిస్తారు’’ అన్నారు. ‘‘మంచి సినిమాలో మేమూ భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు హీరో, హీరోయిన్లు. సంగీత దర్శకుడు దేవేంద్ర పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: మంగునూరు ఆంజనేయులు, ముద్దం రామచంద్రుడు, వాణీ చౌదరి.
Comments
Please login to add a commentAdd a comment