torch light
-
మొబైల్ ఫోన్ టార్చ్‌లైట్ వెలుగులో సిజేరియన్: తల్లీ బిడ్డ మృతి
వైద్యుల నిర్లక్ష్యం తల్లీబిడ్డలను బలితీసుకుంది. పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం గర్బిణికి చీకట్లో కేవలం మొబైల్ టార్చ్ సాయంతో సిజేరియన్ చేయడంతో ఇద్దరూ చనిపోయిన ఘటన కలకలం రేపింది. దిగ్భ్రాంతికర ఘటన మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రిలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే ఖుస్రుద్దీన్ అన్సారీ దివ్యాంగుడు. అతని భార్య షాహిదున్‌కి ఏప్రిల్ 29 సోమవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు సుష్మా స్వరాజ్ మెటర్నిటీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. సాధారణ కాన్పు అవుతుందని చెప్పిన వైద్యులు చివరికి సిజేరియన్ చేయాలంటూ కుటుంబ సభ్యుల అనుమతి తీసుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయినా జనరేటర్ ఆన్ చేయకుండా మొబైల్ ఫోన్ టార్చ్ వెలుగులోనే సిజేరియన్ చేశారు. దీంతో ఏంజరిగిందో తెలియదు గానీ మొదట శిశువు, ఆ తరువాత తల్లి ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. నిర్లక్ష్యంతోనే తల్లీబిడ్డలను పొట్టనబెట్టుకున్నారని కన్నీరు మున్నీరయ్యారు. రెండు రోజుల పాటు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేయడంతో ఎట్టకేలకే దిగి వచ్చిన బీఎంసీ విచారణకు ఆదేశించింది.తన భార్య ఆరోగ్యంగా ఉందనీ,ఎలాంటి సమస్యలు లేవని, మూడు గంటలైనా జనరేటర్ ఆన్ చేయలేదని, సరైన సమయంలో చికిత్స చేయకుండా అన్యాయంగా తల్లీ బిడ్డల్ని పొట్టన బెట్టుకున్నారని బాధితురాలి భర్త అన్సారీ ఆరోపించాడు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. అంతేకాదు తన భార్య మరణం తరువాత కూడా వైద్యులు చీకటిలో మరో ప్రసవం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను విడుదల చేశారు. కాగా అన్సారీ షాహిదున్‌కు పెళ్లయి ఇంకా ఏడాది కుండా నిండకుండానే తీరని విషాదం చోటు చేసుకుంది. సాధారణ ప్రసవం అవుతుందని చెప్పి ఆరోగ్యంగా ఉన్న తన కోడల్ని చీకట్లోనే ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లి ఫోన్ టార్చ్ సహాయంతో డెలివరీ చేశారని అన్సారీ తల్లి వాపోయింది. బిడ్డ చనిపోయిందని తాము కేకలు వేస్తే.. తల్లి క్షేమంగానే ఉందని, వేరే ఆసుపత్రిలో తీసుకెళ్లిమని చెప్పారు. కానీ అప్పటికే ఆమె చని పోయిందనీ కనీసం ఆక్సిజన్ కూడా అందుబాటులో లేదంటూ ఆమె కనీటి పర్యంతమైంది. -
ఉదయాన్నే జాగింగ్, రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా.. ఈ గ్యాడ్జెట్ మీకోసమే!
టార్చిలైట్ చేత్తో పట్టుకుంటే గాని, చీకట్లో ముందుకు అడుగేయడం కష్టం. గనుల్లో పనిచేసేవాళ్లు నెత్తికి ధరించే హెల్మెట్‌కు టార్చ్‌లైట్ పెట్టుకుంటారు. చేతికి పనిలేకుండా నడుముకు బెల్టులా చుట్టేసుకునే టార్చిని చైనాకు చెందిన బహుళజాతి కంపెనీ ‘నైట్‌కోర్’ ఇటీవల ‘నైట్‌కోర్ యూటీ05’ పేరిట అందుబాటులోకి తెచ్చింది. యూఎస్బీ పోర్ట్ ద్వారా దీనిని తేలికగా చార్జింగ్ చేసుకోవచ్చు. దీని బరువు కూడా చాలా తక్కువ– కేవలం 39 గ్రాములే! నడుము బెల్టులాగ ధరిస్తే, ఏమాత్రం అసౌకర్యంగా ఉండదు. అవసరమైనప్పుడు స్విచాన్ చేసుకుంటే, దీని ముందువైపు ఉండే రెండు ఎల్ఈడీ లైట్ల నుంచి వెలుతురు వస్తుంది. చుట్టూ 160 డిగ్రీల పరిధిలో వెలుతురు వ్యాపించడంతో పొద్దునే జాగింగ్, రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్లకు ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. కరెంటులేని చోట్ల నడుస్తూ ముందుకు సాగడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. దీని ధర 63.85 డాలర్లు (రూ.5,105). దీనిని కొనుగోలు చేస్తే, దీనికి తగిలించుకోవడానికి వీలయ్యే కీచైన్ ఉచితంగా లభిస్తుంది. చదవండి: వారెవ్వా, సూపర్ ట్రాక్టర్.. డ్రైవర్ లేకపోయినా పని చేస్తుంది! -
కమల్ హాసన్‌కు నిరాశ.. టార్చ్‌లైట్ పోయే..
సాక్షి, చెన్నై: మక్కల్ నీది మయ్యంకు టార్చ్‌లైట్ చిహ్నం దూరమైంది. ఆ చిహ్నాని ఎంజీఆర్ మక్కల్ కట్చికి దక్కింది. తమ చిహ్నం దూరం కావడంతో కమల్ హాసన్‌కు నిరాశ తప్పలేదు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్‌కు ప్రెషర్ కుక్కర్ చిక్కడంతో ఆ పార్టీ వర్గాలు సంబరాల్లో మునిగారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందుగా కమలహాసన్ మక్కల్ నీదిమయ్యం పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో కొంత మేరకు ఓటు బ్యాంక్‌ను దక్కించుకున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు నినాదంతో ప్రచార ప్రయాణాన్ని సైతం మదురై నుంచి మొదలెట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమకు కేటాయించిన టార్చ్‌లైట్ ను పార్టీ చిహ్నంగా మార్చేసుకుని ప్రచార పయనంలో దూసుకెళ్తున్న కమల్‌కు నిరాశ తప్పలేదు. ఎన్నికల కమిషన్ ఆ టార్చ్‌లైట్ చిహ్నంను కమల్‌కు దూరం చేసింది. ఈ చిహ్నంను ఎంజీఆర్ మక్కల్ కట్చికి తాజాగా అప్పగించడంతో కమల్ వర్గానికి షాక్ తప్పలేదు. పుదుచ్చేరిలో మాత్రం మక్కల్ నీది మయ్యంకు టార్చ్‌లైట్‌ను చిహ్నంగా కేటాయించడం కాస్త ఊరట. అన్నాడీఎంకేను చీల్చి అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంతో రాజకీయ పయనం సాగిస్తున్న శశికళ ప్రతినిధి దినకరన్ పంతం నెగ్గించుకున్నారు. దక్కిన ప్రెషర్ కుక్కర్.... అమ్మ మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో ఆర్కేనగర్ నుంచి దినకరన్ ప్రెషర్ కుక్కర్ చిహ్నంపై పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీకి వెళ్లారు. లోక్‌సభ ఎన్నికల్లో ఈ చిహ్నం కోసం పోరాటం చేసి కష్టాలు కొని తెచ్చుకున్నారు. ఈసారి ముందుగానే మేల్కొన్న దినకరన్ ప్రెషర్ కుక్కర్ కోసం పట్టు బట్టి సొంతం చేసుకున్నారు. తమ పార్టీ చిహ్నం తమకు దక్కడంతో ఆ పార్టీ వర్గాలు మంగళవారం సంబరాల్లో మునిగారు. బాణసంచాను హోరెత్తించారు. నటుడు సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చికి మళ్లీ రైతు చిహ్నం దక్కింది. చదవండి: ('అధికారంలోకి వస్తే మధురై రెండో రాజధాని') టార్చ్ పోయినా..లైట్ హౌస్లా ఉంటాం.. ఎన్నికల ప్రచారంలో ఉన్న కమల్ బృందం తమ వాహనాల్లో ఉన్న టార్చ్‌లైట్ చిహ్నాల్ని తొలగించారు. ఇంకా తమకు ఎన్నికల కమిషన్ చిహ్నం కేటాయించని దృష్ట్యా, టార్చ్‌లైట్ దక్కించుకునేందుకు న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నారు. టార్చ్‌లైట్ దూరం విషయంగా తేనిలో ఎన్నికల ప్రచారంలో ఉన్న కమల్‌ను ప్రశ్నించగా, టార్చ్‌లైట్ దూరమైనా లైట్‌హౌస్ వలే ప్రజలకు వెలుగు నిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దోపిడీదారులు నోట్లను చల్లి ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చిహ్నం విషయంగా తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. రజనీ పార్టీ సిద్ధాంతాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సి ఉందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రజలకు మంచి చేయాలన్న కాంక్షతో, అందుకు తగ్గ సిద్ధాంతాలతో వస్తే, ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధమేనని, ఇప్పటికే ఈ విషయాన్ని తాను స్పష్టం చేసినట్టు పేర్కొన్నారు. తామిద్దరి మధ్య ఒక్క ఫోన్‌కాల్ చాలు అని, ప్రజల సంక్షేమం, మార్పు, మంచి కోసం ఇగోను పక్కన పెట్టి కలిసి పనిచేయడానికి సిద్ధమేనని స్పష్టం చేశారు. -
టార్చ్‌లైట్ సినిమాలాగే మహిళను ఎరగా వేసి..
నెల్లూరు(క్రైమ్): జాతీయ రహదారిపై అర్ధరాత్రి వేళ మహిళను ఎరవేసి అటుగా రాకపోకలు సాగించే వాహనదారులను దోచేస్తున్న ముఠా గుట్టును నెల్లూరులోని వేదాయపాళెం పోలీసులు రట్టు చేశారు. ముఠాలోని మహిళతోపాటు ప్రధాన నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వేదాయపాళెం పోలీసు స్టేషన్లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ వివరాలను వెల్లడించారు. నెల్లూరు రూరల్ మండలం ఆమంచర్ల గ్రామానికి చెందిన మల్లి శ్రీనివాసులు అలియాస్ శ్రీను, అయ్యప్పగుడి టీచర్స్ కాలనీకి చెందిన వి.బాలవర్దన్ అలియాస్ బాలు అలియాస్ బాలాజీలు ఆటోడ్రైవర్లు. వీరు రాత్రి వేళల్లో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆటో నడుపుతుండేవారు. రామ్‌నగర్‌కు చెందిన ఎం.అనిల్ రాత్రివేళల్లో నగరంలో తిరుగుతుండేవాడు. ఈక్రమంలో అతనికి శ్రీను, బాలవర్దన్‌లతో పరిచయమైంది. అనిల్ ద్వారా సంతపేటకు చెందిన రమాదేవి అలియాస్ రమ వారికి పరిచయమైంది. చెడువ్యసనాలకు అలవాటుపడిన వారికి ఆటో ద్వారా వచ్చే ఆదాయం సరిపోయేది కాదు. దీంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. రమాను ఎరగా వేసి జాతీయ రహదారిపై వాహనచోదకులను దోచేయాలని పథకం పన్నారు. మాటు వేసి.. జాతీయ రహదారిపై నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాన్ని అడ్డాగా చేసుకున్నారు. రాత్రి వేళల్లో నలుగురు కలిసి హైవేపైకి చేరుకుని రమాను నిలబెట్టేవారు. మిగిలిన వారు ఆటోలో చీకట్లో నక్కి ఉండేవారు. ఆమెను చూసి ఆకర్షితులైన లారీడ్రైవర్లు, ప్రయాణికులు వాహనాలు దూరంగా ఆపి దగ్గరికి వచ్చేవారు. ఆమె వారిని మాటల్లో దించి చెట్టు పొదల్లోకి తీసుకెళ్లేది. అప్పటికే అక్కడ మాటేసి ఉన్న శ్రీనివాసులు, బాలవర్దన్, అనిల్‌లు లారీడ్రైవర్, ప్రయాణికులపై దాడిచేసి నగదు, ఒంటిపై ఉన్న ఆభరణాలు దోచుకుని ఆటోలో పరారయ్యేవారు. దూర ప్రాంతాలకు చెందిన డ్రైవర్లు, ప్రయాణికులు ఈ విషయం బయటపడితే తమ పరువుపోతుందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేయకుండా వెళ్లేవారు. దీంతో పోలీసుల దృష్టి ముఠాపై పడకపోవడంతో జాతీయ రహదారిపై వారు కొంతకాలంగా అనేకమంది దోపిడీ చేశారు. సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ మురళీకృష్ణ, చిత్రంలో సీఐ, ఎస్సై వెలుగులోకి ఇలా.. ఎప్పటిలాగే ముఠా సభ్యులు ఈనెల 7వ తేదీ తెల్లవారుజామున సుందరయ్యకాలనీ ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో మాటేశారు. రమ రోడ్‌పై టార్చ్‌లైట్ పెట్టుకుని వాహనచోదకులను ఆకట్టుకునే పనిలో ఉంది. తెల్లవారుజామున మూడుగంటల ప్రాంతంలో కృష్ణపట్నం పోర్టు నుంచి జగయ్యపేటకు వెళుతున్న బొగ్గులోడు లారీ ఆ ప్రాంతానికి చేరుకుంది. రమాను చూసి ఆకర్షితుడైన డ్రైవర్ లారీ నుంచి కిందకుదిగి ఆమెతో మాట్లాడాడు. అనంతరం రమ సదరు లారీ డ్రైవర్‌ను సమీపంలోని ఖాళీ స్థలాలవైపు తీసుకెళ్లి మాట్లాడుతుండగా శ్రీనివాసులు, బాలవర్దన్, అనిల్‌లు అతనిపై దాడిచేశారు. రూ.5 వేల నగదు, వెండి బ్రాస్లెట్, ఉంగరం దోచుకుని అక్కడినుంచి అందరూ కలిసి ఆటోలో పరారయ్యారు. బాధిత డ్రైవర్ వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ కె.నరసింహారావు సంఘటనపై కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున ఇన్స్పెక్టర్కు ఓ మహిళ, ముగ్గురు వ్యక్తులు ఆటోలో సుందరయ్యకాలనీ సమీప జాతీయ రహదారిపై అనుమానాస్పదంగా ఉన్నారని సమాచారం అందింది. దీంతో ఆయన తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసు స్టేషన్‌కు తరలించి వారిని విచారించగా లారీ డ్రైవర్‌పై దాడిచేసి నగదు దోచుకెళ్లామని అంగీకరించారు. దీంతో వారిని అరెస్ట్ చేసి దోపిడీ సొత్తుతోపాటు నేరాలకు ఉపయోగించిన ఆటోను స్వా«ధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. జాతీయ రహదారిపై ఇలాంటి మోసాలు అధికంగా జరిగే అవకాశం ఉందని వాహనచోదకులు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు. సమావేశంలో వేదాయపాళెం ఇన్స్పెక్టర్ కె.నరసింహారావు, ఎస్సై పుల్లారెడ్డి, ఏఎస్సై ప్రసాద్, హెడ్‌కానిస్టేబుల్స్ సుధా, గోపాల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సమాధి దొంగలు
అర్ధరాత్రి వర్షం కుండపోతగా కురుస్తోంది.నగరంలోని ఓ సిమెట్రీ అది. రెయిన్ కోట్స్, గమ్ బూట్సూ ధరించిన నలుగురు దృఢకాయులు అందులోకి ప్రవేశించారు. ఒకడి చేతిలో ఓ పొడవాటి పెట్టె ఉంది. ఇంకొకడి దగ్గర బరువైన గోనెసంచి ఉంది. టార్చ్ లైట్ వెలుతురులో ఒక్కొక్క సమాధినే చూసుకుంటూ ముందుకు నడిచారు వాళ్లు. చివరికి ఓ సమాధి వద్ద ఆగారు. గోనెసంచిలోంచి పార, పలుగు, గునపం, వగైరా పనిముట్లను బయటకు తీశారు. ఒకడు టార్చ్ లైట్ వెలుతురును ఫోకస్ చేస్తూంటే, మిగతా ముగ్గురూ ఆ సమాధిని తవ్వడానికి ఉపక్రమించారు. శవపేటిక కనిపించగానే, ఇద్దరు వ్యక్తులు తాళ్ల సాయంతో గోతిలోకి దిగి తాళ్లను దానికి కట్టారు. నలుగురూ కలసి పేటికను పైకి తీశారు. సుత్తితో కొట్టి శవపేటికను తెరిచారు. లోపల ఫ్రెష్‌గా ఉన్న మృతదేహం కనిపించింది. వర్షానికి తడిసిపోకుండా శవాన్ని వాటర్ ప్రూఫ్ క్లాత్ తో కప్పి, తమతో తీసుకువచ్చిన పెట్టెలో ఉంచి క్లోజ్ చేసేశారు. సమాధిని పూర్తిగా పూడ్చకుండానే వదిలేసి, పనిముట్లను గోనెసంచిలో సర్దేసుకుని, డెడ్ బాడీ ఉన్న పెట్టెను మోసుకుంటూ సిమెట్రీ బయటకు నడిచారు. వీధిలో కొద్ది దూరంలో చిన్నసైజు ఆంబులెన్స్ ఒకటి ఆగి ఉంది. ఆ శవపేటికను అందులోకి ఎక్కించారు. దానితోపాటు ముగ్గురు వ్యక్తులు ఎక్కితే, టార్చ్ లైట్ చూపిస్తూన్న నాలుగవ వ్యక్తి వెళ్ళి డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తూన్న ఆ వర్షాన్ని చీల్చుకుంటూ ముందుకు పరుగెత్తింది ఆంబులెన్స్. గత కొన్ని నెలలుగా నగరంలోని సమాధుల నుండి శవాలు అదృశ్యమవుతున్నాయి. ప్రజలలో అలజడి రేపింది అది.బతికున్నవారిని కిడ్నాప్ చేసి డబ్బులు గుంజడం కద్దు. కానీ, శవాలను ఏం చేసుకుంటారో!... అంతుపట్టలేదు క్రై మ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శివరామ్‌కి. కుల మతాల వివక్ష లేకుండా దొంగలు అందరి సమాధులనూ టార్గెట్ చేయడం విశేషం! రాత్రి పదకొండు గంటలు అవుతుంది. సెల్‌ఫోన్ మోగడంతో పక్క మీద తలగడ పక్కనున్న ఫోన్‌ని అందుకుని స్క్రీన్ వంక చూశాడు బాలరాజు. అది ‘అన్న’ కాల్!‘‘ఏరా, రాజూ! పనిని గాలికి వదిలేసి పెళ్లాం పక్కలో వెచ్చగా తొంగున్నావట్రా?’’ అవతలి గొంతుక కర్కశంగా వినిపించడంతో గతుక్కుమన్నాడు బాలరాజు. ‘‘ఆఖరు బాడీని తెచ్చి అప్పుడే రెండు వారాలు దాటింది. ఏం చేస్తున్నావ్?’’ మళ్లీ కోపంగా అడిగాడు ‘అన్న’.‘‘లేదన్నా. ఆ పని మీదే ఉన్నాను. ఈ మధ్య సిమెట్రీల దగ్గర, శ్మశానాల దగ్గరా పోలీసుల నిఘా అధికంగా ఉంది. అందుకే కొద్ది రోజులు గ్యాప్ ఇద్దామని’’ నసిగాడు బాలరాజు.‘‘నెలకు కనీసం మూడు శవాలనయినా సప్లయ్ చేయాలన్నది మన కాంట్రాక్ట్. ఆర్నెల్లలో డజనుకు మించి సరఫరా చేయలేకపోయాం. మన మీద నమ్మకం సన్నగిల్లితే వాళ్లు మరో సోర్స్‌ని వెదుక్కునేప్రమాదం ఉంది.’’‘‘లేదన్నా. అలా జరగనివ్వను’’ హామీ ఇచ్చాడు బాలరాజు. ఓ క్షణం ఆగి, అన్నాడు ‘అన్న’ – ‘‘రెండు రోజుల్లో బాడీ ఏదీ దొరక్కపోతే నీ మనుషుల్లో ఒకణ్ణి చంపి అయినా, వాడి బాడీని తీసుకురా’’.బాలరాజు చిన్నగా ఉలికిపడ్డాడు. ‘‘అదేంటన్నా, అంత మాట అనేశావ్?’’ అవతల చిన్నగా నవ్వు వినిపించింది. ‘‘శవానికి లక్ష ఇస్తున్నాను. ఆ మాత్రం అథారిటీ ఉంటుందిలే నాకు!’’ ఫోన్ కట్‌అయింది. బాలరాజుకు ముప్పయ్ అయిదేళ్ళు ఉంటాయి. మనిషి ఎత్తుగా, దృఢంగా ఉంటాడు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆంబులెన్స్ డ్రైవరుగా పనిచేసేవాడు. వచ్చే జీతం కుటుంబ పోషణకు సరిపోక ప్రతినెలా అప్పులు చేయవలసి వచ్చేది. అయితే, కొన్ని నెలల క్రితం అనుకోకుండా ‘అన్న’ తో పరిచయమయింది అతనికి. అది అతని జీవితాన్ని అనుకోని మలుపు తిప్పింది.కొందరు ‘పార్టీలకు’ శవాలనుసప్లయ్ చేసే సీక్రెట్ కాంట్రాక్ట్‌ని కుదుర్చుకున్నాడు ‘అన్న’. ఆ దందాలోకి బాలరాజును కూడా లాగి, ఆ వ్యవహారానికి ఇన్చార్జ్ని చేశాడు. ‘అన్న’ ది క్రిమినల్ మైండ్. పథకం అతనిదీ,ఆచరణబాలరాజుదీను. ‘అన్న’ సలహా మేరకు ఓ మినీ వ్యాన్ని వాయిదాల పద్ధతిలో తీసుకుని, దాన్ని ఆంబులెన్స్ గా మార్చుకున్నాడు బాలరాజు. పైకి అది ప్రైవేట్ ఆంబులెన్స్. లోపాయకారీగామాత్రం దొంగిలించిన శవాలకు రవాణా వాహనం! ఆ ‘ఆపరేషన్’లో పాలు పంచుకునే వ్యక్తులకు బాలరాజు తప్ప, ‘అన్న’ ఎవరో, ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో తెలియదు. సమాధి దొంగలను ఎలాగైనా పట్టుకుని తీరాలని కంకణం కట్టుకున్నాడు ఇన్స్పెక్టర్ శివరామ్. ఆ కేసు పూర్వాపరాలను నిశితంగా సమీక్షించాడు. శవాలు ఏయే ప్రాంతాల నుండి అదృశ్యమయ్యాయో, ఆ ప్రాంతాలకు మరోసారి వెళ్లి క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాడు– తాము మిస్ చేసిన ‘క్లూస్’ ఏవైనా లభిస్తాయేమోనని. దొంగల ‘మోడస్ ఆపరెండీ’ని అధ్యయనం చేసి, అది ఒకే ముఠా పనేనని నిర్ధారించుకున్నాడు. ఆ ముఠా రాష్ట్రానికి చెందినదా, లేక ఇతర రాష్ట్రాలకు చెందినదా అన్నది మాత్రం తెలియలేదు. నగరంలోని పలు ప్రాంతాలలో అతను చేసిన దర్యాప్తులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఒకవేళ ఏ శవపేటికలోనయినా విలువైన వస్తువులో, బంగారమో దొరికితే దొంగలు వాటిని అమ్మడానికి ప్రయత్నిస్తారు. అందుకే మార్వాడీ షాపులను, పాన్ షాపులను, ఇతర సోర్సెస్నీ అలర్ట్ చేసాడు. క్రిస్టియన్ సిమెట్రీస్, ముస్లిమ్ ఖబరస్తాన్లు, హిందూ శ్మశాన వాటికల వద్ద రాత్రులు ప్రత్యేకంగా పోలీసులను మఫ్టీలో ఏర్పాటు చేశాడు శివరామ్. అయితే, శ్మశాన వాతావరణానికి జడుసుకున్న ఒక కానిస్టేబుల్ జ్వరం తెచ్చుకున్నాడు. మరోచోట కానిస్టేబుల్‌కి ‘దయ్యాలు’ కనిపించాయి! భయంతో మంచం పట్టేశాడు. దాంతో ఎవరూ శ్మశాన డ్యూటీకి ముందుకు రావడం లేదు. నైట్ పెట్రోలింగును ఉధృతం చేయడంతోనే సంతృప్తి చెందవలసి వచ్చింది శివరామ్‌కి. ఆ నెల రోజుల్లో మరో మూడు సమాధుల నుంచి శవాలు మాయమయ్యాయి. దాంతో నగర ప్రజలలో అసహనం, ఆగ్రహం పెరిగిపోయాయి. పోలీసుల అసమర్థతను తిట్టిపోశారు. ఇన్స్పెక్టర్ శివరామ్‌కి పై అధికారుల ఒత్తిడి అధికమయింది. అదే సమయంలో సిల్వర్ లైనింగులా అనిపించింది – ఓ రోజున ఓ దినపత్రికలో వచ్చిన ఆర్టికల్ ఒకటి. అది మెడికల్ కాలేజెస్లోని ఎనాటమీ క్లాసుల గురించినది. దాన్ని కుతూహలంతో చదివాడు శివరామ్. దాని సారాంశం ఇది– ‘మెడికల్ కాలేజీల్లో ఎనాటమీ క్లాసులలో విద్యార్థుల చేత డిసెక్షన్ చేయించడానికి సరిపడినన్ని మృతదేహాలు సరఫరా కావడంలేదు.ప్రభుత్వాసుపత్రుల మార్చురీలలోని అన్–క్లెయిమ్డ్ బాడీస్‌ని సాధారణంగా మెడికల్ కాలేజీలకు తరలించడం జరుగుతుంది. వాటిని అనాథ శవాలుగా నిర్ణయించేందుకు న్యాయస్థానాలు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించి డిక్లేర్ చేసేసరికి జాప్యం జరగడమేకాక, శవాలు చెడిపోవడం కూడా కద్దు. పైగా, ప్రైవేట్ మెడికల్ కాలేజీల సంఖ్య గణనీయంగా పెరిగిపోతూండటంతో అందుబాటులో ఉన్న మృతదేహాలు సరిపోవడంలేదు. అందువల్ల ఎనాటమీ క్లాసులను ప్రాక్టికల్స్ లేకుండా థియరీతోనే సరిపెట్టడం జరుగుతోంది. దాన్ని మెడికల్ కౌన్సిల్ తీవ్రంగా పరిగణిస్తోంది.’ఆ ఆర్టికిల్ చదువుతూంటే ఇన్స్పెక్టర్ బుర్రలో కొత్త ఆలోచనలు రేగాయి. వెంటనే ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు వెళ్లాడు. ఎనాటమీ క్లాసుల వారికి అందుతూన్న శవాలను గురించి చర్చించాడు. ప్రభుత్వ కాలేజీల కంటే ప్రైవేట్ కాలేజీల పరిస్థితి మరింత అధ్వానంగా ఉన్నట్టు తెలుసుకున్నాడు. ఆయా కాలేజీలకు గత కొన్ని నెలలుగా లభ్యమైన శవాలను గూరించి ఆరా తీసాడు. ఎవరూ రికార్డులను సవ్యంగా మెయింటెయిన్ చేయడం లేదని గుర్తించాడు. అనంతరం తన మేనకోడలిని అక్కడ చేర్పించదలచుకున్నట్టు చెబుతూ, మెడికల్ స్టూడెంట్స్‌తో మాట్లాడాడు. మఫ్టీలో ఉండడంతో అతన్ని ఓ పోలీసు ఆఫీసరుగా ఎవరూ గుర్తించలేదు. గత నెల్లాళ్లలో ఏయే కాలేజీలకు ఎన్ని శవాలు వచ్చాయోనని లోపాయకారీగా విచారించితే – మూడు ప్రైవేట్ కాలేజీలకు ఒక్కో శవం చొప్పున వచ్చినట్టు తెలిసింది. సమాధుల నుండి శవాలు మాయమైన రెండు రోజులకు అవి సప్లై చేయబడ్డట్టు గ్రహించాడు.ఆ కాలేజీలలో ఒకదానికి మారువేషంలో వెళ్ళాడు శివరామ్. ఆ కాలేజీ మార్చురీ అటెండర్ని మచ్చిక చేసుకుని, తాను ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కి చెందినవాడననీ, ఎనాటమీ క్లాసులకు శవాలను సప్లై చేసే సోర్స్ కావాలనీ అడిగాడు.‘అప్పుడప్పుడు డెడ్ బాడీస్’ ఓ ఆంబులెన్స్ లో వస్తాయనీ, మిగతా వివరాలు తనకు తెలియవనీ చెప్పాడు అతను. ఆ ఆంబులెన్స్ నంబర్ ఇచ్చాడు. ఇన్స్పెక్టర్ ఆఫీసుకు తిరిగి వచ్చేసరికి, ఓ అరవయ్యేళ్ల వృద్ధుణ్ణి తెచ్చి లాకప్‌లో వేశారు అతని సిబ్బంది. బంగారు నెక్లెస్ ఒకటి ఓ పాన్ షాపులో అమ్మబోతూ పట్టుబడ్డాడట అతను. ఆ నగ తన కోడలిదనీ, కొడుకు తనకు తాగుడుకు డబ్బులు ఇవ్వడంలేదన్న కోపంతో దాన్ని అమ్మేయడానికి తెచ్చాననీ చెప్పాడు ముసలాడు. కానిస్టేబుల్స్ ని పంపించి అతని కొడుకును రప్పించాడు శివరామ్. తన పేరు గంగులు అనీ, కూలిపని చేసుకుంటాననీ చెప్పాడు వాడు. మొదట ఆ నెక్లెస్ గురించి తనకేమీ తెలియదన్నాడు. తరువాత అది తనకు ఎక్కడో దొరికిందన్నాడు. చితగ్గొట్టేసరికి, ‘ఓ ఆడమనిషి శవం మెళ్లో ఉంటే తీసుకున్నానంటూ’ నిజాలు బయటపెట్టాడు.. అతను చెప్పిన బాలరాజు ఆంబులెన్స్ నంబరూ, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మార్చురీ అటెండర్ ఇచ్చిన నంబరూ ఒకటే. బాలరాజు ఇంటికి వెళ్ళాడు శివరాం. అతను నాలుగు రోజులుగా ఊళ్లో లేడు. మరదలి పెళ్లికి వెళ్లాడనీ, మర్నాడు వస్తాడనీ తెలిసింది. అతని గురించి విచారిస్తే... ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తూ ఆర్థికంగా కష్టపడుతూన్న బాలరాజు, కొద్ది నెలలలోనే జల్సా జీవితం గడుపుతున్నాడని తెలిసింది. మర్నాటి ఉదయం బాలరాజును నాంపల్లి రైల్వే స్టేషన్లోనే పికప్ చేసుకున్నాడు శివరామ్.ఎవరెవరో తన ఆంబులెన్సుని వాడుకుంటారనీ, శవాల సంగతి తనకు తెలియదనీ బుకాయించబోయాడు బాలరాజు. గంగులు తమ అధీనంలో ఉన్నాడనే సరికి గతుక్కుమన్నాడు. మాట మార్చి, ‘తానుఅన్న కోసం ఆంబులెన్స్‌ను నడుపుతాడనీ, అతను అనాథ శవాలను కొని మెడికల్ కాలేజీలకు సప్లయ్ చేస్తాడనీ’ చెప్పాడు. అయితే, పోలీస్ ట్రీట్మెంట్ రుచి చూశాక, నిజం కక్కక తప్పలేదు. నేరమంతా ‘అన్న’ మీదకు నెట్టే ప్రయత్నం చేస్తూ, ‘అన్న’ పేరు గురవారెడ్డి అనీ, అతనికి తెలియకుండా తాను తన సెల్లో రికార్డ్ చేసిన తమ సంభాషణలను ప్లే చేసి వినిపించాడు. బాలరాజును తీసుకుని గురవారెడ్డి ఇంటికి వెళ్ళాడు శివరామ్. అతను ఇంట్లో లేడు. ‘గత దినం గురవారెడ్డి తల్లి డెత్ యానివర్సరీ అనీ, కార్యక్రమం ముగిసే సరికి సాయంత్రం అయిపోయిందనీ, ఆ తరువాత తల్లి సమాధిని దర్శించేందుకు అతను శ్మశానానికి వెళ్ళాడనీ’ చెప్పింది అతని భార్య. తద్దినం రోజున ఆవిడ సమాధి వద్దకు వెళ్ళి గంటల కొద్దీ గడిపి వస్తాడంది. తెల్లవారినా రాకపోయే సరికి ఫోన్ చేశామనీ, స్విచాఫ్ చేసి ఉందనీ చెప్పింది. అంతలో బాలరాజు సెల్ మ్రోగింది. శివరామ్ సైగనందుకుని స్పీకర్ ఆన్ చేశాడు అతను. ‘‘బాలరాజన్నా! ఊరి నుంచి వచ్చావా? మేము మార్చురీలో ఉన్నాం, వస్తావా?’’ అన్నాడు అవతలి వ్యక్తి. అది ‘అన్న’ ప్రైవేట్ మార్చురీ అని చెప్పాడు బాలరాజు. కానిస్టేబుల్స్‌ని గురవారెడ్డి ఇంటి దగ్గర కాపలా ఉంచి, బాలరాజుతో మార్చురీకి వెళ్లాడు శివరామ్. అక్కడ శవాన్ని చూసి బాలరాజు బిగుసుకుపోయాడు. శివరామ్ మఫ్టీలో ఉన్నందున, అతన్ని క్లెయింటుగా భావించారు అక్కడున్న వ్యక్తులు ఇద్దరూ. ‘‘పెద్దన్న చెప్పాడని, నువ్వు వచ్చేసరికి ఓ శవాన్ని తెచ్చి ఉంచమన్నావుకదా? ఇదిగో!’’ అన్నాడు ఫోన్ చేసిన వ్యక్తి, బాలరాజుతో. ’’గంగులు గాడు ఎటు పోయాడో తెలీలేదు. మీరిద్దరూ లేకుండా సమాధి తవ్వడానికి మాకు ధైర్యం చాల్లేదన్నా! బాడీ అర్జెంటన్నావని, శ్మశానంలో తిరుగుతూన్న ఒకణ్ణి వెనుక నుంచి బుర్ర పగులగొట్టి వాడి శవాన్ని తెచ్చేశాం’’. ‘‘అన్నా! మా కష్టాన్ని గుర్తించి ఎప్పుడూ ఇచ్చేదాని కంటే ఎక్కువే ముట్టజెప్పాలి మాకు’’ అన్నాడు రెండోవాడు. శిలావిగ్రహంలా ఉండిపోయిన బాలరాజు తేరుకుని ఇన్స్పెక్టర్ వంక వెర్రిచూపులు చూశాడు. ‘‘సార్! ఇతనే ‘అన్న’ గురవారెడ్డి’’ అన్నాడు శవాన్ని చూపిస్తూ!! - తిరుమలశ్రీ -
మేడ
‘‘హలో...’’ టార్చ్ లైట్ వెలుగు సహాయంతో ముందు గదిలోకి వచ్చిన ధీరజ్ ఆ ఇంట్లో వారిని ఉద్దేశించి పిలిచాడు. జవాబుగా అవతల నుంచి ఏ పలుకూ లేదు. అలాగే ఇంకాస్త ముందుకు వెళ్లి.. ‘‘ఎవరండీ ఇంట్లో?’’ అడిగాడు. కిటికీ రెక్కలు రెండూ ధడేల్ ధడేల్ మంటూ కొట్టుకున్న చప్పుడు. వినిపించిన వైపు టార్చ్ లైట్ ఫోకస్ చేశాడు. ఆశ్చర్యపోతూ దగ్గరికి వెళ్లి పరిశీలనగా చూశాడు. గడియ పడి ఉన్నాయి. ఇందాకే కదా.. అంత గట్టిగా కొట్టుకున్నాయి.. ఆ క్షణంలోనే ఎలా గడియ పడ్డాయి? విస్మయపోతూనే తెరవడానికి ప్రయత్నించాడు. కొన్నేళ్ల నుంచీ తుప్పు పట్టినట్టున్నాయి ఆ బోల్ట్స్. ఎంత తెరిచినా రావట్లేదు. ఇంకాస్త గట్టిగా లాగితే కిటికీలే ఊడొచ్చేంత పాతగా ఉన్నాయ్. బహుశా ఆ పెద్ద చప్పుడు తన భ్రమేమో అనుకుని ఇంకాస్త ముందుకు వెళ్లాడు టార్చ్ వెలుగులోనే. ఈ సారి ఓ మూల నుంచి కిర్రుమంటూ శబ్దం వినిపించింది . అటు వైపు మళ్లాడు. యుగాల నాటి పెద్ద గుమ్మాన్ని తలపించే ద్వారం. తలుపు ఓరగా తెరిచి ఉంది. దాని దరికి రాగానే ఒక్కసారిగా గబ్బిలాల కంపు.. లోపల్నించి గబ్బిలాల రెక్కల చప్పుడు.. ఎలుకల కిచకిచలు. ఆ గదిలోకి వెళ్దామనుకొనీ వెళ్లక వెనకడుగు వేశాడు. ఆ వాసనకు, శబ్దాలకు చీదర కలిగి. టార్చ్‌ను ఆ ఫోకస్ నుంచి తిప్పబోతూ ఆగిపోయాడు. ఆ గదిలో వెలుతురు పడ్డ మేర చాలా శుభ్రంగా.. మార్బుల్ ఫ్లోర్ మెరుస్తూ కనిపించింది. రెండడుగులు లోపలికి వేసి.. గదంతా టార్చ్ లైట్ తిప్పాడు. నీట్‌గా.. సాంబ్రాణి వాసనతో ఆహ్లాదంగా ఉంది. షాక్ అయ్యాడు ధీరజ్. గదిలోంచి వెనక్కి వచ్చాడు. మళ్లీ గబ్బిలాల కంపు.. ఎలుకలు.. కిచకిచలు..ఇంకోసారి పరీక్షిద్దామని లోపలికి వెళ్లబోతుంటే పైన గదిలోంచి శబ్దం... తూగుటుయ్యాల ఊగుతున్నట్టు.. కూయి.... కూయి.. అంటూ!మేడ పైకి ఎక్కేందుకు మెట్ల కోసం చూశాడు.. ఎక్కడా కనపడలేదు. గబగబా ఆ ఇంటి వెనక్కి వెళ్లాడు చీకట్లో అదే టార్చ్ లైట్ సహాయంతో. అక్కడా మెట్లు కనపడలేదు. కుడి వైపు.. ఎడమ వైపు.. ముందు వైపు.. అలా ఇంటికి నాలుగు దిక్కులా వెదికాడు.. ఎక్కడ మెట్ల ఆనవాలు లేదు. మరి మేడ మీద గది ఉన్నట్టు.. ఉయ్యాల ఊగుతున్నట్టూ చప్పుడేంటి... తన భ్రాంతా? అని సణుక్కుంటూ మళ్లీ ఇంట్లోకి వెళ్లాడు. ఇల్లంతా టార్చ్ తిప్పాడు. గోడలన్నీ మంటల్లో పొగచూరినట్టుగా నల్లగా ఉన్నాయి. ఒక్కసారిగా హాహాకారాలు.. అరుపులు.. కేకలు.. బిందెల కొద్దీ నీళ్లు కుమ్మరిస్తున్న సౌండ్.. గాజుల గలగలలు.. గాబరాగా నడుస్తుంటే వచ్చే పాదాల పట్టీల చప్పుడు.. దిమ్మ తిరిగింది ధీరజ్‌కి.. మొహమంతా ముచ్చెమటలు... ఆ శబ్దం అంతకంతకూ ఎక్కువవుతూ.. అదంతా తన చుట్టే జరుగుతున్నట్టనిపించి ఒక్కసారిగా ఆ ఇంటి బయటకు పరిగెత్తాడు. వాకిట్లోకి రాగానే .. చెవుల్లోంచి ఎవరో ఆ గోలను తీసి అవతల పారేసినట్టు ప్రశాంతంగా అనిపించింది ధీరజ్‌కు. ఇందాకటి అలజడీ లేదు. వెనక్కి తిరిగి చూసే సాహసం చేయకుండా గేట్ తోసుకుంటూ రోడ్డు మీదకు వచ్చిపడ్డాడు.భయం భయంగానే ఆ ఇంటి వైపు చూశాడు. లైట్లతో దేదీప్యమానంగా వెలుగుతోంది కొత్త ఇల్లులా! చుట్టూ మొక్కలు.. చెట్లతో ముస్తాబై ఉంది.. ఎప్పటిలా! ధీరజ్‌కు ముప్పై ఏళ్లుంటాయి. ఇంకా పెళ్లి కాలేదు. సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నాడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా. ఆ వీధిలోకి కొత్తగా చేరాడు. ఆ కాలనీకి వచ్చినప్పుడే ఆ మేడ మీద ధీరజ్ కన్ను పడింది. అందంగా కంటే కూడా దృష్టిని ఆకర్షించే ప్రత్యేకతేదో ఉంది ఈ మేడ మీద అని అనుకునేవాడు దాన్ని చూసినప్పుడల్లా. రోజూ షూటింగ్స్ ముగించుకొని ఇంటికొచ్చే సరికి అర్ధరాత్రి అవుతుంది. వీధి మొదట్లోనే క్యాబ్ దిగి...వీధి చివర ఉన్న తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తాడు. ఆ మేడ ముందుకు రాగానే దాన్నే తిరిగి తిరిగి చూస్తూ ముందుకు సాగడం అతనికి ఇష్టం. రాత్రి పన్నెండు దాటినా ఆ ఇల్లంతా లైట్లతో వెలుగుతూంటుంది. అంత రాత్రీ మనుషుల అలికిడి ఉన్నట్టే కనిపిస్తుంది. తన ఇంటికి రెండిళ్ల ముందు ఉంటుంది ఈ మేడ. తన ఇంట్లో పనిచేసే అమ్మాయిని అడిగాడు.. ‘‘ఆ ఇల్లు ఎవరిది?’’ అని. ఏమీ అర్థం కానట్టు ‘‘ఏ ఇల్లు సార్?’’ అంది ఆమె. ‘‘అదే ఆ మూడో ఇల్లు?’’ చేతితో ఆ డైరెక్షన్‌ను చూపిస్తూ మరీ అడిగాడు. ‘‘మూడో ఇల్లా?’’ అంటూ ముక్కున వేలేసుకొని అతను చూపించిన వైపు చూసింది ఆమె.నటిస్తోందా? నిజంగానే తెలియదా? సందేహిసూ ్త ఇక ఆ ఇంటి గురించి రెట్టించలేదు.!ఆ ఉదయం.. తను పాల పాకెట్ తీసుకొని వస్తూంటే కనిపించింది పనమ్మాయి ఆ ఇంట్లోంచి బయటకు వెళ్తూ. మరి ఆ రోజు ఎందుకలా నటించింది? తను ఆ ఇంటి గురించి అడిగితే అసలు అక్కడ ఇల్లే లేనట్టు?.. అనే అనుమానం అతని మెదడులో లిప్తపాటు కదిలి మాయమైపోయింది. ఇప్పుడు.. రాత్రి.. షూటింగ్ నుంచి వస్తూ వస్తూ.. ‘‘ఎలాగైనా లోపలికి వెళ్లి.. ఆ ఇల్లు ఎలా ఉంటుందో? అంత రాత్రి పూటా లైట్లన్నిటినీ ఎందుకు వెలిగిస్తారో? అందులో ఎంత పెద్ద కుటుంబం ఉంటోందో? లాంటి జిజ్ఞాస ధీరజ్‌ను లోపలికి లాక్కెళ్లింది. ఆ ఇల్లు లోపల కూడా అంతే అందంగా ఉంటే బాగుంటే షూటింగ్‌కి ఇస్తారేమో కనుక్కోవాలి అనీ నిశ్చయించుకున్నాడు. తీరా లోపలికెళ్లాక చూస్తే.. భూత్ బంగ్లాలా బెదరగొట్టింది.. ఇంటికెలా వచ్చాడో తెలియదు. రాగానే ఫ్రిజ్ తెరిచి గటగటా మంచి నీళ్లు తాగాడు. మార్గశిర మంచులో కూడా గ్రీష్మ తాపం.. చెమటతో ఒళ్లంతా తడిసి ముద్దయిపోయింది. అలాగే సోఫాలో కూలబడ్డాడు.. తల వెనక్కి వాల్చి కళ్లు మూసుకున్నాడు.. చీకటి.. ఆ చీకట్లో ఓ మేడ.. ఇంట్లో హాహాకారాలు.. గాజుల గలగలలు.. మువ్వల సవ్వడి.. తూగుటుయ్యాల ఊగుతూ.. కిటికీ రెక్కలు కొట్టుకుంటూ.. తలుపు కిర్రున తెరుచుకుంటూ.. ముక్కు పుటాలు అదిరే గబ్బిలాల కంపు.. ఎలుకల కదలికలు.. సాంబ్రాణి వాసన..ఒక్కసారిగా తల విదిలించి.. కళ్లు తెరిచాడు.. ఎదురుగా.. పనమ్మాయి.. నవ్వుతోంది.. తెరలు తెరలుగా! ‘‘అక్కడ ఇల్లు కనిపించిందా నీకు? అంటే నువ్వు నా వాడివే అన్నమాట. ఆ రోజు కట్నం చాల్లేదని పెళ్లి పీటల మీద నుంచి నువ్వు వెళ్లిపోయేసరికి .. అవమానంతో ఒంటికి నిప్పంటించుకున్నా. ఒంటిని కాలుస్తున్న ఆ మంటలను తట్టుకోలేక ఇల్లంతా పరిగెత్తా .. ప్చ్.. నాతో పాటు మా వాళ్లూ కాలి బూడిదైపోయారు తెలుసా?’’ అంటూ బాధగా గోడకు ఒరిగింది ఆమె...‘‘ఎప్పటికైనా నువ్వొస్తావని తెలుసు. అందుకే ఆ ఇల్లు వదిలిపెట్టలేదెవ్వరం! ఇన్నేళ్లకు వెదుక్కుంటూ వచ్చావ్. రా.. మనింటికి పోదాం...’’ అంటూ ధీరజ్ చేయి పట్టుకుంది. చేతి నిండా గాజులు.. పరీక్షగా చూశాడు ఆమెను.. పెళ్లి కూతురు అలంకరణలో ఉంది.‘‘హేయ్ .. ఎవరు నువ్వు? నా చేయి వదులు..’’ అంటూ చేయి విదిలిస్తున్నాడు. గొంతు పెగలట్లేదు.. చేయి కదలట్లేదు.. అరుస్తున్నాడు.. విదిలిస్తున్నాడు.. పట్టు బిగిస్తూ నవ్వుతోంది ఆమె.. గట్టిగా.. క్రూరంగా! సరస్వతి రమ -
కమల్ పార్టీ గుర్తు ‘టార్చ్‌లైట్’
చెన్నై: సినీనటుడు, మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) అధినేత కమల్‌హాసన్ పార్టీకి ఎన్నికల కమిషన్ టార్చ్‌లైట్‌ను పార్టీ గుర్తుగా కేటాయించింది. కమల్ ఎన్నికల కమిషన్(ఈసీ)కు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలి పారు. ‘మా పార్టీకి టార్చ్‌లైట్‌ను గుర్తుగా కేటాయించినందుకు ఈసీకి ధన్యవాదాలు. తగిన గుర్తే లభించింది. తమిళనాడులో, భారత రాజకీయ చరిత్రలో మక్కల్ నీది మయ్యమ్ టార్చ్‌బేరర్‌గా మారనుంది’ అని ట్వీట్ చేశారు. గతేడాది ఎంఎన్ం పార్టీని స్థాపించిన కమల్‌హాసన్ ఏప్రిల్‌లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. తమ పార్టీ త్వరలోనే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తుందని, అభ్యర్థుల ఎంపికలో యువతకు ఎక్కువ ప్రాధాన్యమిస్తామని ఆయన గత నెలలో చెప్పారు. -
నిర్మాతగా మారుతున్న హీరోయిన్
తమిళ సినిమా : ఇంతకు ముందు కోలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగిన నటి సదా. అజిత్, విక్రమ్, మాధవన్ లాంటి స్టార్ హీరోలతో నటించిన ఈ భామ టాలీవుడ్‌లోనూ కొన్ని సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించింది. అలాంటిది అనూహ్యంగా వెనుకబడ్డారు. మళ్లీ ఫామ్‌లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్న సదాకు చాలా గ్యాప్ తరువాత ఒక కోలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. టార్చ్‌లైట్ అనే చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపేసింది. గతంలో ముందు విజయ్ హీరోగా తమిళన్ చిత్రాన్ని తెరకెక్కించిన మజీద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దీని గురించి ఆయన తెలుపుతూ టార్చ్‌లైట్ చిత్రం మహిళావగాహన కథా చిత్రంగా ఉంటుందన్నారు. పేదరికం కారణంగా వ్యభిచార వృత్తిలోకి దిగే స్త్రీల గురించిన చిత్రంగా టార్చ్‌లైట్ ఉంటుందన్నారు. ఈ చిత్రంలో నటించడానికి పలువురు ప్రముఖ నటీమణులు నిరాకరించారని, అలాంటి పాత్రను చేయడానికి నటి సదా ధైర్యంగా ముందుకొచ్చారని చెప్పారు. టార్చ్‌లైట్ సదా కెరీర్లో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఈ దర్శకుడి ప్రతిభను మెచ్చి నటి సదా ఆయన దర్శకత్వంలో తదుపరి చిత్రాన్ని సొంతంగా నిర్మించడానికి సిద్ధం అయ్యారట. అగ్రనటిగా వెలుగొందుతున్న నయనతార కూడా ఆరమ్ కథ తనను బాగా ఆకట్టకోవడంతో ఆ చిత్రాన్ని తనే నిర్మించారన్నది గమనార్హం. ఇప్పుడు నయన్ బాటలోనే నటి సదా పయనించడానికి సిద్ధం అవుతోందన్న మాట. -
టార్చ్‌లైట్ వెలుగులో ఆపరేషన్
సాక్షి, పాట్నా : బీహార్‌లో దారుణం చోటుచేసుకుంది. విద్యుత్ అంతరాయంతో సహర్షాలోని సదర్ ఆస్పత్రిలో ఓ మహిళకు టార్చ్‌లైట్ వెలుగులో వైద్యులు ఆపరేషన్ చేయడం కలకలం రేపింది. స్పృహలేని స్థితిలో బెడ్‌పై ఉన్న మహిళకు టార్చ్ వెలుగులో కుట్లు వేస్తున్న వీడియో బహిర్గతమైంది. ఆమె చుట్టూ పలువురు సిబ్బంది ఉండగా తెలుపు రంగు దుస్తుల్లో ఉండాల్సిన వైద్యులు ఖాకీ షర్ట్‌తో కనిపించడం గమనార్హం. ఆస్పత్రిలో జనరేటర్ లేకపోవడంతో అత్యవసరంగా టార్చ్‌లైట్ వెలుగులోనే సర్జరీ చేసినట్టు చెబుతున్నారు. దీనిపై ఆస్పత్రి వర్గాలు ఇంతవరకూ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ప్రభుత్వ అధికారులు సైతం ఈ ఘటనపై ఇంకా నోరుమెదపలేదు. కాగా, ఖగారియాలో ఇటీవల మొబైల్ ఫోన్ వెలుగుతో ఆపరేషన్లు నిర్వహించిన ఘటన నేపథ్యంలో ఈ ఉదంతం వెలుగుచూసింది. గత ఏడాది డిసెంబర్లో ఇదే తరహాలో యూపీలోని ఉన్నావ్ జిల్లాలో 32 మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించినట్టు వార్తలు వచ్చాయి. -
'ఛీ'జీహెచ్
జీజీహెచ్‌లో ఏ వార్డును పలకరించినా గొంతు పెగలని రోగుల ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. ఏ ఆపరేషన్ థియేటర్ వైపు కన్నెత్తి చూసినా అధికారుల నిర్లక్ష్యపు ఛాయలు పేదలపాలిట శాపాలవుతున్నాయి. ఏ ఆఫీసు గది గడప తొక్కినా అభాగ్యుల బతుకులతో ఆటలాడుతున్న రాజకీయ క్రీడలు అందలమెక్కి వెక్కిరిస్తున్నాయి. సెల్‌ఫోన్ లైటింగ్‌తో ఆపరేషన్లు చేసే స్థాయికి ఆస్పత్రి పరువును దిగజార్చిన పాలకులు, అధికారుల రాతి గుండెలను కళ్లకు కడుతున్నాయి. మెడికల్ విద్యార్థి సంధ్యారాణి, ఎలుకల దాడికి బలైన పసికందు, గైనకాలజీ వైద్యుల అలసత్వానికి తనువు చాలించిన బాలుడి ఆత్మలు.. ఇది ఖర్మాస్పత్రేనంటూ నిత్యం ఘోషిస్తున్నాయి. సాక్షి, గుంటూరు: రోడ్లపై అరటికాయలు అమ్మే తోపుడు బండ్లపై సైతం మంచి టార్చిలైట్లు ఏర్పాటు చేసి వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చూస్తుంటారు. గుంటూరు జీజీహెచ్‌లో మాత్రం ఆపరేషన్ థియేటర్లలోనే లైట్లు ఉండవు. సెల్‌ఫోన్ లైట్ల వెలుగులో ఆపరేషన్ చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతుంటారు. జీజీహెచ్‌కు వచ్చే రోగులకు ఆపరేషన్ అత్యవసరమైనా రోజుల తరబడి పట్టించుకోకుండా వదిలేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీజీహెచ్, గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు భారత వైద్య మండలి (ఎంసీఐ) బృందం తనిఖీలకు వచ్చిన ప్రతిసారీ మొట్టికాయలు వేస్తూనే ఉంది. వసతులలేమి, వైద్య పరికరాల కొరత, సిబ్బంది నిర్లక్ష్యం, కీలక పోస్టుల్లో అర్హత లేనివారిని కూర్చోబెట్టడం వంటి వాటిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అయితే ఎంసీఐ బృందం తనిఖీలకు వచ్చిన ప్రతిసారీ డ్రామా సెట్టింగ్‌లు వేస్తూ, అధికారులను మారుస్తూ జీజీహెచ్ వైద్యులు పబ్బం గడుపుతున్నారు. ♦ జీజీహెచ్‌లో మోకీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయించుకుంటానని ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చెప్పారు. తనకు మాదిరిగానే పేదలకు సేవలందేలా చూస్తానని హామీ ఇచ్చారు. తీరా ఆపరేషన్ సమయానికి కార్పొరేట్ వైద్యశాలల నుంచి పరికరాలు, వైద్యులను తెప్పించి ఆపరేషన్ చేయించారు. ఈ ఘటనలో తమపై నమ్మకం లేక బయట నుంచి పిలిపించుకొని జీజీహెచ్ పరువును తీశారంటూ ప్రభుత్వ వైద్యులు మండి పడ్డారు. ♦ గతంలో పిల్లల శస్త్రచికిత్స వైద్య విభాగంలో వెంటిలేటర్‌పై పడుకున్న పసికందును ఎలుకలు కరిచి చంపేస్తున్నా పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. దేశ వ్యాప్తంగా ఈ దుర్ఘటన తీవ్ర సంచలనం కలిగించడంతోపాటు జీజీహెచ్ చరిత్రను మసకబార్చింది. అప్పట్లో హడావుడి చేసిన పాలకులు, ఉన్నతాధికారులు ఆ తరువాత పట్టించుకున్న దాఖలాలు లేవు. ♦ ప్రొఫెసర్ వేధింపుల వల్ల పీజీ వైద్య విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. అప్పట్లో 10 రోజులపాటు వైద్య విద్యార్థులు విధులకు హాజరు కాకుండా ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. బతికి ఉన్న శిశువును చనిపోయినట్లుగా నిర్ధారించి ఆసుపత్రి నుంచి పంపివేయడం వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారింది. ఈ ఘటనలో శిశువు బంధువులు జీజీహెచ్ ఎదుట ధర్నా నిర్వహించే వరకు వెళ్లింది. అయితే శిశువును ఐసీయూలో చేర్పించిన కొన్ని గంటల వ్యవధిలోనే మృతి చెందింది. ♦ తలకు తీవ్రగాయాలైన వెంకమ్మ అనే మహిళకు ఈ నెల 7వ తేదీ ఎస్వోటీలో శస్త్రచికిత్స చేసే సమయంలో లైట్ ఆగిపోవడంతో థియేటర్లో చీకటి అలుముకుంది. దీంతో వైద్యులు సెల్‌ఫోన్ లైట్ ఆన్ చేసి ఆ వెలుతురులో ఆపరేషన్ నిర్వహించారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. తాజాగా ఈ నెల 14వ తేదీ బుధవారం సైతం అదే ఎస్వోటీలో తాడేపల్లికి చెందిన ఎం.జోషిబాబుకు శస్త్రచికిత్స చేస్తుండగా వైద్య పరికరాలు మొరాయించాయి. దీంతో మళ్లీ ఆపరేషన్ ఆగిపోయింది. ఏం చేయాలో తెలియక అతన్ని పక్క బ్లాక్‌లో ఉన్న ఆర్ధోపెడిక్ ఆపరేషన్ థియేటర్‌కు తరలించి శస్త్ర చికిత్స పూర్తి చేశారు. దీనిపై సాక్షి మెయిన్ పేజీలో గురువారం ప్రచురితమైన ‘ఆపరేషాన్’ అనే కథనంతో జీజీహెచ్ అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది. ఈ రెండు సంఘటనలు వరుసగా జరగడంతో జీజీహెచ్‌లోని రోగులు, వారి బంధువులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వైఎస్సార్ సీపీ నేతల ధర్నా ఆస్పత్రిలో అధికారుల తీరుపై స్పందించిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా గంటపాటు జీజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు రావి వెంకటరమణతో కలిసి జీజీహెచ్‌లో తిరిగి రోగుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. జూనియర్ల పాలనతో ఇక్కట్లు చరిత్ర కలిగిన గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్‌లలో పాలనను గాలికొదిలేశారు. సీనియర్లు ఉన్నప్పటికీ రాజకీయ కారణాలతో జూనియర్లను ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టి వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారు. గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్బారావుకు అర్హత లేదని సాక్షాత్తు భారత వైద్య మండలి (ఎంసీఐ) తేల్చి చెప్పినప్పటికీ ఆయన్ను మార్చలేదు. ఎంసీఐ తనిఖీలకు వచ్చిన ప్రతిసారీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ మోహన్‌రావును సీట్లో కూర్చొబెడుతూ డ్రామాలు ఆడుతున్నారు. మరో వైపు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ రాజునాయుడును నియమించడమే కాకుండా పదవీ విరమణ అనంతరం మరో రెండేళ్లు పెంచి మరీ కొనసాగిస్తున్నారు. సీనియర్లు ఉన్నప్పటికీ జూనియర్లను కీలక పోస్టుల్లో కూర్చోబెట్టడంతో పాలనపై వారు పట్టు సాధించలేకపోతున్నారు. జీజీహెచ్‌లో వరుస ఘటనలకు పరోక్షంగా వీరే కారకులవుతున్నారు. దీని వెనుక అధికార పార్టీ నాయకుల రాజకీయాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. వ్యక్తుల కోసం వ్యవస్థను నాశనం చేసేందుకు కూడా వీరు వెనుకాడడం లేదనే దుర్ఘటనలు కంటతడి పెట్టిస్తున్నాయి. -
టార్చిలైట్ వెలుగులో కంటి ఆపరేషన్లు
ఉన్నావ్(ఉత్తరప్రదేశ్): టార్చిలైటు వెలుతురులో 32 మందికి కంటి శుక్లాల ఆపరేషన్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది. ఉన్నావ్ దగ్గర్లోని నవాబ్‌గంజ్‌లోని ఓ కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌లో ఈ ఘటన జరిగింది. జిల్లా అధికార యంత్రాంగం ఘటనపై విచారణకు ఆదేశించింది. ఘటనపై ఆరోగ్య మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నావ్ ప్రధాన వైద్య అధికారి(సీఎంవో) రాజేంద్ర ప్రసాద్‌ను సస్పెండ్ చేశారు. హెల్త్ సెంటర్ ఇన్చార్జిని తొలగించారు. కాగా, ఆపరేషన్ తర్వాత రోగులను నేలమీద పడుకోబెట్టారని పలువురు ఆరోపించారు. ఆస్పత్రిలో విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తడం, పవర్ బ్యాకప్ లేకపోవడంతో టార్చిలైటు వెలుతురులో శస్త్రచికిత్సలు చేసినట్లు తెలుస్తోంది. -
టార్చ్ వెలుగు నిస్తుందా?
తమిళసినిమా: టార్చ్లైట్తో నటి సదా తన కేరీర్లో వెలుగు నింపుకోవాలని ఆశిస్తోంది. తెలుగులోనే కాదు తమిళంలోనూ జయం చిత్రంతో విజయాన్ని అందుకున్న ఉత్తరాది భామ సదా. ఈ రెండు భాషల్లోనూ వరుసగా చిత్రాలు చేసిన ఈ బ్యూటీ కథానాయకిగా ఒక వెలుగు వెలుగుతుందని అందరూ భావించారు. ముఖ్యంగా తమిళంలో విక్రమ్, అజిత్, మాదవన్ వంటి స్టార్ హీరోలతో జత కట్టి మంచి గుర్తింపు పొందిన సదా ఏం జరిగిందో ఏమో గానీ అనూహ్యంగా సినిమాలకు దూరం అయ్యి ఆనక తెరమరుగయ్యిందనే చెప్పాలి. అలా క్రేజ్ తగ్గిన తరువాత రీఎంట్రీ ఇచ్చినా ఫలితం లేక పోయింది. తాజాగా తన ఉనికిని చాటుకోవడానికి నానా తంటాలు పడుతోందనే చెప్పాలి. ఆ మధ్య హాస్యనటుడు వడివేలుకు జంటగా ఎలి చిత్రంలో నటించి ఉన్న కాస్త పేరును చెడగొట్టుకుందని కోలీవుడ్ వర్గాలు గుసగుసలాడాయి. ఇలాంటి పరిస్థితుల్లో సదా టార్చ్‌లైట్ చిత్రంతో మరోసారి లక్కు పరిక్షించుకోవడానికి రెడీ అవుతోంది. విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో అమ్మడు వెలయాళిగా నటించింది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేశారు. అందులో నడుము కింద వరకూ చీర కట్టి సగం ముఖాన్ని పూర్తిగా వెనుక భాగాన్ని కలిపించే విధంగా సెక్సీ అప్పీల్లో కనిపించే సదా ఫొటో యువతకు కిరాక్ పుట్టించేలా ఉంది. అంతే కాదు కోలీవుడ్‌లో ఈ పోస్టర్ గురించే చర్చ సుడులు తిరుగుతోంది. మజీద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. మరి ఈ టార్చ్‌లైట్ సదా నట జీవితంలో ఎంత వెలుగు నింపుతుందో వేచి చూడాలి. -
భయపెట్టే టార్చిలైట్
సూర్య శ్రీనివాస్ హీరోగా, ఆశ్లేష, ప్రియాంక హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘టార్చిలైట్’. వరప్రసాద్ దర్శకత్వంలో చంద్రకళ సమర్పణలో మాస్టర్ ఆర్. మనోజ్ సాయి శ్రీరామ్, మాస్టర్ ఆర్. శ్రీరామ్ అజయ్, సాయిలక్ష్మి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. డీవీ, సురేశ్ కొండేటి కెమెరా స్విచ్చాన్ చేయగా, ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా క్లాప్ ఇచ్చారు. దర్శక–నిర్మాత సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. వరప్రసాద్ మాట్లాడుతూ– ‘‘హారర్ నేపథ్యంలో సాగే చిత్రమిది. మెయిన్ విలన్‌గా రవిబాబు కనిపిస్తారు’’ అన్నారు. ‘‘మంచి సినిమాలో మేమూ భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు హీరో, హీరోయిన్లు. సంగీత దర్శకుడు దేవేంద్ర పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: మంగునూరు ఆంజనేయులు, ముద్దం రామచంద్రుడు, వాణీ చౌదరి. -
చేతులను వేడి చేస్తుంది...
ట్రావెల్ గేర్ బాగా చలి ఉంటే ఇంట్లో ఉన్నా వేళ్లు కొంకర్లు పోతుంటాయి. ఇక ప్రయాణంలో సరేసరి. ఇలాంటప్పుడు అరచేతులకు వెచ్చదనాన్ని కలిగించే ఒక పరికరం ఉంటే.. మూడు విధాల ఉపయోగపడే ఈ హ్యాండ్ వార్మింగ్ పరికరం వెచ్చదనాన్ని అందించేదిగానూ, ఫోన్ చార్జర్‌గానూ, టార్చ్లైట్గానూ పనికొస్తుంది. చలిప్రాంతాలకు వెళ్లేవారికోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పరికరం చెంత ఉంటే బెస్ట్ ఫ్రెండ్ వెంట ఉన్నట్టే! ఈ వార్మింగ్ పరికరం బటన్ నొక్కితే 5 నిమిషాల్లో చేతులను వెచ్చబరుస్తుంది. చీకటి వేళలో బయటకు వెళ్లేసమయంలో టార్చ్లైట్లా పనిచేస్తుంది. అమేజాన్ డాట్ కామ్‌లో రూ.2,100 నుంచి లభిస్తోంది. -
వేడి వేడి టార్చి...
సాధారణంగా కరెంటు పోయినప్పుడో.. రాత్రివేళ బయటకు వెళ్లినప్పుడో వెలుతురు కోసం టార్చిలైటు ఉపయోగిస్తాం. కానీ ఈ టార్చిలైటు కాంతినే కాదు.. వేడిని కూడా ఇస్తుంది. ఆ వేడి ఎంత ఉంటుందంటే.. దాంతో చక్కగా ఆమ్లెట్ కూడా వేసేసుకోవచ్చు. ఏదైనా ప్లాస్టిక్ ప్లేటును దాని దగ్గరగా పెట్టి ఈ లైటు వేస్తే.. అది ఏకంగా ఇలా మండిపోతుంది. అంతేకాదు.. మనకు ఎంత వెలుతురు అవసరమో, అందుకు తగ్గట్టుగా మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. అంటే, టార్చిలా ఉపయోగించుకోవచ్చు లేదా ఫోకస్ లైట్లానూ వినియోగించుకోవచ్చు. ఇందులోనిఅయాన్ బ్యాటరీ.. మనం అడ్జస్ట్ చేసుకున్న కాంతిని బట్టి 10 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు పనిచేస్తుంది. ఈ బల్బ్ సాధారణ టార్చిలైట్లలోని బల్బ్ కంటే 20వేల రెట్లు ఎక్కువ శక్తివంతమైంది. షాంఘైలోని విక్డ్ లేజర్స్ అనే సంస్థ రూపొందించిన ఈ టార్చి ధర దాదాపు రూ.12 వేలు.