
చెన్నై: సినీనటుడు, మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌హాసన్ పార్టీకి ఎన్నికల కమిషన్ టార్చ్‌లైట్‌ను పార్టీ గుర్తుగా కేటాయించింది. కమల్ ఎన్నికల కమిషన్(ఈసీ)కు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలి పారు. ‘మా పార్టీకి టార్చ్‌లైట్‌ను గుర్తుగా కేటాయించినందుకు ఈసీకి ధన్యవాదాలు. తగిన గుర్తే లభించింది.
తమిళనాడులో, భారత రాజకీయ చరిత్రలో మక్కల్ నీది మయ్యమ్ టార్చ్‌బేరర్‌గా మారనుంది’ అని ట్వీట్ చేశారు. గతేడాది ఎంఎన్‌ం పార్టీని స్థాపించిన కమల్‌హాసన్ ఏప్రిల్‌లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. తమ పార్టీ త్వరలోనే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తుందని, అభ్యర్థుల ఎంపికలో యువతకు ఎక్కువ ప్రాధాన్యమిస్తామని ఆయన గత నెలలో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment