సాక్షి, శ్రీనగర్ : లోక్‌సభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేస్తున్న కసరత్తు చివరి దశకు చేరుకుంది. ఇవాళ జమ్ము కశ్మీర్‌లో ఎన్నికల ఏర్పాట్లను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ పర్యవేక్షించనున్నారు. దీంతో.. ఎన్నికల సన్నాహాక సమీక్షలు దాదాపు పూర్తి అయినట్లే. ఈ లెక్కన ఎల్లుండి(శుక్రవారం) లోక్‌సభ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
లోక్‌సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సైతం షెడ్యూల్ విడుదల చేయొచ్చని తెలుస్తోంది. ఈసీలో రెండు కమిషనర్ల స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ.. ఇప్పటికే అన్ని సమీక్షలు ముగిడయంతో షెడ్యూల్ విడుదలకే ఈసీ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇక..
జమ్ము కశ్మీర్‌లో ఇవాళ జరగబోయే ఈసీ సమావేశంలో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, బీజేపీ, సీపీఐ(ఎం), కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు పాల్గొంటాయి. రాజకీయ పార్టీలతో సమావేశం అనంతరం ఎన్నికల సంఘం అధికారులు, పోలీసు సూపరింటెండెంట్లతో ఎన్నికల సన్నద్ధతపై సమగ్ర సమీక్ష నిర్వహిస్తారు. మరోవైపు ఎన్నికల సంఘం రివ్వ్యూ నేపథ్యంలో.. జమ్ములో లోక్‌సభ ఎన్నికలతో పాటే.. కుదరకుంటే ఆ వెంటనే అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేలా ఈసీపై రాజకీయ పార్టీలు ఒత్తిడి చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు గత రెండు వారాలుగా మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్‌లు ఈ డిమాండ్‌ను లేవనెత్తుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment