తమిళసినిమా: టార్చ్‌లైట్‌తో నటి సదా తన కేరీర్‌లో వెలుగు నింపుకోవాలని ఆశిస్తోంది. తెలుగులోనే కాదు తమిళంలోనూ జయం చిత్రంతో విజయాన్ని అందుకున్న ఉత్తరాది భామ సదా. ఈ రెండు భాషల్లోనూ వరుసగా చిత్రాలు చేసిన ఈ బ్యూటీ కథానాయకిగా ఒక వెలుగు వెలుగుతుందని అందరూ భావించారు. ముఖ్యంగా తమిళంలో విక్రమ్, అజిత్, మాదవన్ వంటి స్టార్ హీరోలతో జత కట్టి మంచి గుర్తింపు పొందిన సదా ఏం జరిగిందో ఏమో గానీ అనూహ్యంగా సినిమాలకు దూరం అయ్యి ఆనక తెరమరుగయ్యిందనే చెప్పాలి. అలా క్రేజ్ తగ్గిన తరువాత రీఎంట్రీ ఇచ్చినా ఫలితం లేక పోయింది. తాజాగా తన ఉనికిని చాటుకోవడానికి నానా తంటాలు పడుతోందనే చెప్పాలి.
ఆ మధ్య హాస్యనటుడు వడివేలుకు జంటగా ఎలి చిత్రంలో నటించి ఉన్న కాస్త పేరును చెడగొట్టుకుందని కోలీవుడ్ వర్గాలు గుసగుసలాడాయి. ఇలాంటి పరిస్థితుల్లో సదా టార్చ్‌లైట్ చిత్రంతో మరోసారి లక్కు పరిక్షించుకోవడానికి రెడీ అవుతోంది. విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో అమ్మడు వెలయాళిగా నటించింది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేశారు. అందులో నడుము కింద వరకూ చీర కట్టి సగం ముఖాన్ని పూర్తిగా వెనుక భాగాన్ని కలిపించే విధంగా సెక్సీ అప్పీల్‌లో కనిపించే సదా ఫొటో యువతకు కిరాక్ పుట్టించేలా ఉంది. అంతే కాదు కోలీవుడ్‌లో ఈ పోస్టర్ గురించే చర్చ సుడులు తిరుగుతోంది. మజీద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. మరి ఈ టార్చ్‌లైట్ సదా నట జీవితంలో ఎంత వెలుగు నింపుతుందో వేచి చూడాలి.
టార్చ్ వెలుగు నిస్తుందా?
Published Tue, Dec 5 2017 1:08 AM | Last Updated on Tue, Dec 5 2017 1:08 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment