నిర్మాతగా మారుతున్న హీరోయిన్‌ | Actress Sada Turns Producer | Sakshi
Sakshi News home page

Published Thu, Apr 19 2018 10:32 AM | Last Updated on Thu, Apr 19 2018 10:32 AM

Actress Sada Turns Producer - Sakshi

తమిళ సినిమా : ఇంతకు ముందు కోలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగిన నటి సదా. అజిత్, విక్రమ్, మాధవన్‌ లాంటి స్టార్‌ హీరోలతో నటించిన ఈ భామ టాలీవుడ్‌లోనూ కొన్ని సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటించింది. అలాంటిది అనూహ్యంగా వెనుకబడ్డారు. మళ్లీ ఫామ్‌లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్న సదాకు చాలా గ్యాప్‌ తరువాత ఒక కోలీవుడ్‌ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. టార్చ్‌లైట్‌ అనే చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపేసింది. 

గతంలో ముందు విజయ్‌ హీరోగా తమిళన్‌ చిత్రాన్ని తెరకెక్కించిన మజీద్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దీని గురించి ఆయన తెలుపుతూ టార్చ్‌లైట్‌ చిత్రం మహిళావగాహన కథా చిత్రంగా ఉంటుందన్నారు. పేదరికం కారణంగా వ్యభిచార వృత్తిలోకి దిగే స్త్రీల గురించిన చిత్రంగా టార్చ్‌లైట్‌ ఉంటుందన్నారు. ఈ చిత్రంలో నటించడానికి పలువురు ప్రముఖ నటీమణులు నిరాకరించారని, అలాంటి పాత్రను చేయడానికి నటి సదా ధైర్యంగా ముందుకొచ్చారని చెప్పారు.

టార్చ్‌లైట్‌ సదా కెరీర్‌లో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఈ దర్శకుడి ప్రతిభను మెచ్చి నటి సదా ఆయన దర్శకత్వంలో తదుపరి చిత్రాన్ని సొంతంగా నిర్మించడానికి సిద్ధం అయ్యారట. అగ్రనటిగా వెలుగొందుతున్న నయనతార కూడా ఆరమ్‌ కథ తనను బాగా ఆకట్టకోవడంతో ఆ చిత్రాన్ని తనే నిర్మించారన్నది గమనార్హం. ఇప్పుడు నయన్‌ బాటలోనే నటి సదా పయనించడానికి సిద్ధం అవుతోందన్న మాట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement