
టీమిండియా మాజీ ఆటగాడు.. సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని తర్వలోనే సినీరంగ ప్రవేశం చేయనున్నాడు. అయితే నటుడిగా మాత్రం కాదు.. నిర్మాతగా. నయనతార ప్రధాన పాత్రలో తమిళంలో నిర్మించబోయే ఒక సినిమాకు ధోని నిర్మాతగా వ్యవహరించనున్నాడు. లేడీ ఓరియంటెడ్ నేపథ్యంలో రూపొందబోతున్న ఈ సినిమాకు ధోని నిర్మాతగా చేయనుండటంతో నయన్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ సినిమాకు దర్శకుడు ఎవరనేది త్వరలో వెల్లడించనున్నారు.
కాగా ధోని ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీగా ఉన్నాడు. 11 మ్యాచ్‌ల్లో 4 విజయాలు.. ఏడు ఓటములతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. మరో మూడు మ్యాచులు ఉన్నప్పటికి సీఎస్కే ప్లేఆఫ్ అవకాశాలు అంతంతమాత్రమే. ఇక త్వరలోనే విఘ్నేశ్ శివన్-నయనతారలు తమ సుదీర్ఘ ప్రేమాయణానికి ఫుల్ స్టాప్ పెట్టేసి.. పెళ్లి బంధంతో ఒక్కటయ్యేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మరోవైపు నయన్ కూడా.. ప్రస్తుతం ఐదు సినిమాలతో బిజీగా ఉంది. అందులో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో అట్లీ దర్శకత్వంలో సెట్స్‌పై ఉంది.
నయన్ పెళ్లి, ఐపీఎల్ ముగిసిన తర్వాత ధోని కిలిసి ఈ సినిమాను పట్టాలెక్కించనున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి త్వరలోనే కీలక అప్డేట్ వచ్చే అవకాశమున్నట్టు కోలివుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి క్రికెటర్ గా సక్సెస్ అయిన ధోని.. నిర్మాత గా ఏ మేరకు విజయం సాధిస్తాడో వేచి చూడాలి.
చదవండి: సమంతకు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన లేడీ సూపర్‌స్టార్
IPL 2022 - Ravindra Jadeja: ఐపీఎల్ 2022 సీజన్ నుంచి తప్పుకోనున్న జడేజా..?
Comments
Please login to add a commentAdd a comment