Movie Producer Russo Arrested In Aarudhra Case In Tamilnadu - Sakshi
Sakshi News home page

సినీ నిర్మాత అరెస్ట్‌.. కారణం ఇదే.. వెలుగులోకి షాకింగ్‌ విషయాలు..

Published Tue, Dec 27 2022 8:52 AM | Last Updated on Tue, Dec 27 2022 9:51 AM

Movie Producer Russo Arrested In Cheating Case In Tamilnadu - Sakshi

దీంతో రుసో ఇంట్లో సోదాలు నిర్వహించి రూ.8 లక్షల నగదు, బంగారం, ముఖ్యమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా ఆయన బ్యాంకులోని రూ.1.40 కోట్లను సీజ్‌ చేసి ఆయన్ను అరెస్ట్‌ చేశారు.

తమిళ సినిమా: ఆరుద్ర గోల్డ్‌ ఫైనాన్స్‌ కంపెనీ మోసం కేసులో కాంచీపురం బ్రాంచ్‌ నిర్వాహకుడు, సినీ నటుడు, నిర్మాత రుసో(42)ను పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేసి పుళల్‌ జైలుకు తరలించారు. వివరాలు.. చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో ఆరుద్ర గోల్డ్‌ ఫైనాన్స్‌కు చెందిన బ్రాంచ్‌లు ఉన్నాయి. ఈ కంపెనీ 30 శాతం వడ్డీ చెల్లిస్తామని ప్రచారం చేసి ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసింది.

బోర్డు తిప్పేయడంతో బాధితులు చెన్నై క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చెన్నై అమంజికరైలోని ఆరుద్ర గోల్డ్‌ ఫైనాన్స్‌ ప్రధాన కార్యాలయం డైరెక్టర్‌ సెంథిల్‌ను అరెస్ట్‌ చేసి విచారించారు. ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించగా ఆయన బ్యాంకు అకౌంట్‌ నుంచి కాంచీపురం బ్రాంచ్‌ నిర్వాహకుడు రుసో బ్యాంకు అకౌంటుకు భారీ మొత్తంలో డబ్బు ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు గుర్తించారు.

దీంతో రుసో ఇంట్లో సోదాలు నిర్వహించి రూ.8 లక్షల నగదు, బంగారం, ముఖ్యమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా ఆయన బ్యాంకులోని రూ.1.40 కోట్లను సీజ్‌ చేసి ఆయన్ను అరెస్ట్‌ చేశారు. కాగా, రుసో రూ.10 కోట్లతో కొత్త భవనాన్ని, ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. కాగా ఆర్కే సురేశ్‌ దర్శకత్వంలో రుసో చిత్రాన్ని నిర్మిస్తూ అందులో కథానాయకుడిగా నటిస్తున్నట్లు తెలిసింది.
చదవండి: అలాంటి వాటిపై నమ్మకం లేదు.. కానీ భయమేస్తుంటుంది: నయన్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement