సాక్షి,హైదరాబాద్: గత ప్రభుత్వంలోని ముఖ్య నేతల సంతకాలు ఫోర్జరీ చేసి ఓ కంపెనీని రూ.5 కోట్లు మోసం చేసిన కేసులో బీఆర్‌ఎస్ నేత అరవింద్ అలిశెట్టిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మిడ్ డే మీల్స్ కాంటట్రాక్టు ఇప్పిస్తానని బీఆర్‌ఎస్ నేత అరవింద్ తమ వద్ద రూ. 5 కోట్లు తీసుకున్నాడని బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ కేసులో బెంగళూరు కంపెనీ ఫిర్యాదు చేయడంతో కేసు విచారణ ప్రారంభించిన పోలీసులు అరవింద్‌ను అదుపులోకి తీసుకున్నారు. కంపెనీ వద్ద రూ.5 కోట్లు తీసుకుని మిడ్ డే మీల్స్ స్కీమ్‌కు సంబంధించి అరవింద్ ఏకంగా ఒక ఫేక్ జీవోను కూడా తయారు చేశాడు.
ఇదీచదవండి.. కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ
Comments
Please login to add a commentAdd a comment