హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా కలకలం రేపింది. కబాలి చిత్ర నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి(కేపీ చౌదరి)ని కిస్మత్ పుర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన వద్ద నుంచి 82 గ్రాముల కొకైన్,, రూ.2,05,000 నగదు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 2016లో సినిమా రంగంలోకి వచ్చిన కేపీ చౌదరి కబాలి చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు. సర్ధార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు.
(ఇది చదవండి: ఎంగేజ్‌మెంట్ తర్వాత తొలిసారి ఫోటో షేర్ చేసిన లావణ్య త్రిపాఠి!)
సినీరంగంలో నష్టాలు రావడంతో డ్రగ్స్ సరఫరాను ఎంచుకున్నారు. గోవాలో ఓహచ్ఎం పబ్‌ను ప్రారంభించిన కేపీ చౌదరీ సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. పబ్బులో నష్టాలు రావడంతో హైదరాబాద్ తిరిగొచ్చారు. నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి స్వస్థలం ఖమ్మం జిల్లా బొనకల్ మండలంగా పోలీసులు తెలిపారు. ఆయన గతంలో పూణె ఏరోనాటికల్‌లో డైరెక్టర్ ఆపరేషన్స్‌గా పనిచేశారు.
సినీ ప్రముఖలతో సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరికి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. గోవాలో నైజీరియన్లతో ఉన్న పరిచయాలతో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఇవాళ పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులు కిస్మత్ పుర్‌లో కొకైన్ విక్రయిస్తుండగా మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. అయితే గతంలోనూ టాలీవుడ్ డ్రగ్స్ కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment