Kabali Movie Producer KP Chowdary Arrested In Drugs Case - Sakshi
Sakshi News home page

Drugs Case: కేపీ చౌదరి ఫోన్‌ లిస్ట్‌లో సినీ ప్రముఖల లిస్ట్‌

Published Thu, Jun 15 2023 12:01 PM | Last Updated on Thu, Jun 15 2023 2:53 PM

Kabali Film Producer KP Chowdary Drugs Links Tollywood Celebrities - Sakshi

టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం దుమారం రేపుతోంది. తాజాగా  ప్రముఖ టాలీవుడ్ నిర్మాత డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం హాట్ టాపిక్‌గా మారింది. కబాలి నిర్మాత కేపీ చౌదరిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి అతని నుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద ఉన్న నాలుగు సెల్‌ఫోన్లతో పాటు ల్యాప్‌టాప్‌ను తీసుకున్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి డ్రగ్స్ దందాలోకి దిగిన కేపీ చౌదరితో పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు టచ్‌లో ఉన్నారని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అరెస్ట్‌ అయిన  రోషన్‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు.

(ఇదీ చదండి: సినిమా రంగంలోనే డ్రగ్స్‌ ఎందుకు?)

తాజాగా కేపీ చౌదరి ఏర్పాటు చేసిన పార్టీలకు హాజరైన సినీ ప్రముఖుల లిస్ట్‌ను పోలీసులు రెడీ చేస్తున్నారు. అతని నుంచి ఒక్కొక్కటిగా డ్రగ్స్‌ లింక్‌లు బయటపడుతున్నాయి. అతను ఎవరెవరితో వాట్సప్‌లలో చాటింగ్‌ చేశారో విశ్లేషిస్తున్నారు. డ్రగ్‌ మాఫియా ఖేల్‌ ఖతం అనుకుంటే.. గోవా టూ హైదరాబాద్‌ రూట్‌లో ఈ రాకెట్‌ మళ్లీ గుప్పుమంది. మరోవైపు డ్రగ్స్‌ కింగ్‌ పిన్‌ గాబ్రియేల్‌ కోసం గాలిస్తున్నారు. టాలీవుడ్‌ నుంచి కేపీ చౌదరిని అదుపులోకి తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు.. గతంలో హీరోయిన్‌ ఛార్మీ, రానా, పూరి,రవితేజ,నవదీప్‌,ముమైత్‌ ఖాన్‌,నందు,తరుణ్‌ను డ్రగ్స్‌ లింక్‌ల గురించి పోలీసులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ డ్రగ్స్‌ లింక్‌లో ఇద్దరు ప్రముఖ హీరోయిన్‌లతో పాటు, నలుగురు మహిళా ఆర్టిస్ట్‌లు ఉన్నారని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ డ్రగ్‌ మాఫియా వెనుక ఒక ప్రముఖ డైరెక్టర్‌ కూడా ఉన్నారని తెలుస్తోంది. కేపీ చౌదరి ఫోన్‌ను పూర్తిగా పరిశీలించి.. ఈ డ్రగ్స్‌ లింక్‌లో ఎవరెవరు ఉన్నారో? వారి పేర్లు  బయటపెడుతామని పోలీసులు తెలుపుతున్నారు.

(ఇదీ చదండి: తమన్నాతో లవ్.. ఆ సమయం కోసం వెయిట్ చేశా: విజయ్ వర్మ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement