AP: జాబ్‌ పేరుతో నిరుద్యోగులకు టోకరా.. వీఆర్వో రేఖ అరెస్ట్‌ | VRO Rekha Arrested For Cheating Unemployed Name Of Job | Sakshi
Sakshi News home page

AP: జాబ్‌ పేరుతో నిరుద్యోగులకు టోకరా.. వీఆర్వో రేఖ అరెస్ట్‌

Published Sun, May 28 2023 11:15 AM | Last Updated on Sun, May 28 2023 11:15 AM

VRO Rekha Arrested For Cheating Unemployed Name Of Job - Sakshi

సాక్షి, విజయవాడ: నిరుద్యోగులను టార్గెట్‌ చేసి ఉద్యోగాల పేరుతో మోసం చేసిన మహిళా వీఆర్వోను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన విజయవాడ పరిధిలో చోటుచేసుకుంది. నిరుద్యోగులకు ఔట్‌ సోర్సింగ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని సదరు మహిళ డబ్బులు వసూలు చేసింది. 

వివరాల ప్రకారం.. వీఆర్వో రేఖ కొంత మందితో కలిసి నిరుద్యోగులకు టోకరా వేసింది. ఔట్‌ సోర్సింగ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడింది. ఈ క్రమంలో నిరుద్యోగుల నుంచి రూ.3లక్షల నుంచి రూ.8లక్షల చొప్పున వసూలు చేసింది. దీంతో, ఉద్యోగాల విషయమై ఆమెను ప్రశ్నించడంతో ముఖం చాటేసింది. ఈ నేపథ్యంలో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు.. సూర్యారావుపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇక, బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 

ఇది కూడా చదవండి: పెళ్లింట తీవ్ర విషాదం.. వరుడు సహా అక్కాచెల్లి మంటల్లో సజీవ దహనం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement