వేడి వేడి టార్చి...
సాధారణంగా కరెంటు పోయినప్పుడో.. రాత్రివేళ బయటకు వెళ్లినప్పుడో వెలుతురు కోసం టార్చిలైటు ఉపయోగిస్తాం. కానీ ఈ టార్చిలైటు కాంతినే కాదు.. వేడిని కూడా ఇస్తుంది. ఆ వేడి ఎంత ఉంటుందంటే.. దాంతో చక్కగా ఆమ్లెట్ కూడా వేసేసుకోవచ్చు. ఏదైనా ప్లాస్టిక్ ప్లేటును దాని దగ్గరగా పెట్టి ఈ లైటు వేస్తే.. అది ఏకంగా ఇలా మండిపోతుంది. అంతేకాదు.. మనకు ఎంత వెలుతురు అవసరమో, అందుకు తగ్గట్టుగా మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది.
అంటే, టార్చిలా ఉపయోగించుకోవచ్చు లేదా ఫోకస్ లైట్‌లానూ వినియోగించుకోవచ్చు. ఇందులోనిఅయాన్ బ్యాటరీ.. మనం అడ్జస్ట్ చేసుకున్న కాంతిని బట్టి 10 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు పనిచేస్తుంది. ఈ బల్బ్ సాధారణ టార్చిలైట్లలోని బల్బ్ కంటే 20వేల రెట్లు ఎక్కువ శక్తివంతమైంది. షాంఘైలోని విక్డ్ లేజర్స్ అనే సంస్థ రూపొందించిన ఈ టార్చి ధర దాదాపు రూ.12 వేలు.