
సూర్య శ్రీనివాస్, అమృత ఆచార్య జంటగా నటించిన సినిమా 'పరిగెత్తు పరిగెత్తు'. ఈ చిత్రాన్ని ఎన్ ఎస్ సినీ ఫ్లిక్స్ పతాకంపై ఏ యామిని కృష్ణ నిర్మించారు. రామకృష్ణ తోట దర్శకత్వంలో రూపొందిన ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ నెల 30న 'పరిగెత్తు పరిగెత్తు' సినిమా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ సందర్భంగా దర్శకుడు రామకృష్ణ తోట మాట్లాడుతూ.. ‘పరిగెత్తు పరిగెత్తు' మూవీని థియేటర్ రిలీజ్ కు తీసుకురావడం సంతోషంగా ఉంది. ఇటీవలే సెన్సార్ పూర్తి అయ్యింది. సెన్సార్ రిపోర్ట్ చాలా బాగుంది. వాళ్ల అభినందనలతో సినిమా మీద మాకు మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. సెన్సార్ నుంచి యూఏ సర్టిఫికెట్ వచ్చింది. ఈ ఉత్సాహంలో ఈ నెల 30 న థియేటర్లలో ''పరిగెత్తు పరిగెత్తు'' మూవీని విడుదల చేయబోతున్నాం. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో అద్భుతమైన కథ, కథనంతో ఈ చిత్రం రూపొందింది. ప్రేక్షకులకు నచ్చే అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉన్నాయి’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment