![Parigettu Parigettu Got Positive Response Hero Surya Srinivas Says - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/1/parugettu.jpg.webp?itok=0TlCyknx)
'పరిగెత్తు పరిగెత్తు' సినిమాకు మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు తప్పకుండా ఆదరణ ఉంటుందని ఆడియెన్స్ మరోసారి నిరూపించారు. నా క్యారెక్టర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది’ అన్నారు హీరో సూర్య శ్రీనివాస్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం పరిగెత్తు పరిగెత్తు. రామకృష్ణ తోట దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమృత ఆచార్య హీరోయిన్‌గా నటించింది. ఎన్ ఎస్ సినీ ఫ్లిక్స్ పతాకంపై ఏ యామిని కృష్ణ నిర్మించిన ఈ చిత్రం.. శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ..మేము ఎలాంటి రిజల్ట్ ఎక్స్ పెక్ట్ చేశామో ప్రేక్షకులు అంత మంచి హిట్ 'పరిగెత్తు పరిగెత్తు' సినిమాకు అందించారు. థియేటర్ దగ్గర సినిమాకు మంచి రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉంది. జెన్యూన్ టాక్ తో మా సినిమా ప్రదర్శితం అవుతోంది. ప్రతి షో కూ మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతూ, మరింత ఆదరణ దక్కుతోంది. ఈ విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్. అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment