ఇద్దరు స్నేహితుల కథే ‘ఈవీఓఎల్‌’ | Producer, Director Ram Yogi Velagapudi Talk About EVOL Movie | Sakshi
Sakshi News home page

ఇద్దరు స్నేహితుల కథే ‘ఈవీఓఎల్‌’

Published Sat, Jun 22 2024 5:10 PM | Last Updated on Sat, Jun 22 2024 5:10 PM

Producer, Director Ram Yogi Velagapudi Talk About EVOL Movie

సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు హీరోలుగా, జెన్నీఫర్‌ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ఈవీఓఎల్‌’ (ఏ లవ్‌స్టోరీ ఇన్‌ రివర్స్‌). తేడా బ్యాచ్‌ సినిమా సమర్పణలో రామ్‌ యోగి వెలగపూడి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది.

 ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో రామ్‌ యోగి వెలగపూడి మాట్లాడుతూ– ‘‘ఇద్దరు స్నేహితుల మధ్య అవగాహన నేపథ్యంలో సాగే కథే ఈ మూవీ. క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. హైదరాబాద్, వైజాగ్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌ కశ్యప్, కెమెరా: తేడా బ్యాచ్‌ సినిమా టీమ్‌. 

 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement